14, జూన్ 2014, శనివారం

మీ చేతిలోకి తీసుకోగానే ఫోన్ స్క్రీన్ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే ఆన్ అయిపోవాలా..? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=dAKMsmWV5nY

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఛాటింగ్ చేయాలన్నా, బ్రౌజింగ్ చేయాలన్నా ముందు ఫోన్ పవర్ గానీ Home బటన్లని గానీ ప్రెస్ చేసి డిస్‌ప్లే ఆన్ చేసుకుంటే గానీ ముందుకు సాగడం కుదరదు. ఇలా మాటిమాటికీ పవర్ బటన్ నొక్కడం వల్ల కొన్నాళ్ల తర్వాత పవర్ బటన్ పాడైపోయే సందర్భాలూ ఎదురవుతుంటాయి.

ఈ వీడియోలో నేను చూపించే టెక్నిక్ ఫాలో అయితే ఇక మీరు చేతిలోకి ఫోన్ తీసుకోగానే డిస్‌ప్లే దానంతట అదే ఆన్ అవుతుంది. మళ్లీ ఫోన్ ఎక్కడైనా డెస్క్‌పై పెట్టగానే స్క్రీన్ అదే ఆఫ్ అవుతుంది. ఈ టెక్నిక్ బాగుంది కదూ.. అయితే చూసేయండి ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో!

గమనిక:  ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=dAKMsmWV5nY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: