
కొన్ని వెబ్‌పేజీలను ఓపెన్ చెయ్యగానే అందులోని అడ్వర్టైజ్‌మెంట్లు అలల్లో తేలిపోతున్నట్లు కనిపిస్తుంటాయి. ఒక్కసారిగా మాయమై కొన్ని భాగాలుగా ఏర్పడుతూ తిరిగి పూర్తిరూపం సంతరించుకుంటున్నాయి. ఇమేజ్‌లపై ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను ఎలా క్రియేట్ చేయవచ్చన్న సందేహం మీకు తలెత్తి ఉండవచ్చు. Pixifex అనే సాఫ్ట్ వేర్ గనుక మీవద్ద ఉన్నట్లయితే ఇలాంటి పలు రకాల ఎఫెక్టులను మీ హార్డ్‌డిక్స్‌లో స్టోర్ చేయబడిఉన్న ఫోటొలపై అప్లై చేసి వాటిని వెబ్‌పేజీలుగా పబ్లిష్ చేసుకోవచ్చు లేదా SWF ఏనిమేషన్లుగా సేవ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏనిమేషన్లుగా సేవ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏనిమేషన్ ఎఫెక్టులను తయారు చెయ్యడానికి ఉపకరించే Flax సాఫ్ట్ వేర్ని రూపొందించిన Goldshell సంస్థ వారే ఇమేజ్‌లకు అదే మాదిరి పలు రకాల ఎఫెక్టులను అప్లై చెయ్యడానికి ఈ సాఫ్ట్ వేర్ని డెవలప్ చేశారు.
2 కామెంట్‌లు:
బ్లాగ్స్పాట్ లో దీనికి సప్పోర్ట్ వుందా?
సిబి.రావు గారూ, బ్లాగులలో అయితే నేను పరిశీలించలేదు. సాధారణ వెబ్ సైట్లలో అయితే భేషుగ్గా పొందుపరుచుకోవచ్చు.
-నల్లమోతు శ్రీధర్
కామెంట్‌ను పోస్ట్ చేయండి