15, మార్చి 2008, శనివారం

ఎ కలర్ పేరేమిటో మీకు తెలుసా ?



చాలా మంది ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, ఆకుపచ్చ, నలుపు, మేజెంటా వంటి రంగులు మాత్రమే చెప్పగలుగుతారు. మనం తరచుగా చూస్తూ కూడా వాటి పేర్లు తెలియని అనేక రంగుల పేర్లు తెలుసుకోదలుచుకుంటే name-that color -అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి డ్రాప్ డౌన్ లిస్టు లో కన్పించే వేర్వేరు వర్ణాలను తనివితీరా వీక్షించి వాటి పేర్లు తెలుసుకోవచ్చు. అలాగే ఏవైనా వర్ణాల యొక్క RGB విలువలను ఇచ్చినా వాటి పేరు లభిస్తుంది. చిరాగ్ మెహతా అనే భారతీయుడు రూపొందించాడు ఈ సదుపాయాన్ని.

3 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

that's cool - I always get confused among the different shades of blue and different shades of pink.
మన తెలుగు మహిళలకి మాత్రమే తెలిసిన చీరల రంగుల్తో ఎవడన్ణా ఒక సైటు రూపొందిస్తే .. రంగు గుర్తు పట్టలేని భర్తల పాలిటి దేవదూత అవుతారు! నేరేడు పండు రంగు, కాఫీ పొడి రంగు ..అన్నిటినీ మించింది మస్టర్డ్ రంగు.

M.Srinivas Gupta చెప్పారు...

Java script, HTML లాంటి వెబ్ డిజైన్ నెర్చుకునేవారికి మంచి సైట్

అజ్ఞాత చెప్పారు...

శ్రీధర్ గారూ,బ్లాగ్ లో మీరు "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" క్రింద ఒక మూవింగ్ బార్ పెట్టారు ఎలా?