25, అక్టోబర్ 2007, గురువారం

IDEA GPRS నెట్ ని పిసి/లాప్ టాప్ పై పొందలేకపోతున్నారా?



IDEA GPRS ద్వారా ఫోన్లో ఇంటర్నెట్ వస్తూ బ్లూటూత్/డేటా కేబుల్ ద్వారా పిసి/లాప్ టాప్ కి కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఫోన్ డయలప్ కనెక్షన్ IDEA సర్వర్ కి కనెక్ట్ అయి కూడా ఏ వెబ్ పేజీ ఓపెన్ అవని ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంటుంది. దీనికి పరిష్కారంగా మోడెం ప్రాపర్టీలలో AT+CGDCONT=1, "IP", "INTERNET" అనే ఇనీషయలైజేషన్ విలువను ఇవ్వాలి. అదెలాగో ఈ వీడియోలో వివరంగా చూద్దాం.తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది, స్పీకర్లు ఆన్ చేసుకోండి.

3 కామెంట్‌లు:

, చెప్పారు...

శ్రీధర్ గారు! విస్తా వాడినప్పుడు లేఖినిలో కాని బ్లాగులోనివి కాని తెలుగు వ్యాసాలని కాపీ చేసి వర్డ్ లో పేస్ట్ చేస్తే తెలుగులో కనిపించేది. ఇప్పుడు ఎక్స్పి లోడ్ చేసింతర్వాత అలా జరగటం లేదు. నేను రెండు మార్పులు చేశాను .1.Regional Settings లో complex script install చేశాను . 2. ఆఫీస్ లోడ్ చేసినప్పుడు కస్టం ఇన్స్టాల్లేషన్ లో యూనివర్సల్ ఫాంట్ ఇన్ స్టాల్ అయ్యేట్టు చేశాను. పోతన, గౌతమి కూడా లోడ్ చేశాను. అయినా ఫలితం లేదు. దీని పరిష్కారం చెప్పండి.

జ్యోతి చెప్పారు...

శ్రీధర్ గారు,

మీరు చేసింది కరెక్టే. కాని వర్డ్‌లో తెలుగు సేవ్ చేయలేము.మీరు Office 2007 వాడండి. అందులో మీరు లేఖినినుండి కాపీ చేసి onenote లో సేవ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్టుగా టైప్ చేసుకోవచ్చు . ఆటోసేవ్ కూడా ఉంది అందులో . అక్కడినుండే సేవ్ చేసుకోవచ్చు లేదా వర్డ్ కి ట్రాస్‌ఫర్ చేసి సేవ్ చేసుకోవచ్చు.

, చెప్పారు...

చాలా థాంక్స్ అండి. మీరు చెప్పినట్టుగా ఆఫీస్ 2007 లో పని చేస్తుంది గానీ అది చాలా సిస్టం రిసోర్స్ తినేస్తుంది. కాని ఈలోపే నాకు పరిష్కారం దొరికింది. ఇది మీకు సమాచారంగా వుంటుందని రాస్తున్నాను.Microsoft Office Tools లో Microsoft Office 2003 language settings ని క్లిక్ చేసి తెలుగు లాంగ్వేజీని జత చేస్తే ఆఫీస్ 2003 వర్డ్ లో తెలుగు పేస్ట్ చేసుకోవచ్చు.