
ఎంతో కష్టపడి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకున్న మీ వెబ్‌సైట్‌ని అందరూ కేవలం ఓపెన్ చేసి తమకు కావలసిన సమాచారం తెలుసుకుని వెళ్ళిపోతున్నారా !!!.. విజిట్ చేసే యూజర్లు మీ వెబ్‌సైట్ గురించి మీ అభిప్రాయాలను మీతో పంచుకుంటే బాగుంటుందని భావిస్తున్నారా? అయితే reviewbasics అనే వెబ్‌సైట్‌లో లభించే ఉచిత సర్వీస్ మీకు ఉపయోగపడుతుంది. మీ వెబ్‌సైట్ యొక్క స్క్రీన్‌షాట్‌ని కేప్చర్ చేసి reviewbasics సైట్‌కి అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు మీ వెబ్‌సైట్‌లో ఎక్కడోచోట... "మీ అభిప్రాయాలను తెలియజెయ్యదలుచుకుంటే ఈ లింక్‌ని క్లిక్ చేయండి" అని రివ్యూబేసిక్స్ సైట్‌కి లింక్‌ని పొందుపరచండి. అంటే ఒకసారి విజిటర్లు మీ స్క్రీన్‌షాట్ ఉన్న పేజీలోకి వెళ్ళిన తర్వాత మీ సైట్‌లో తమకు నచ్చిన భాగాలను కలర్‌తో హైలైట్ చేయొచ్చు. Sticky నో, స్మైలీలను జతచేయగలుగుతారు.
1 కామెంట్:
నమస్కారం శ్రీధర్ సార్ గారు.....
మీ బ్లాగ్ చాలా చాలా ఉపయోగ పడుతుంది.... మీకు తెలుగు బ్లాగ్ వ్రాస్తున్న వారందరి తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను......
నకు ఒక సందేహం కలదు, మీ బ్లాగ్‌లో పైన అమర్చిన స్క్రోల్ ఎలా మా బ్లాగ్ లొ అమర్చాలో తెలపగలరు... దయచేసి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి