4, మార్చి 2008, మంగళవారం

ఆడిటింగ్ అంటే ఎమిటో తెలుసా ?



ఏదైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలొ ఉన్న కంప్యూటర్లు, ఇతర మౌలిక వనరులను విశ్లేషించి, వాటి ఇంటిగ్రిటీని తనిఖీ చేయడంతోపాటు రక్షణా పరమైన లోపాలు ఏమైనా ఉన్నాయేమో గుర్తించి చేప్పే ప్రక్రియను EDP Audit అంటారు. సహజంగా ఈ తరహా ఆడిట్లని నిర్వహించడానికి ప్రతీ సంస్థలోనూ EDP Auditor పేరిట ఓ వ్యక్తి నియమించబడి ఉంటాడు ఆడిట్ నిర్వహించడానికి audit softwareలు ఉపయోగించబడుతుంటాయి. ఇవి సంస్థ యొక్క డేటాబేస్‍లను శాంప్లింగ్ చేసి సంస్థ ఖాతాదారులకు , మన సంస్థకు వనరులు సమకూర్చే వెండర్లకు కన్ఫర్మేషన్ లెటర్లు పంపిస్తుంటాయి. సంస్థ యొక్క ఐటి వనరులను విశ్లేషించడానికి Intely Audit వంటి ఆడిటింగ్ సాఫ్ట్ వేర్లు వాడబడుతుంటాయి. వివిధ రకాలైన ఆడిటింగ్ సాఫ్ట్ వేర్లు వేర్వేరు ప్రయోజనాలను సాధించి పెడతాయి. కొన్ని ప్యాకేజీలు రుజువులను సేకరించడానికి ఉపకరిస్తే మరికొన్ని ఎనలటికల్ పరీక్షలునిర్వహించడానికి, మరికొన్ని సంస్థ అంతర్గత నియంత్రణని విశ్లేషించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆడిట్ నిర్వహించబడిన తర్వాత ఆ వివరాలను డాక్యుమెంట్ల రూపంలో పొందుపరచడానికి, నిర్ధిష్ట సమయంలో ఆడిట్ నిర్వహించబడేలా కాన్ఫిగర్ చేయడానికి, ఎక్సెప్షన్ రిపోర్టులను ప్రింట్ చేయడానికి ఇలా పలు రకాల పనులను చేయడానికి సాఫ్ట్ వేర్లు లభిస్తుంటాయి.

1 కామెంట్‌:

Kiran చెప్పారు...

శ్రీధర్ గారు కాస్త ఆలస్యంగా చెబుతున్నా.. మీకు జన్మ దిన శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.