చదివిన తర్వాత మెసెజ్ కనిపించకుండా చెయలా?
రాసింది
నల్లమోతు శ్రీధర్
వర్గములు
తెలుసుకుందాం
మనం క్లయింట్లకు పంపించే మెయిల్ మెసేజ్‌లు ఒకసారి వారు చదివిన తర్వాత రెండవసారి చదవడానికి వీల్లేకుండా చెయవచ్చు. Gmail,Yahoo, Rediff వంటి మెయిల్ సర్వర్లలో నేరుగా ఇలా ఎక్స్ పైర్ అయిపోయే మెసేజ్‌లను పంపించడానికి అవకాశం లేదు. అయితే దీనికి దొడ్డిదారి ఉంది. సహజంగా ఒకసారి ఎవరైనా చూసిన తర్వాత ఇకపై ఆ పేజి కనిపించని విధంగా HTML పేజీలను రూపొంచించే మార్గముంది. ఈ టెక్నిక్‌ని ఆసరాగా చేసుకుని Kicknotes వంటి వెబ్ సైట్లో మనం టైప్ చేసే మెసేజ్‌ని, మనం పేర్కొన్న విధంగా ఎక్స్ పైర్ అయ్యే HTML లింక్‌గా మార్పిడి చేసి ఎవరికైతే మెయిల్ చేయదలుచుకున్నామో వారికి చేరవేయగలుగుతాయి.దాంతో మన మెసేజ్ అవతలి వారికి ఒక లింక్ రూపంలో పంపించడుతుంది. అయితే వారు ఆ లింక్‌ని మొదటిసారి క్లిక్ చేసినప్పుడు మాత్రమే అందులో మనం పంపిన మెసేజ్ కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే .. మెసెజ్ తొలగించబడింది అని మొండి చేయి చూపిస్తుంది.


March 14, 2008 10:12 PM
చాలా మంచి ట్రిక్ చెప్పారు సర్, కృతజ్ఞతలు.
March 16, 2008 10:27 AM
ఈ ట్రిక్కు ఎదో భలే బాగుంది గురువు గారు. ఆగండి మా ప్రెండ్స్‍తో ఓ ఆట ఆదుకుటా....
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి