మీవద్ద అత్యంత ముఖ్యమైన సమాచారం ఉన్నప్పుడు ఆ ఫైల్‍ని ఇతరులకు నేరుగా మెయిల్ అటాచ్‍మెంట్ ద్వారా గాని , సిడి, ఫ్లాపీల్లోకి గాని కాపీ చేసి ఇవ్వడం వల్ల ఇతరులు ఎవరైనా దానిని ఓపెన్ చేసి దుర్వినియోగం చేసే అవకాశమూ ఉంటుంది. దీనిని నిరోధించడానికి Steganography 1.8 అనే సాఫ్ట్ వేర్ వాడవచ్చు. దీని సాయంతో పిక్చర్లు, సౌండ్ ఫైళ్ళు, వీడియో ఫైళ్ళలో మన వద్ద ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని ఎన్‍క్రిప్ట్ చేసి పంపించవచ్చు. చూడడానికి అది సాధారణ పిక్చర్ ఫైల్‍గా కనిపించినా ఇదే సాఫ్ట్ వేర్‍తో Unhide చేసినపుడు ఫైల్ లోపల మనం దాచిపెట్టిన సమాచారం ప్రత్యక్షమవుతుంది. కీలకమైన సమాచారానికి ఇది పనికొస్తుంది.
2 కామెంట్‌లు:
ఇలాంటి సాఫ్టువేరును మనమే సులువుగా తయారు చేసుకోవచ్చు. బొమ్మలకూ, ఆడియో ఫైల్లలో మన సమాచారాన్ని దాసుకోగలెగేటట్లు ఒక ప్రోగ్రామును కూడా నేను తయారు చేసుకున్నాను BTechలో ఉన్నప్పుడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి