2, జనవరి 2008, బుధవారం

ఆకర్షణీయమైన ఫ్లాష్ ప్రజంటేషన్‌లకు..వ్యాపార, విద్యారంగాలలో ఎంతో నాణ్యతతో తక్కువ పరిమాణంలో ఇమిడిపోయే ఫ్లాష్ ప్రజంటేషన్లకు ఎంతో ప్రాధాన్యత లభిస్తోంది. అయితే Flash MX ప్రోగ్రామ్‌ని నేర్చుకోవడం సులభంగా సాధ్యపడే వ్యవహారం కాదు. ఈ నేపధ్యంలో PowerBullet అనే సాఫ్ట్ వేర్ సాయంతో PNG, GIF, JPEG వంటి ఇమేజ్ ఫార్మేట్లు, MP3, WAV వంటి ఆడియో ఫార్మేట్లకు చెందిన ఫైళ్ళ ఆధారంగా మనకు నచ్చిన విధంగా ఆటోమేటీక్‌గా ప్లే అయ్యే ఆకర్షణీయమైన ఫ్లాష్ ప్రజంటేషన్లని చాలా సులభంగా రూపొందించుకోవచ్చు. ప్రజంటేషన్‌లో ప్లే అయ్యే ప్రతీ పేజీకి ట్రాన్షిషన్ ఎఫెక్టులు జత చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌లను పుల్ స్క్రీన్‌లో ప్లే చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌తో పాటు అందులోని సౌండ్ సింక్రనైజ్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజంటేషన్‌ని EXE ఫైల్‌గా కూడా సేవ్ చేసుకోగలము.

1 కామెంట్‌:

ప్రదీపు చెప్పారు...

ప్రజంటేషన్లకు పనికిరాకపోయినా, కంప్యూటరులో మనం చేస్తున్న పనిని వీడియోగా చిత్రీకరించి, ఫ్లాషు ఫైలుగా భద్రపరచుకోవడానికి వింక్ అనే సాఫ్టువేరు బాగా ఉపయోగపడుతుంది.