29, అక్టోబర్ 2007, సోమవారం

Device Found పాపప్ మెసేజ్ లు రాకుండా!


Windows Vista ఆపరేటింగ్ సిస్టం కొత్త్తగా కంప్యూటర్ కి ఏదైనా హార్డ్ వేర్ డివైజ్ ని కనెక్ట్ చేసినట్లు గుర్తించినట్లయితే చీటికీ మాటికీ New Hardware Found అనే పాపప్ మెసేజ్ ని స్ర్కీన్ పై చూపిస్తూ విసిగిస్తుంటుంది. ఒకవేళ ఆ డివైజ్ కి సంబంధించిన డివైజ్ డ్రైవర్లు మన వద్ద ఉంటే వాటిని ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ కొత్త హార్డ్ వేర్ డివైజ్ యొక్క డ్రైవర్లు గనుక మన వద్ద లేకపోయినట్లయితే ఇలా పాపప్ చూపించబడడం చిరాకుగా ఉంటుంది. ఇలా చీటికీ మాటికీ పాపప్ చూపించబడకుండా అడ్డుకోవడానికి Start>Run కమాండ్ బాక్స్ లో gpedit.msc అని టైప్ చేసి Group Policy అనే ప్రోగ్రాం లోకి వెళ్లి అందులో Computer Configuration\Administrative Templates\System Device Intallation అనే విభాగంలో Turn off new Hardware balloons during device installation అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తే ఇకపై ఇలా పాపప్ మెసేజ్ లు రాకుండా ఉంటాయి.