14, నవంబర్ 2007, బుధవారం
వీడియో సిడిల్లోని మూవీ కాపీ చేసుకోవాలా?
మీకు నచ్చిన వీడియో సిడిల్లోని వీడియోని కాపీ చేసుకోవాలనుకుంటున్నారా? విసిడిలో CDI, EXT, SEGMENT, MPEGAV, VCD వంటి పేర్లతో పలు ఫోల్డర్లు కనిపిస్తుంటాయి. వాటిలో MPEGAV అనే ఫోల్డర్‌లో మనం కాపీ చేసుకోవలసిన వీడియో ఫైళ్ళు స్టోర్ చెయ్యబడి ఉంటాయి. ఈ వీడియో ఫైళ్ళు .DAT ఎక్స్‌టెన్షన్ నేమ్‌ని కలిగి ఉండీ, సాధారణంగా AVSEQ01, AVSEQ02 మాదిరి పేర్లని కలిగి ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకుని Ctrl+C కమాండ్‌తో కాపీ చేసుకుని హార్డ్‌డిస్క్‌లో వాటిని ఎక్కడైతే సేవ్ చేయ్యాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి Ctrl+V కీబోర్డ్ షార్ట్‌కట్‌తో పేస్ట్ చేస్తే సరిపోతుంది. లేదా కాపీ, పేస్ట్‌లకు మెనూలోని ఆప్షన్లని ఉపయోగించుకోవచ్చు.
2 కామెంట్లు:
శ్రీధరు గారు,
మీరు ఈ టపాలోని మెదటి లైనును తొలగించాలనుకుంటా..
అద్దెకు తెచ్చుకున్న సి.డిలు కాపీ చేసుకోవడం లీగల్ కాదనుకుంటాను. ఇలాంటివాటిని బహిరంగంగా ప్రోత్సహించరాదు.
ok i ll do it..
కామెంట్‌ను పోస్ట్ చేయండి