30, అక్టోబర్ 2007, మంగళవారం

YouTube నుండి డౌన్‍లోడ్ చేసుకోవాలా??



Youtube, Google, iFilm, break.com, Putfile, FindVideos వంటి అనేక వీడియో హోస్టింగ్ వెబ్‌సైట్లలో అనేక అంశాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది పిసి యూజర్లు ఇతరులతో షేర్ చేస్తున్నారు. ఈ సైట్లలోకి ప్రవేశించినప్పుడు ఓ ప్లేయర్ ఓపెన్ అయి మనం ఎంచుకున్న వీడియో ప్లే అవుతుంది తప్ప డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపించదు. అయితే ఆయా సైట్ల నుండి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్‌లు ఉన్నాయి. Youtube నే ఉదా.గా తీసుకుంటే మీరు డౌన్‌లోడ్ చేయదలుచుకున్న వీడియో లింక్‌ని ఆ సైట్ నుండి క్లిప్‌బోర్డ్‌లోకి కాపీ చేసుకుని http://keepvid.comఅనే సైట్‌లోని అడ్రస్‌బార్‌లో పేస్ట్ చేసి Download అనే బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ లింక్ లభిస్తుంది. Firefox బ్రౌజర్‌ని వాడుతున్న యూజర్లు https://addons.mozilla.org/firefox/2390/ అనే వెబ్‌సైట్ నుండి VideoDownloader Extensionని డౌన్‌లోడ్ చేసుకుని దానిద్వారా వివిధ సైట్లలోని వీడియో క్లిప్‌ల వంటి ఎంబెడ్డెడ్ ఆబ్జెక్టులను సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ అయిన .flv క్లిప్‌లను http://www.videospark.com/index.php?ssp=24అనే వెబ్‌సైట్లో లభించే FLV Player అనే ప్రోగ్రామ్‌తో ప్లే చేసుకోవచ్చు.

2 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

విస్టా నడుపుతున్న నా లాప్టాప్లో ఈ మధ్యనే కొత్త రియల్ ప్లేయర్ పొందు పరిచాను. అక్కణ్ణించీ, ఏ పేజిలో నిక్షిప్తమై ఉన్న విడియో కానీ ఆడియోకాని ఉంటే దాని పైననే ఒక చిన్న టిక్కెట్టు వస్తోంది, "నీకు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుందా?" అని అడుగుతూ. అవును అంటే మామూలు ఫైల్ సేవ్ లాగానే డౌన్లోడ్ చేసేస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

orbit అని మరొక టూల్ ఉంది. ఇది ఎలాంటి embedded video నైనా download చెయ్యగలదు. మీరు చెప్పిన keepvid లో నుంచి download చెయ్యడానికి రెండు options ఉన్నాయి. ఆందులో ఒకటి high quality video download.