22, మార్చి 2008, శనివారం

లాప్ టాప్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ ఇవ్వాలంటే...


రూ.26 వేల రూపాయల నుండే ప్రాధమిక స్థాయి లాప్ టాప్ లు లభిస్తుండడంతో ఇటీవలి కాలంలో చాలామంది లాప్ టాప్ ల కొనుగోలుకి మొగ్గు చూపుతున్నారు. లాప్ టాప్ విషయంలో ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్! ఖరీదైన మోడళ్ళు అయితె నాలుగు గంటలకు మించి బ్యాటరీ బ్యాకప్ లభించదు. ఈ నేపధ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ బ్యాటరీ ఇప్పటికన్నా ఎక్కువ సమయం వచ్చేలా చేయవచ్చు. కేవలం ప్రస్తుతం పనిచేస్తున్న అప్లికేషన్లని మాత్రమే ఓపెన్ చేసి మిగిలిన వాటిని క్లోజ్ చేయండి. బ్యాటరీపై నడిచేటప్పుడు స్క్రీన్‍ని డిమ్ చేయండి. లాప్ ‍టాప్ అడుగుభాగంలో వేడి బయటికి ప్రసరించడానికి holes ఉంటాయి. వేడి బయటకు వెళ్ళకుండా ఆ holes కి ఏదైనా అడ్డుగా ఉంటే లోపలి ఉష్ణోగ్రతలు పెరిగి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. అలాగే బ్యాటరీపై నడిచేటప్పుడు డివిడి మూవీలను చూడడం గానీ, ఎక్కువ సిస్టమ్ వనరులను ఉపయోగించుకునే త్రీడి గేమ్‍లను ఆడడం గానీ చేయకండి. USB పోర్టులకు కనెక్ట్ చేసుకునే డివైజ్‍ల సంఖ్య పెరిగే కొద్ది వాటికి విద్యుత్ సరఫరా చేయబడుతుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. వీలైనన్ని తక్కువ USB డివైజ్‍లను కనెక్ట్ చేయండి. లాప్‍టాప్‍ని Standby, Hibernate చేయకండి. నేరుగా సూర్యకాంతిలో వాడకండి. Wireless LAN (WLAN) , Bluetooth వంటి అదనపు సదుపాయాలని అవసరం లేనప్పుడు డిసేబుల్ చేయండి. బ్యాటరీ ఆదా అవుతుంది.


4 కామెంట్‌లు:

యడవల్లి శర్మ చెప్పారు...

శ్రీధర్ గారూ...26వేల రూపాయలండి...

మన రూపాయి విలువ బాగా పెరిగి మీ నోటి మాట ఫలించి

26 రూపాయలకే వచ్చే రోజుకై ఎదురు చూద్దాం.
-యడవల్లి.

నల్లమోతు శ్రీధర్ చెప్పారు...

సత్యనారాయణ శర్మ గారు, తప్పుని సరిచేశానండి, మంచి చతురతతో పొరబాటుని దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు.

- నల్లమోతు శ్రీధర్

రాఘవ చెప్పారు...

Very useful to me!

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారు, బ్యాటరీ లైప్ పెంచుకొవటానికి ప్రత్యేకమైన పరికరాలు ఎవైనవుంటె తెలియచేయగలరు