22, అక్టోబర్ 2007, సోమవారం

Firefox తక్కువ మెమరీ వాడుకునేలా..



Mozilla Firefox బ్రౌజర్ వినియోగం క్రమేపీ పెరుగుతుంది. స్వతహాగా ఉచిత సాఫ్ట్‌వేర్ అవడం,అనేక ఎక్స్‌టెన్షన్లు లభిస్తుండడం వల్ల పలువురు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. మీరూ Firefox వాడుతున్నట్లయితే ఆ ప్రోగ్రామ్ మినిమైజ్ చేయబడి ఉన్నప్పుడు RAM తక్కువగా ఉపయోగించబడేలా కాన్ఫిగర్ చేయవచ్చు. అడ్రస్‌బార్‌లో about:config అని టైప్ చేసి వెంటనే వచ్చే పేజీలో మౌస్‌తో రైట్‌క్లిక్ చేసి New>Boolean అనే ఆప్షన్‌ని ఎంచుకోండి. ఇప్పుడు ఆ ఎంట్రీకి config.trim_on_minimize అనే పేరుని ఇచ్చి Trueగా సెట్ చేయండి. ఇప్పుడు Firefox రీస్టార్ట్ చేస్తే ఆ టెక్నిక్ పనిచేయనారంభిస్తుంది. ఇకపోతే Firefox అడ్రస్ బార్‌లో about అని టైప్ చేస్తే వెర్షన్ నెంబర్, కాపీరైట్ వంటి వివరాలు,about:config అని టైప్ చేయడం ద్వారా Configuration Console అనే పేజీ, about"cache అని టైప్ చేసి మన ఫైర్‌ఫాక్స్ ప్రోగ్రామ్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న వివిధ ప్లగ్ఇన్‌ల వివరాలు, about:credits అని టైప్ చేసి Firefox రూపకల్పనలో పాలు పంచుకున్న పలువురు ప్రోగ్రామర్ల పేర్లూ తెలుసుకోవచ్చు.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

you made my day (మీరు నా దినం చేశారంటే బాగోదేమో). ఇన్నాళ్ళు మంటనక్క Memory ఎక్కువ తీసుకొంటూండటంతో తరచూ మూసి తెరవాల్సొచ్చేది. ఇప్పుడు ఈ చిన్న చిట్కా నాకు భలే ఉపయోగపడుతోంది. 60MB ఉన్న Firefox కాస్తా minimize చేసేసరికి 8MB ఐపోయింది :)
ప్రవీణ్ వింటున్నావా? ఇన్నాళ్ళు ఇదే కదా నిన్ను హింసించింది.

Unknown చెప్పారు...

అదే నా సిస్టంలో 100MB నుండి 30 MBకి తగ్గింది.

యింతకీ memory utilization మంటనక్కని minimize చేసినప్పుడు తగ్గి మరల maximize చేయగానే పెరుగుతుందా?