ఫైళ్ళని సక్రమంగా నిర్వహించుకోనిదే కంప్యూటర్ ద్వారా ప్రయోజనం పొందడం సాధ్యపడదు. ఫైళ్ళని క్రియేట్ చేసుకోవడానికి వాటిని ఫోల్డర్లలో స్టోర్ చేసుకోవడానికి వీలు కల్పించే విండోస్ డిఫాల్ట్ సదుపాయాలతో పాటు వివిధ సందర్భాల్లో ఫైళ్ళని మేనేజ్ చెయ్యడానికి ఉపకరించే పలు ధర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు లభిస్తున్నాయి. ఫైళ్ళని మేనేజ్ చేసుకునే భిన్నమైన మార్గాల గురించి తెలుసుకుందాం.
ముక్కలు చెయ్యడానికి,కలపడానికి
4MB సైజ్‌గల ఫైల్‌ని ఫ్లాపీలో కాపీ చేయవలసి వస్తే సాధ్యపడదు కదా! అలాగే 1GB సైజ్‌గల ఒక ఫైల్‌ని నేరుగా సిడిలో రైట్ చేయలేం. అలాంటప్పుడు మనం కోరుకున్న పరిమాణంలో ఫైళ్ళని విడగొట్టడానికి , ఆల్రెడీ విడగొట్టబడి ఉన్న ఫైళ్ళని తిరిగి సింగిల్ ఫైల్‌గా జాయిన్ చేయ్యడానికి File Splitter, AxMan, Dariolius.Pro Splitter, GSplit వంటి సాఫ్ట్‌వేర్లు ఉపయోగపడుతుంటాయి.
భారీమొత్తంలో ఫైళ్ళ పేర్లు మార్చడానికి
డిజిటల్ కెమెరాల నుండి ఫోటోలను సిస్ట్‌లోకి ట్రాన్‌స్ఫర్ చేసుకునేటప్పుడు అన్ని ఫోటోలుDSC001,DSC002... వంటి ఒకే తరహా పేర్లతో స్టోర్ చెయ్యబడతాయి. వందలకొద్ది ఉండే ఇలాంటి ఫైళ్ళ యొక్క పేర్లని ఒకటోకటిగా మార్చడం చాలా కష్టమైన వ్యవహారం. భారీ సంఖ్యలో ఉన్న ఏ తరహా ఫైళ్ళనైనా మనం కోరుకున్న సీక్వెన్స్‌లో క్షణాల్లో రీనేమ్‌చెయ్యడానికి... Rename4U, Bulk Rename Utility, Rename Master, Lupas Rename వంటి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాములు అవసరం అవుతుంటాయి.
ఫైళ్ళు ఇతరులు ఓపెన్ చెయ్యకుండా
మన సిస్టమ్‌లో ఉన్న ముఖ్యమైన ఫైళ్ళని ఇతరులు చూడకుండా జాగ్రత్తపడాలంటే థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లపై ఆధారపడవలసి వస్తుందే. ఒకసారి పాస్‌వర్డ్ సెట్ చేసిన తర్వాత కేవలం పాస్‌వర్డ్ కరెక్ట్‌గా టైప్ చేస్తేనే ఆయా ఫైళ్ళని ఓపెన్ చేసి పెట్టే ఎన్‌క్రిప్షన్ సాఫ్ట్‌వేర్లని ఉపయోగించడం మంచిది.ఇలాంటి ప్రోగ్రాముల్లో Encrypt-it, Encryption Protection, Stealth File Encryptor, Encrypt Genie వంటి పలు సాఫ్ట్‌వేర్లు నెట్‌పై అందుబాటులో ఉన్నాయి.
ఫైళ్ళ పరిమాణాన్ని కుదించడానికి.
విలువైన హార్డ్‌డిస్క్ స్పేస్‌ని ఆదా చేసుకోవడం కోసం ప్రస్తుతం అంతగా అవసరం లేని ఫైళ్ళని కంప్రెస్ చేసుకుని స్టోర్ చేసుకోవడం మంచిది. WinME, Xp ఆపరేటింగ్ సిస్టమ్‌లలో Compressed Folders అనే సదుపాయం పొందుపరచబడినా దానికన్నా సాధ్యమైనంత ఎక్కువ పరిమాణంలో ఫైళ్ళ పరిమాణాన్ని కుదించే WinRar, WInZip, WinACE,CoolZip, Zip-n-Go వంటీ సాఫ్ట్‌వేర్లు అనేక సందర్భాల్లో ఉపయుక్తంగా ఉంటాయి. ట్రై చేసి చూడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి