14, నవంబర్ 2007, బుధవారం
ZIP రూపంలో ఉన్న సాఫ్ట్ వేర్లని ఇన్‍స్టాల్ చెయ్యడం
కొన్ని సాఫ్ట్‌వేర్లు కంప్రెస్ చెయ్యబడి ఉంటాయి. వాటిని మౌస్‌తో డబుల్‌క్లిక్ చేసినప్పుడు వెంటనే WinZip ప్రోగ్రామ్ ఓపెన్ అయి, ఆ కంప్రెస్డ్ ఫైల్‌లో నిక్షిప్తం చెయ్యబడిన ఫైళ్ళ వివరాలను చూపిస్తుంది. ఇలాంటి సాఫ్ట్‌వేర్లని ఇన్‌స్టాల్ చెయ్యవలసి వచ్చినప్పుడు చాలామంది WinZip లోని Extract ఆప్షన్ ద్వారా వాటన్నింటినీ టెంపరరీ ఫోల్డర్లోకి Uncompress చేసి, ఆ తర్వాత ఆ టెంపరరీ ఫోల్డర్‌లోకి వెళ్ళి Setup ఫైల్‌ని డబుల్‌క్లిక్ చేసి ఇన్‌స్టలేషన్ చేసుకుంటారు. ఇలా చెయ్యడం వల్ల చాలా సమయం వౄధా అవుతుంది. దానికి బదులు నేరుగా WinZip సాఫ్ట్‌వేర్ నుండే ఇన్‌స్టలేషన్ మొదలు పెట్టవచ్చు. కంప్రెస్డ్ స్థితిలో ఉన్న జిప్‌ఫైల్‌ని డబుల్ క్లిక్ చేసిన వెంటనే WinZip సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవుతుందని చెప్పుకున్నాం కదా! అక్కడ ఆప్షన్ బార్‌లో Install అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఓ డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. సింపుల్‌గా అక్కడ OK బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇన్‌స్టలేషన్ మొదలైపోతుంది. మనకు తెలియకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో జిప్ చెయ్యబడి ఉన్న ఇన్‌స్టలేషన్ ఫైళ్ళన్నీ వేగంగా టెంపరరీ ఫోల్డర్‌లోకి Unzip అయి ఇన్‌స్టలేషన్ పూర్తయిన వెంటనే ఆ టేంపరరీ ఫైళ్ళు తొలగించబడతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి