17, అక్టోబర్ 2007, బుధవారం

ఒక హార్డ్ డిస్క్ లోని డేటా మరో దానికి...



హార్డ్ డిస్కుల ధరలు బాగా తక్కువ ఉన్న నేపధ్యంలో కంప్యూటర్ యూజర్లు తమ వద్ద ఉన్న తక్కువ కెపాసిటీ హార్డ్ డిస్కులకు బదులు ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన భారీ హార్డ్ డిస్కులను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొత్త హార్డ్ డిస్కును కొనడం బానే ఉంటుంది. కాని మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం, పాత హార్డ్ డిస్కులో ఉన్న అన్ని ఫైళ్ళని, ఫోల్డర్లని కొత్తదానిలోకి కాపీ చేయడం పెద్ద తలనొప్పి వ్యవహారం. ఈ నేపధ్యంలో Acronis Migrate Easy వంటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్లని ఉపయోగించడం వల్ల చాలా శ్రమ తగ్గుతుంది పాత హార్డ్ డిస్కులోని అన్ని ఫైళ్ళనీ, సెట్టింగులనూ కొత్త డిస్కులోనికి యధాతథంగా క్లోన్ చేయగలుగుతుంది. పాత హార్డ్ డిస్కులోని సమాచారాన్ని డంప్ చేసిన తర్వాత కొత్త హార్డ్ డిస్క్ యొక్క పరిమాణానికి తగ్గట్టుగా కొత్త పార్టీషన్లని క్రియేట్ చేసుకోవచ్చు. రీసైజ్ చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: