24, అక్టోబర్ 2007, బుధవారం

వేర్వేరు బ్రౌజర్లలో మీ వెబ్ పేజీ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?




మీరు ఎంతో కష్టపడి రూపొందించుకునే వెబ్ పేజీలు విండోస్, Mac, Linux వంటి వేర్వేరు ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే Internet Explorer 5, 5.5, 6, 7, Firefox 1.5, 2.0, Opera, Safari వంటి పలు రకాల వెబ్ బ్రౌజర్లలో ఎలా కనిపిస్తాయో ప్రివ్యూ చూసుకోగలిగితే బాగుంటుంది కదా! ఒకవేళ ఏవైనా ముఖ్యమైన బ్రౌజర్లలో స్ర్కీన్ రిజల్యూషన్లు మార్చినప్పుడు, కలర్ డెప్త్ పెంచినప్పుడు నాణ్యతలో ఏదైనా తేడా వస్తే సరిచేసుకోవచ్చు. అయితే మీ వెబ్ సైట్ ని ఇలా వేర్వేరు బ్రౌజర్లతో తనిఖీ చేసుకోవాలంటే ప్రత్యేకంగా ఆయా బ్రౌజర్లు అన్నింటినీ మీ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవలసిన పనిలేదు. సింపుల్ గా http://browsershots.org/ అనే వెబ్ సైట్ కి వెళ్లి Enter your web address here అనే ప్రదేశం వద్ద మీ వెబ్ సైట్ అడ్రస్ ని టైప్ చేసి అది ఏయే బ్రౌజర్లలో తనిఖీ చేయబడాలో క్రింద ఎంచుకుని Submit బటన్ క్లిక్ చేయండి. వెంటనే వేరొక వెబ్ పేజీ వస్తుంది. అడ్రస్ బార్ నుండి ఆ అడ్రస్ ని కాపీ చేసుకుని కొద్దిసేపటి తర్వాత (30 నిముషాల లోపలే రావాలి సుమా) ఆ అడ్రస్ ని ఓపెన్ చేసి చూస్తే వేర్వేరు బ్రౌజర్ల లో మీ వెబ్ సైట్ ఎలా కనిపిస్తుందో స్ర్కీన్ షాట్లు చూపించబడతాయి.

కామెంట్‌లు లేవు: