9, మార్చి 2008, ఆదివారం

నోకియాని మింగేస్తున్న Nokla


ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ సంస్థ Nokia ఫోన్లకు ఇప్పుడు Nokla పేరిట చైనాలో తయారవుతున్న నకిలీ ఫోన్లు వచ్చేసాయి. అచ్చం ఒరిజినల్ మోడళ్ళని తలపించే మాదిరిగానే ఉండే ఈ Nokla ఫోన్లలో నిశితంగా పరిశీలించి చూస్తే కొద్దిపాటి వృత్యాసాలు కనిపిస్తాయి. ఉదా.కు.. Nokia N 95 ఒరిజినల్ ఫోన్‌లో Menu/Multimedia Keys ఉండే ప్రదేశంలో నకిలీ ఫోన్‌లో ఒకవైపు Play బటన్, మరోవైపు Stop బటన్ ఉంటాయి. అలాగే ఒరిజినల్ నోకియా ఫోన్లు 5 megapixel కెమెరాని కలిగి ఉంటుంటే, నకిలీ ఫోన్ 2megapixel కెమెరాని కలిగి ఉంటున్నాయి.ఇలా తెలియకుండా అనేక వృత్యాసాలు ఉన్నాయి. అయితే ఒరిజినల్ N95 ధర 40 వేలవరకు ఉంటే Nokla N95 మాత్రం కేవలం రూ.7,500లకే లభిస్తుంది. ఎంత చవకో చూడండి. దాదాపు అన్ని నోకియా మోడళ్ళకు అతి తక్కువ ధర కలిగిన నకిలీలు లభిస్తున్నాయి.

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఇదే కాదు, iPhone కి కూడా వచ్చాయి.
కానీ వీటిలో అసలు వాటి అంత కళ లేదు.
కానీ ఇంత తక్కువ ధరలో చేసారంటే వారిని అభినిందాంచాలి.

Viswanadh. BK చెప్పారు...

ఐ ఫోన్ నేనూ చూసా, పర్వాలేదు. అంత బావుండకపోయినా దాదాపు ఫీచర్స్ ఆన్నీ వచ్చేసాయ్. ఇంకా సోనీ ఎరిక్ సన్ అయితే పేరు కూడా మర్చకుండా దించేసారు. సెకండ్స్ దించడంలో చైనా చైనాయే.