9, ఏప్రిల్ 2008, బుధవారం

సమాచారాన్ని వడకట్టి చూపించేలా


ఇంటర్నెట్ ఎంత అమూల్యమైన జ్ఞానాన్ని ఇస్తుందో అంత చెత్త సమాచారాన్ని కలిగి ఉంది. ఈ నేపధ్యంలో మీరు ఇంటర్నెట్ ని బ్రౌజ్ చేసేటప్పుడు పొరబాటున కూడా అశ్లీలమైన వెబ్ సైట్లు, జూదం , హ్యాకింగ్, క్రాకింగ్ వంటి నిషిద్ధ సమాచారం మీ స్క్రీన్ పై ప్రత్యక్షం కాకుండా నిరోధించాలంటే ProCon Latte అనే add-on ఇన్ స్టాల్ చేసుకోండి. ఇది ఆయా వెబ్ సైట్లలోని టెక్స్ట్ ఆధారంగా అభ్యంతరకరమైన వెబ్ సైట్లని అవి మనకు చేరుకోకముందే నిలిపి వేస్తుంది. అలాగే మనం పేర్కొన్న కొన్ని వెబ్ సైట్లు మాత్రమె ఓపెన్ అయి మిగిలిన అన్ని సైట్లు అసలు ఒపేనే కాని విధంగా కూడా దీనిని కాం ఫిగర్ చేయవచ్చు. చిన్న పిల్లలు ఉన్నా ఇళ్ళలో ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

దీర్గాయుష్మాన్ భవ ! సకల ఐస్వర్య,ఆరోగ్య ప్రాప్తిరస్తు! కలకాలం ఇలా మంచి సమాచారం ఇస్తూ ఉండాలని...అభినందనలతో...వాసు.బి

sivamani చెప్పారు...

chaalaa bagundi. Firefox 3 download chesukunaanu. Telugu newspapers chadavaleka pothunanu. Meeramaina sahayapadagalaraa.