5, జనవరి 2008, శనివారం

Cable Select గురించి తెలుసా మీకు?

SNAG-0001

ఇప్పుడైతే SATA హార్డ్ డిస్కులు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కానీ ఇప్పటికీ కొద్ది సంవత్సరాల క్రితం పాత కంప్యూటర్లు వాడేవారు IDE హార్డ్ డిస్క్ లు, సిడిరామ్ డ్రైవ్ లు, సిడి రైటర్లు వాడేవారు. వాస్తవానికి ఇప్పుడు మనం వాడుతున్న సిడి, డివిడి రైటర్లు కూడా అధికభాగం IDE వే ఉంటున్నాయి.  కేవలం హార్డ్ డిస్కుల విషయంలోనే SATA ఇంటర్ ఫేస్ కలిగిన వాటి వినియోగం పెరిగింది. IDE హార్డ్ డిస్క్/ సిడి రైటర్/డివిడి రైటర్ వంటి వాటిపై సహజంగా Master, Slave, Cable Select (కొన్ని మోడల్ హార్డ్ డిస్క్ లలో Limited Mode అనేదీ మరొకటి ఉంటుంది) అనే మూడు జంపర్ పిన్నులు పొందుపరచబడి ఉంటాయి. ఒక IDE కేబుల్ కి హార్డ్ డిస్క్ ని కానీ, సిడి రైటర్ ని గానీ Master డివైజ్ గా కనెక్ట్ చేయదలుచుకున్నట్లయితే జంపర్ ని పై చిత్రంలో విధంగా  Master అనే ప్రదేశం వద్ద గుచ్చాలి. ఒకవేళ అదే IDE కేబుల్ కి హార్డ్ డిస్క్/సిడి/డివిడి రైటర్ లను స్లేవ్ డిస్కులుగా అమర్చదలుచుకున్నట్లయితే Slave అనే ప్రదేశంలో జంపర్ ని సెట్ చేయాలి. అసలు మనం ఆ మూడు పిన్ లకు దేనికీ జంపర్ ని గుచ్చకపోయినా ఆ డివైజ్ స్లేవ్ క్రిందే పరిగణించబడుతుంది. ఇకపోతే మూడవ ఆప్షన్ అయిన Cable Select అనే సదుపాయం పలు సందర్భాల్లో ఉపయోగపడుతుంది. IDE కేబుల్ కి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్న రెండవ డివైజ్ ఏ స్థితిలో ఉందో గుర్తించి దానికి భిన్నమైన స్థితిలో ఈ జంపర్ సెట్టింగ్ డిస్క్ ని కాన్ఫిగర్ చేస్తుంది. ఉదాహరణకు అదే కేబుల్ కి Master డిస్క్ గా హార్డ్ డిస్క్ కనెక్ట్  చేయబడి ఉండి, డివిడి రైటర్ అదే కేబుల్ కి రెండవ డివైజ్ గా కనెక్ట్ చేయబడి, దానికి Cable Select స్థానంలో జంపర్ గుచ్చబడి ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా డివిడి రైటర్ Slave డివైజ్ గా పరిగణించబడుతుందన్నమాట.

కామెంట్‌లు లేవు: