22, సెప్టెంబర్ 2013, ఆదివారం

విండోస్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఇలా రీసెట్ చేసుకోండి..


విండోస్ లోకి ఎంటర్ కావడానికి పాస్ వర్డ్ మర్చిపోయారనుకుందాం..

"ఇంకేముంది.. కంప్యూటర్ ని ఫార్మేట్ చేయాల్సిందే.. లాభం లేదు" అని చాలామంది సలహాలిచ్చేస్తుంటారు.

కేవలం మీరు వాడే విండోస్ పాస్ వర్డ్ ని (అది అడ్మిని స్ట్రేటర్ అకౌంట్ కావచ్చు, సాధారణ యూజర్ అకౌంట్ కావచ్చు) మర్చిపోయిన పాపానికి format చేసేయడమేనా శిక్ష?

ఈ వీడియో చూడండి.. నేను స్వయంగా పాస్ వర్డ్ ని మర్చిపోయి.. అలా మర్చిపోయిన దాన్ని ఎంత ఈజీగా రీసెట్ చేశానో, ప్రాబ్లెం ఎంత ఫాస్ట్ గా సాల్వ్ అయిందో అర్థమవుతుంది.

ఎవరైనా కావచ్చు.. పాస్ వర్డ్ ని మర్చిపోయారు కదా అని విండోస్ ని వదులుకోవలసిన పనిలేదు. దాన్ని చాలా సులభంగా రీసెట్ చేసుకోవచ్చు.

దీనికోసం పలు పద్ధతులు వాడుకలో ఉన్నా నేను చాలా సులభమైన పద్ధతిని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో చూశారంటే ఇక ఇది చాలా చిన్న సమస్య అన్పించేస్తుంది మీకు!

 - నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

కామెంట్‌లు లేవు: