1, నవంబర్ 2007, గురువారం
ఈ బోర్డ్ లపై టివి ట్యూనర్ వాడుతున్నారా!!
మీ సిస్టమ్‌లో VIA చిప్‌సెట్‌కి చెందిన మదర్‌బోర్డ్ అమర్చబడి ఉండీ, ఆన్‌బోర్డ్ Savage3D వీడియో చిప్ ఉన్నట్లయితే, ఏ కంపెనీకి చెందిన టివి ట్యూనర్ కార్డ్ అమర్చినా Overlay మోడ్‌కి సంబంధించి సమస్యలు తలెత్తుతాయి. Savage 3D వీడియో చిప్ Direct3D ని సపోర్ట్ చెయ్యకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ నేపధ్యంలో ఇంటర్నెట్‌లో VIA సంస్థ వెబ్‌సైట్‌కి వెళ్ళి లేటేస్ట్ Savage 3D డిస్‌ప్లే డ్రైవర్లని డౌన్‌లోడ్ చేసుకుని వాటిని సిస్టమ్‌లో అప్‌డేట్ చెయ్యడం వల్ల పరిష్కారం పొందవచ్చు. అలాగే, Realtek ALC-650 ఆన్‌బోర్డ్ చిప్‌లు కలిగి ఉన్న సిస్టమ్‌ల నుండి టివి ట్యూనర్ కార్డ్ ద్వారా ప్రోగ్రాములను కేప్చర్ చేసేటప్పుడు సౌండ్ కేప్చరింగ్‌కి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. Realtek వెబ్‌సైట్ నుండి లేటెస్ట్ డ్రైవర్లను, ప్యాచ్‌ని మీరు ఏ టివి ట్యూనర్‌కార్డ్ వాడుతున్నా తప్పనిసరిగా బయటి నుండి వచ్చిన కేబుల్ పిన్‌కి సర్జ్‌ప్రొటెక్టర్‌ని కనెక్ట్ చేయండి, లేదంటే కేబుల్ పిన్ ద్వారా సిస్టమ్‌లోకి చేరుకునే surges సిస్టమ్‌లోని ముఖ్యమైన భాగాలను దెబ్బతీసే అవకాశముంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి