9, అక్టోబర్ 2007, మంగళవారం

వీడియోనే వాల్‍పేపర్‍గా సెట్ చేయండి




Windows Vista ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉన్నవారికి ఓ శుభవార్త. Dreamscene Preview పేరిట మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా ఓ సాఫ్ట్ వేర్‍ని Windows Vista Ultimate ఎడిషన్ కలిగియున్న యూజర్లకి అందిస్తోంది. మనం కంప్యూటర్ డెస్క్ టాప్‍పై వాల్‍పేపర్లని ఎలా అమర్చుకుంటామో అదే మాదిరిగా ఫోటోలకు బదులుగా మన వద్ద ఉన్న వీడియో ఫైళ్ళని బ్యాక్ గ్రౌండ్‍గా సెట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్ వేర్ వీలు కల్పిస్తుంది. అయితే ఈ సాఫ్ట్ వేర్ సక్రమంగా పనిచెయ్యాలంటే Vista Aero ఇంటర్‍ఫేస్‍ని సపోర్ట్ చేసే గ్రాఫిక్ కార్డ్ మీ కంప్యూటర్లో అమర్చబడి ఉండాలి. అయితే ఈ సాఫ్ట్ వేర్ కేవలం Windows Vista Ultimate ఎడిషన్ కలిగి ఉన్నయూజర్లకి మాత్రమే అందించబడుతోంది. Home Basic వంటి తక్కువస్థాయి ఎడిషన్లని కలిగి ఉన్నవారికి ఇది లభించదు. విండోస్ అప్ డేట్ ని రన్ చేయడం ద్వారా మైక్రోసాప్ట్ సైట్ నుండి దీనిని పొందవచ్చు. అన్నట్టు Vista ఆపరేటింగ్ సిస్టమ్‍లో అనే వెర్షన్లు ఉన్నాయని తెలిసిందే కదా! వాటన్నింటికి వేర్వేరు డిస్క్ లు ఉంటాయని చాలా మంది అపోహ పడుతుంటారు. అయితే Vista DVD ఒకటే ఉంటుంది. ఇన్‍స్టలేషన్ సమయంలో మనం ఎంచుకునే వెర్షన్ బట్టి, మనం ఎంటర్ చేసే ప్రోడక్ట్ కీని ఆధారంగా చేసుకుని మనకు కావలసిన వెర్షన్ ఇన్‍స్టాల్ అవుతుంది.

కామెంట్‌లు లేవు: