25, అక్టోబర్ 2007, గురువారం

స్క్రీన్‍పై సమాచారం చదవబడాలా??



అంధులను దృష్టిలో ఉంచుకుని XP ఆపరేటింగ్ సిస్టమ్‍లో Narrator అనే ప్రోగ్రాముని పొందుపరిచారు.. Programs>Accessories>Accessibility>Narrator అనే ఆప్షన్‍ని క్లిక్ చేయడం ద్వారాగాని, Run కమాండ్ బాక్స్ లో narrator అని టైప్ చేసినా ఈ ప్రోగ్రామ్ రన్ చేయబడుతుంది. ప్రోగ్రామ్ ఓపెన్ అయిన వెంటనే Announce events on screen అనే చెక్‍బాక్స్ ని టిక్ చేయండి. దీనితో మనం Win XP ఉపయోగించేటప్పుడు స్క్రీన్‍పై ప్రత్యక్షమయ్యే వివిధ డైలాగ్‍బాక్స్ లు
విండోలు, షార్ట్ కట్‍లు, ఎర్రర్ మెసేజ్‍లలోని సమాచారం మనకు స్పీకర్ల ద్వారా మనకు విన్పించబడుతుంది. మనం కీబోర్డ్ ద్వారా టైప్ చేసుకుంటుపోతే ఏమి టైప్ చేస్తున్నామో ఆ అక్షరాలు, పదాలను పైకి వినిపించి పెట్టే ఆప్షన్ కూడా narratorలో లబిస్తుంది. ఆ ప్రోగ్రామ్‍లోని Read Typed Characters అనే ఆప్షన్‍ని టిక్ చేసినప్పుడు ఇలా టైప్ చేసిన సమాచారం చదివి విన్పించబడుతుంది. కీబోర్డ్ షార్ట్ కట్‍ల ద్వారా కూడా దీన్ని వాడవచ్చు. ప్రస్తుతం స్క్రీన్‍పై కన్పిస్తున్న విండోలోని సమాచారం చదవబడడానికి Ctrl+Shift+Spacebarని, టైటిల్‍బార్ కోసం Alt+Home కీని ప్రెస్ చేయండి….

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

i think, narrator was started from windows 2000.