20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఛాట్ చేస్తూ పనిచేయడం కష్టమవుతోందా? అద్భుతమైన సొల్యూషన్ Must Shareవీడియో లింక్ ఇది: http://bit.ly/sriworkchat

Facebook, Google Hangouts వంటి అప్లికేషన్లలో ఫ్రెండ్స్ ఏమైనా మెసేజ్‌లు పెట్టారేమో ఛెక్ చేసుకోవడానికే చాలామందికి చాలా time వేస్ట్ అవుతూ ఉంటుంది.

ఆఫీసుల్లో పనిచేసే వారు ఓ వైపు ఛాట్ చేస్తూ మరో వైపు ఆఫీస్ పని చేసుకుందామని అనుకుంటారు గానీ.. చీటికీ మాటికీ ఆన్‌లైన్‌లో ఉన్న ఫ్రెండ్ నుండి కొత్తగా ఏదైనా మెసేజో, రిప్లైనో వచ్చిందో ఛెక్ చేసుకోవడానికి ఓ విండో నుండి మరో విండోకి వెళ్తూ వస్తూ చిరాకు వస్తుంటుంది.

దీంతో చేయాల్సిన పనులూ పెండింగ్ పడుతుంటాయి. అలాగని మనస్ఫూర్తిగా ఛాటింగ్ చెయ్యడమూ కుదరదు.

ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ ఫాలో అయితే ఓ వైపు మన పని చేసుకుంటూనే మరో వైపు అవతలి వారు రిప్లై ఏమైనా ఇస్తే మనం ఇప్పుడు పని చేస్తున్న విండో నుండే దాన్ని గమనించే అవకాశముంది.

ప్రతీ ఒక్కరి ప్రొడక్టివిటీకీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: http://bit.ly/sriworkchat

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
 http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు: