
కొన్ని ప్రోగ్రాములను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉపయోగించేటప్పుడు Divide Overflow పేరిట ఎర్రర్ మెసేజ్ వచ్చి ఆ ప్రోగ్రామ్ ఉన్న ఫళంగా నిలిచిపోతుంటుంది. దీనికి కారణమేమిటంటే పాతకాలం ప్రోగ్రామర్లు సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేసేటప్పుడు 233MHz లేదా అంతకన్నా ఎక్కువ క్లాక్ స్పీడ్ కలిగిన ప్రాసెసర్లపై తమ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయబడేటప్పుడు... భారీ పరిమాణం గల సంఖ్యలను విడదీయడానికి టైమింగ్ ఆధారిత లూప్ ని ప్రోగ్రామ్ కోడ్ లో రాస్తుంటారు. ఈ లూప్ గనుక సంఖ్యలను విడదీయలేకపోతే వెంటనే స్ర్కీన్ పై Divide Overflow వంటి ఎర్రర్ మెసేజ్ లు చూపించబడతాయి. ఇది పూర్తిగా ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన లోపమే! ప్రోగ్రామింగ్ కంపైలర్లతో పాటు లభించే సాఫ్ట్ వేర్ లైబ్రరీలు ఇలాంటి సమస్యలకు కారణం అవుతుంటాయి. ముఖ్యంగా Borland TurboPascal కంపైలర్ ద్వారా తయారయ్యే ప్రోగ్రాముల విషయంలో ఈ సమస్య తలెత్తుతుంది.
2 కామెంట్‌లు:
శ్రీధర్ గారూ,ఇది కామెంట్ కాదు,నా అనుమానాన్ని క్లారిఫై చేసుకుందుకు మాత్రమే.నేను ఈమధ్య బ్లాగు ప్రాంభించాను. ఎవరు చూస్తున్నారు,ఎంతమంది చూస్తున్నరనే విషయాలు తెలుసుకునేందుకు ఒక దాని తర్వాత ఒకటి మూడు కౌంటర్లు పెట్ట్ ఆను.మూదు మూదు రకాలుగ చూపుతున్నై మీరు ఒక్క సారి నా బ్లాగు చూసి సందేహనివృత్తి చేయగలరు.
రాజేంద్ర దేవరపల్లి గారూ, మీరు సైట్ మీటర్, స్టాట్ కౌంటర్, blogpatrol అనే మూడు మీటర్లని మీ బ్లాగులో అమర్చారని గమనించాను. వాటిని మీరు వేర్వేరు తేదీల్లో అమర్చి ఉండవచ్చు. అలా చేసి ఉన్నట్లయితే మీరు ఏ మీటర్ ని ఏ రోజు అమర్చాలో అప్పటి నుండే అది లెక్కించడం ప్రారంభిస్తుంది. మీ బ్లాగు ని పరిశీలించిన మీదట ప్రధాన కారణం ఇదే అనిపిస్తోంది. అలాగే ఒక్కో మీటర్ వేర్వేరు సమయాల్లో విజిట్స్ ని అప్ డేట్ చేస్తూ ఉంటుంది. మూడింటికీ మధ్య కొద్దిపాటి విజిట్స్ వ్యత్యాసం ఉంటే ఈ రెండవ అంశం కారణం కావచ్చు. మీ విషయంలో మొదటిదే కారణమయి ఉండవచ్చని నాకు అనిపిస్తోంది.
- నల్లమోతు శ్రీధర్
కామెంట్‌ను పోస్ట్ చేయండి