8, మార్చి 2008, శనివారం

డివైజ్ డ్రైవర్లని సక్రమంగా తొలగించకపోతే


ఏదైనా హార్డ్ వే పరికరాన్ని సిస్టమ్ నుండి తొలగించిన తర్వాత దాని డివైజ్ డ్రైవర్లని కూడా తీసేయడం ఉత్తమం. అలాగే మీ డివైజ్ డ్రైవర్లని లేటెస్ట్ వెర్షన్‍తో అప్‍గ్రేడ్ చేసుకునే ముందు పాత డ్రైవర్లని డివైజ్ మేనేజర్ ద్వారా uninstall చేసుకోండి. నిరుపయోగంగా లేదా పాతవి,,కొత్తవి రెండు వెర్షన్లుగా సిస్తమ్‍లో పేరుకుని పోయే డివైజ్ డ్రైవర్లు బూటింగ్ సమయంలో సమస్యాత్మకంగా పరిణమిస్తాయి. ఏయే డివైజ్ డ్రైవర్లు మీ సిస్టమ్‍లో వృధాగా పడి ఉన్నాయో మీరు గుర్తించకపోతే ఇంటర్నెట్‍లో Driver Sweeper పేరిట ఓ సాఫ్ట్ వేర్ లభిస్తుంది. అది డౌన్‍లోడ్ చేసుకుని ఇన్‍స్టాల్ చేయండి. అది సిస్టమ్ మొత్తాన్ని స్కాన్ చేసి వృధాగా పడి ఉన్న డివైజ్ డ్రైవర్లని చూపిస్తుంది. వాటిని నిస్సందేహంగా తొలగించవచ్చు.

1 కామెంట్‌:

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారు, ఈ సాప్ట్‍వేర్ క్రింద ఇవ్వబడిన కంపనీ డ్రైవర్ల ని మాత్రమె తొలగిస్తుంది.
AGEIA (PhysX)
ATI (Display)
Creative (Sound)
Microsoft (Mouse)
NVIDIA (Display)
NVIDIA (Chipset)
Realtek (Sound)
ఒవరాల్‍గా చూస్తె పెద్దగా ఉపయోగపడని సాప్ట్‍వేర్.