15, సెప్టెంబర్ 2013, ఆదివారం

మీ టివిలో ఇలాంటి సమస్యలు రావచ్చు.. భయపడకండి.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: http://bit.ly/sritvrepair
వేలకు వేలు ఖర్చుపెట్టి కొన్న టివి పాడైపోతే... సర్వీస్ సెంటర్ల వాళ్లు 10 వేలు, 20 వేలు అవుతుంది అని భయపెడితే.. ఏం చేయాలి?

ఇప్పుడు మనం అందరం భారీ మొత్తంలో ఖర్చుపెట్టి ఖరీదైన LCD, LED, 3D టివిలు కొంటున్నాం సరే.... కానీ వాటిలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి..అలా సమస్యలు వచ్చినప్పుడు ఆ టివిలో ఏమేం భాగాలుంటాయో, ఎలాంటి సమస్యలు వస్తాయో మనకు తెలిసుంటే సర్వీస్ సెంటర్ వాళ్లనూ, టెక్నీషియన్‌నీ నిలదీయొచ్చు కదా!

అందుకే ఈ వీడియో మీ కోసం ప్రాక్టికల్ గా షూట్ చేసి పెడుతున్నాను.. అక్షరాలా లక్ష రూపాయల 3D టివిని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు... ఆడియో వస్తుంది కానీ, వీడియో రాదు.... మధ్య మధ్యలో కాసేపు వచ్చి పోతుంటుంది.

శాంసంగ్ సర్వీస్ సెంటర్ వాళ్లు స్క్రీన్ పోయుండొచ్చు రూ. 30 వేలు అవుతుంది అన్నారు... కానీ సమస్య అది కాదు... కెపాసిటర్ల సమస్య అనుకున్నాను అదీ కాదు...

అస్సలు పైసా ఖర్చుపెట్టకుండా ఎంత ఈజీగా సాల్వ్ అయిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

మనకు తెలీపోతే ఎవరైనా మోసం చేయొచ్చు. లక్కీగా ఓ మంచి టెక్నీషియన్ దొరికాడు కాబట్టి ఇంత ఈజీగా నాకు సాల్వ్ అయింది.

ఈ వీడియో చూస్తే మీ టివిల మీదా మీకు అవగాహన వస్తుంది.

గమనిక: టివి వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sritvrepair

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్ ఎడిటర్
 కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu

కామెంట్‌లు లేవు: