31, అక్టోబర్ 2007, బుధవారం
డయాగ్రములను గీయాలా???
ఎడ్యుకేషనల్, బిజినెస్ రంగాల్లో ఉన్నవారు పలు సందర్భాల్లో డయాగ్రములను గీయవలసి వస్తుంది. వివిధ గణాంకాలకు తగ్గట్లు డయాగ్రములను గీయడానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రత్యేకంగా ఎటువంటి ప్రోగ్రామ్ లభ్యం కావడం లేదు. ఈ నేపధ్యంలో సాధారణ అవసరాలు మొదలుకుని క్లిష్టతరమైన సందర్భాలకు సైతం Flow Charts, Business, Technical Diagrams, Schemes, Plans, Family Trees వంటివి క్రియేట్ చెయ్యడానికి వాటిని bmp, jpeg వంటి పాపులర్ ఇమేజ్ ఫార్మేట్లకు ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రోగ్రామే Diagram Studio.
వీడియో ఎడిటింగ్‌కి పనికొచ్చే ప్రోగ్రామ్
AVI, MPEG వంటి ఫార్మేట్లలో ఉన్న వీడియో క్లిప్‌లకు ఆడియో జత చెయ్యడానికి, Fade, Pixelate, Blur, Wave, Emboss వంటి పలు రకాల స్పెషల్ ఎఫెక్టులు జత చెయ్యడానికి ఉపకరించే ప్రోగ్రామే Video Edit Magic దీని సాయంతో వెబ్ కెమెరా నుండి వీడియోని కేప్చర్ చేయవచ్చు. ఒక మీడియ ఫైల్‌లోని ఆడియో, వీడియో కాంపొనెంట్‌లను దేనికది వేర్వేరుగా ఎడిట్ చెయ్యవచ్చు. ఒక వీడియో క్లిప్‌పై మరో వీడియో క్లిప్‌ని Overlay చేయవచ్చు. వీడియో ఫైళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వాయిస్ ఓవర్‌లను జత చెయ్యవచ్చు. టెక్స్ట్ టైటిళ్ళను జతచేయవచ్చు. ఇలా పలు రకాలుగా ఉపయోగపడుతుంది.
30, అక్టోబర్ 2007, మంగళవారం
YouTube నుండి డౌన్‍లోడ్ చేసుకోవాలా??
Youtube, Google, iFilm, break.com, Putfile, FindVideos వంటి అనేక వీడియో హోస్టింగ్ వెబ్‌సైట్లలో అనేక అంశాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది పిసి యూజర్లు ఇతరులతో షేర్ చేస్తున్నారు. ఈ సైట్లలోకి ప్రవేశించినప్పుడు ఓ ప్లేయర్ ఓపెన్ అయి మనం ఎంచుకున్న వీడియో ప్లే అవుతుంది తప్ప డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపించదు. అయితే ఆయా సైట్ల నుండి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్‌లు ఉన్నాయి. Youtube నే ఉదా.గా తీసుకుంటే మీరు డౌన్‌లోడ్ చేయదలుచుకున్న వీడియో లింక్‌ని ఆ సైట్ నుండి క్లిప్‌బోర్డ్‌లోకి కాపీ చేసుకుని http://keepvid.comఅనే సైట్‌లోని అడ్రస్‌బార్‌లో పేస్ట్ చేసి Download అనే బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ లింక్ లభిస్తుంది. Firefox బ్రౌజర్‌ని వాడుతున్న యూజర్లు https://addons.mozilla.org/firefox/2390/ అనే వెబ్సైట్ నుండి VideoDownloader Extensionని డౌన్‌లోడ్ చేసుకుని దానిద్వారా వివిధ సైట్లలోని వీడియో క్లిప్‌ల వంటి ఎంబెడ్డెడ్ ఆబ్జెక్టులను సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ అయిన .flv క్లిప్‌లను http://www.videospark.com/index.php?ssp=24అనే వెబ్‌సైట్లో లభించే FLV Player అనే ప్రోగ్రామ్‌తో ప్లే చేసుకోవచ్చు.
బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లో బ్రౌజింగ్ స్పీడ్
మన సిస్టమ్‌లో 512Kbps బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండి, నెట్ బ్రౌజింగ్ కోసం Firefox వాడుతున్నపుడు వివిధ వెబ్‌సైట్లు వేగంగా ఓపెన్ కావాలంటే ఇలా చేయండి. మీ Firefox బ్రౌజర్‌లోని అడ్రస్ బార్‌లో about:config అని టైప్ చేసి వెంటనే స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే వివిధ కాన్‌ఫిగరేషన్ సెట్టింగులలో network.http.max-connections అనే సెట్టింగ్‌కి 48 అనే విలువనూ, network.http.max-connections.per.serverకి 24 విలువా,network.http.max.persistent.connections.per.proxy అనే సెట్టింగ్‌కి 12 అనే విలువనూ, network.http.max.persistent.connections.per.server అనే సెట్టింగ్‌కి 6 అనే విలువనూ, network.http.pipelining సెట్టింగ్‌ని trueగానూ,network.http.pipelining.maxrequestsకి 32 అనే విలువనూ, network.http.proxy.pipelining సెట్టింగ్‌ని trueగానూ సెట్‌చేసి Firefox ప్రోగ్రామ్‌ని రీస్టార్ట్ చేసి చూడండి. మునుపటి కన్నా మీ బ్రౌజింగ్ స్పీడ్ పెరుగుతుంది.
29, అక్టోబర్ 2007, సోమవారం
కీలాగర్ ఎలా పనిచేస్తుంది, ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి? (వీడియోసహిత వివరణ)
రిమోట్ కీలాగర్ ప్రోగ్రాములు గనుక మన సిస్టంలోకి ప్రవేశించినట్లయితే కీబోర్డ్ నుండి మనం ప్రెస్ చేసే ప్రతీ కీనీ, వివిధ విండోలలో ఎంటర్ చేసే యూజర్ నేం, పాస్ వర్డ్ లు వంటి వివరాలు, ఛాటింగ్ లో మనం మాట్లాడే మాటలను ఎవరైతే మన కంప్యూటర్లోకి ఆ కీలాగర్ ని పంపిస్తారో వారికి చేరవేస్తుంటాయి. ఈ నేపధ్యంలో మీ సిస్టంలో ఏదైనా కీలాగర్ ఇన్ స్టాల్ అయి ఉందని సందేహం వచ్చినట్లయితే ఏంటీవైరస్, స్ఫైవేర్ రిమూవల్ ప్రోగ్రాములతో సిస్టం ని స్కాన్ చేసి చూడండి. అలాగే Yahoo Messenger, GTalk, ఆన్ లైన్ ఫోరంలు వంటి వాటిలో యూజర్ నేం, పాస్ వర్డ్ లను ప్రతీసారీ టైప్ చేయడం కాకుండా విండోస్ పాస్ వర్డ్ మేనేజర్ ద్వారా సేవ్ చేసుకుని అవసరం అయినప్పుడు Auto Complete చేయడం ద్వారా టైప్ చేయాల్సిన పని ఉండదు. లేదా AI RoboForm వంటి పాస్ వర్డ్ లను గుర్తుంచుకునే సాప్ట్ వేర్లను వాడండి. తద్వారా కీలాగర్ మనం కీబోర్డ్ నుండి నేరుగా ఏ సమాచారాన్నీ టైప్ చేయం కాబట్టి మన లాగిన్ సమాచారాన్ని పొందలేదు. అసలు కీలాగర్లు ఎలా పూర్తి సమాచారాన్ని సేకరిస్తాయో నేను పరిశోధనాత్మకంగా ఇతరుల కంప్యూటర్లలోకి కీలాగర్ ని పంపించి రికార్డ్ చేసిన సమాచారాన్ని మీకు అవగాహన కోసం క్రింది వీడియోలో పొందుపరిచాను, చూడండి.
Device Found పాపప్ మెసేజ్ లు రాకుండా!
Windows Vista ఆపరేటింగ్ సిస్టం కొత్త్తగా కంప్యూటర్ కి ఏదైనా హార్డ్ వేర్ డివైజ్ ని కనెక్ట్ చేసినట్లు గుర్తించినట్లయితే చీటికీ మాటికీ New Hardware Found అనే పాపప్ మెసేజ్ ని స్ర్కీన్ పై చూపిస్తూ విసిగిస్తుంటుంది. ఒకవేళ ఆ డివైజ్ కి సంబంధించిన డివైజ్ డ్రైవర్లు మన వద్ద ఉంటే వాటిని ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ కొత్త హార్డ్ వేర్ డివైజ్ యొక్క డ్రైవర్లు గనుక మన వద్ద లేకపోయినట్లయితే ఇలా పాపప్ చూపించబడడం చిరాకుగా ఉంటుంది. ఇలా చీటికీ మాటికీ పాపప్ చూపించబడకుండా అడ్డుకోవడానికి Start>Run కమాండ్ బాక్స్ లో gpedit.msc అని టైప్ చేసి Group Policy అనే ప్రోగ్రాం లోకి వెళ్లి అందులో Computer Configuration\Administrative Templates\System Device Intallation అనే విభాగంలో Turn off new Hardware balloons during device installation అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తే ఇకపై ఇలా పాపప్ మెసేజ్ లు రాకుండా ఉంటాయి.
27, అక్టోబర్ 2007, శనివారం
రెండు ఎకౌంట్లనూ ఒకే Gmail ID నుండి వాడుకోవడం ఇలా.. (వీడియో)
మీ వద్ద రెండు GMail ఐడిలు ఉన్నప్పుడు దేని నుండి మెసేజ్ పంపించాలంటే దానిలోకి లాగిన్ అవ్వాల్సిన పనిలేకుండా రెండు IDలను ఒకే GMail ఐడిలోకి లాగిన్ అయి.. మనం కోరుకున్న ఐడి నుండి మెసేజ్ ని కంపోజ్ చేసే మార్గాన్ని ఈ వీడియోలో వివరించాను. తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది.
పురాతన వార్తాపత్రికల కథనాలు కావాలా?
హిందూ, వాషింగ్టన్ పోస్ట్ వంటి సుధీర్ఘ నేపధ్యం కలిగిన్ వార్తా పత్రికల్లో గతంలో ప్రచురించబడిన అంశాలను Google సంస్థ http://news.google.com/archivesearch అనే సైట్ ద్వారా అందిస్తోంది. ఈ వెబ్‍సైట్ ద్వారా వెదుక్కుంటూ పోతే చరిత్ర గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. ఉదా. కు.. పాకిస్తాన్ ఒక దేశంగా 1947 లో రూపు దాల్చినప్పటికీ "పాకిస్తాన్" అనే పదం 1900 వ సంవత్సరంలోని వార్తాపత్రికల్లోనే తారసపడింది. అలాగే మనం 2000వ సంవత్సరం తర్వాత మాత్రమే Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‍ని ఉపయోగిస్తున్నాము కదా… మరి ఈ Windows XP అనే పదం మొట్టమొదటిసారి ఎప్పుడు వార్తల్లోకి ఎక్కిందో తెలుసా.. 1985 లో…! ఇలా చెప్పుకుంటూ పోతే ఈ న్యూస్ ఆర్చివ్స్ లోని వివిధ పాత వార్తా పత్రికల కథనాలను అధ్యయనం చేసుకుంటూ పోతే మనకు తెలియని చరిత్రలో మరుగునపడిపోయిన ఎన్నో వాస్తవాలను తెలుసుకోవచ్చు. Google సెర్చ్ఇంజిన్ లో మాదిరిగానే ఏ కీవర్డ్ నైనా ఆర్కివ్స్ లో వెదికి చదువుకోవచ్చు.
ముఖ్యమైన పాయింట్లను హైలైట్ చేయడం
MS Wordలో బ్రోచర్లు,కవరింగ్ నోట్లు తయారు చేసేటప్పుడు కొన్ని పాయింట్లను హైలైట్ చేయాల్సొస్తుంది. అప్పుడు వర్డ్‌లో లభించే Blinking Background అనే ఆప్షన్ ద్వారా మీ ముఖ్యమైన పాయింట్లని హైలైట్ చేసుకోవచ్చు. ఏ టెక్స్ట్ నైతే హైలైట్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని Format>Font మెనూలో ఉండే Text Effects అనే విభాగంలోకి వెళ్ళండి. Office 97లో ఇది Animation అనే విభాగంలో ఉంటుంది.. ఇక్కడ Blinking Background అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఎల్లప్పుడూ బ్లింక్ అవుతూ ప్రత్యేకంగా కనిపిస్తుంది.
26, అక్టోబర్ 2007, శుక్రవారం
మీ IP, DNS, MAC అడ్రసులు తెలుసుకోవాలా? (వీడియో)
మీ కంప్యూటర్ల యొక్క నెట్ వర్క్ కనెక్షన్ల యొక్క IP అడ్రస్లు, MAC, DNS సర్వర్ అడ్రసులు వంటి సకల సమాచారం తెలుసుకోవడం ఎలాగో ఈ వీడియోలో వివరించడం జరిగింది. బిగినర్స్ కి మాత్రమే ఉద్దేశించబడిన వీడియో ఇది. అడ్వాన్స్ డ్ యూజర్లు టైం వృధా చేసుకోవలసిన పనిలేదు.
Skype మాటలని రికార్డ్ చేసుకోవచ్చు..
వాయిస్ చాటింగ్ నిమిత్తం ఇప్పటికీ ఎక్కువమంది Yahoo Messengerని ఉపయోగిస్తున్నప్పటికీ మాటల్లోమరింత స్పష్టత పొందడమ్ కోసం కొంతమంది Skype వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీనిద్వారా టెలిఫోన్ ఇంటర్వ్యూలు, పానెల్ డిస్కషన్స్, కాన్ఫరెన్స్ లు వంటివి నిర్వహించబడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. Skype ద్వారా ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు ఆ సంభాషణని రికార్డ్ చేసుకోవడానికి ఆ ప్రోగ్రామ్‍లో ఎలాంటి ఆప్షన్ పొందుపరచబడలేదు. ఆప్షన్ లేదు కద అని నిరుత్సాహపడవలసిన పనిలేదు. Skype ద్వారా మీరు జరిపే సంభాషణని కొన్ని ధర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్లని ఉపయోగించి MP3, WAV, WMA వంటి ఆడియో ఫార్మేట్లలోకి రికార్డ్ చేసుకోవచ్చు. అదెలాగంటే… http://www.telco.com/kishkish/KishKish.SAM.Setup.4.0.0.7.exe అనే వెబ్సైట్ నుండి KishKish SAM అనే చిన్న ప్లగ్‍ఇన్ డౌన్‍లోడ్ చేసుకుని మీ సిస్టమ్లో ఇన్‍స్టాల్ చేసుకోండి. అంతే ఇక మీ Skype ప్రోగ్రామ్‍కి వచ్చే ఏ ఇన్‍కమింగ్ కాల్‍నైనా ఈ ప్లగ్‍ఇన్ ఆటోమేటిక్‍గా రికార్డ్ చేస్తుంది. అలాగే ఔట్‍గోయింగ్ కాల్ చేసేటప్పుడు ఫోన్ ఎత్తిన వెంటనే రికార్డింగ్ మొదలవుతుంది.
మీ పేరు టాటూగా మార్చుకోవచ్చు…
ప్రేయసీప్రియులు శరీరంపై పచ్చబొట్లు పొడిపించుకోవడం.. ఆకర్షణీయమైన టాటూలను అంటించుకోవడం చాలాచోట్ల చూస్తూనే ఉన్నాం. ఇదే మాదిరిగా ఏ అందమైన అమ్మాయి తన వంటిపై మీ పేరు టాటూగా ధరిస్తే చూడాలని ఉందా.. సహజంగా తీరే అవకాశం లేని మీ కోరిక www.crustydemons.co.uk/UK/tattoo_parlour/ అనే వెబ్‍సైట్ ద్వారా తీరడం ఖాయం. ఈ సైట్‍లోకి అడుగుపెట్టిన వెంటనే ఓ అందమైన మోడల్ దేహంలోని నాలుగు భాగాలు ఓ వైపు, ఓ ఖాళీ బాక్స్ మరోవైపు కన్పిస్తాయి. ఏదో ఒక భాగాన్ని ఎంచుకుని ఖాళీబాక్స్ లో మీ పేరు టైప్ చేసి Apply బటన్ క్లిక్ చేస్తే కొద్ది క్షణాల్లో ఆ పిల్లదేహంపై మీ పేరుతో కూడిన టాటూ ప్రత్యక్షమవుతుంది. ఆ వీడియో క్లిప్‍ని మీ స్నేహితులకు పంపించుకోవచ్చు కూడా. అది చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఈర్ష్యపడతారు.
25, అక్టోబర్ 2007, గురువారం
IDEA GPRS నెట్ ని పిసి/లాప్ టాప్ పై పొందలేకపోతున్నారా?
IDEA GPRS ద్వారా ఫోన్లో ఇంటర్నెట్ వస్తూ బ్లూటూత్/డేటా కేబుల్ ద్వారా పిసి/లాప్ టాప్ కి కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఫోన్ డయలప్ కనెక్షన్ IDEA సర్వర్ కి కనెక్ట్ అయి కూడా ఏ వెబ్ పేజీ ఓపెన్ అవని ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంటుంది. దీనికి పరిష్కారంగా మోడెం ప్రాపర్టీలలో AT+CGDCONT=1, "IP", "INTERNET" అనే ఇనీషయలైజేషన్ విలువను ఇవ్వాలి. అదెలాగో ఈ వీడియోలో వివరంగా చూద్దాం.తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది, స్పీకర్లు ఆన్ చేసుకోండి.
స్క్రీన్‍పై సమాచారం చదవబడాలా??
అంధులను దృష్టిలో ఉంచుకుని XP ఆపరేటింగ్ సిస్టమ్‍లో Narrator అనే ప్రోగ్రాముని పొందుపరిచారు.. Programs>Accessories>Accessibility>Narrator అనే ఆప్షన్‍ని క్లిక్ చేయడం ద్వారాగాని, Run కమాండ్ బాక్స్ లో narrator అని టైప్ చేసినా ఈ ప్రోగ్రామ్ రన్ చేయబడుతుంది. ప్రోగ్రామ్ ఓపెన్ అయిన వెంటనే Announce events on screen అనే చెక్‍బాక్స్ ని టిక్ చేయండి. దీనితో మనం Win XP ఉపయోగించేటప్పుడు స్క్రీన్‍పై ప్రత్యక్షమయ్యే వివిధ డైలాగ్‍బాక్స్ లు
విండోలు, షార్ట్ కట్‍లు, ఎర్రర్ మెసేజ్‍లలోని సమాచారం మనకు స్పీకర్ల ద్వారా మనకు విన్పించబడుతుంది. మనం కీబోర్డ్ ద్వారా టైప్ చేసుకుంటుపోతే ఏమి టైప్ చేస్తున్నామో ఆ అక్షరాలు, పదాలను పైకి వినిపించి పెట్టే ఆప్షన్ కూడా narratorలో లబిస్తుంది. ఆ ప్రోగ్రామ్‍లోని Read Typed Characters అనే ఆప్షన్ని టిక్ చేసినప్పుడు ఇలా టైప్ చేసిన సమాచారం చదివి విన్పించబడుతుంది. కీబోర్డ్ షార్ట్ కట్‍ల ద్వారా కూడా దీన్ని వాడవచ్చు. ప్రస్తుతం స్క్రీన్‍పై కన్పిస్తున్న విండోలోని సమాచారం చదవబడడానికి Ctrl+Shift+Spacebarని, టైటిల్‍బార్ కోసం Alt+Home కీని ప్రెస్ చేయండి….
ప్రోగ్రాముల ప్రయారిటీ పెంచడం
మనం రెగ్యులర్ గా ఉపయోగించుకునే అప్లికేషన్ ప్రోగ్రాములు వేగంగా లోడ్ అవ్వాలని ఆశిస్తుంటాం. ప్రోగ్రామ్ యొక్క ఐకాన్‍ని క్లిక్ చేసిన వెంటనే క్షణాల్లో ఆ ప్రోగ్రామ్ విండో స్క్రీన్‍పై కనిపిస్తే చాలా రిలీఫ్‍గా ఉంటుంది. మన అవసరాలను దృష్టిలో ఉంచుకుని Win XP అపరేటింగ్ సిస్టమ్‍లో మనకు కావలసిన ప్రోగ్రాములు వేగంగా లోడ్ అయ్యే విధంగా ప్రయారిటీని సెట్ చేయదలుచుకున్నారో దానిని రన్ చేయండి. అది రన్ అవుతుండగా Ctrl+Alt+Del కీలను ప్రెస్ చేస్తే Task Manager వస్తుంది కదా! అందులో Process అనే విభాగంలోకి వెళ్ళి అక్కడ కన్పించే జాబితాలో మీకు కావలసిన ప్రోగ్రామ్ పేరుపై మౌస్‍తో రైట్ క్లిక్ చేసి Set Priority అనే ఆప్షన్ ఎంచుకోండి. వెంటనే స్క్రీన్‍పై Real Time, High, Above Normal, Normal, Below Normal, Low అనే వేర్వేరు ఆప్షన్లు కనిపిస్తాయి. మనం ప్రోగ్రామ్ వీలైనంత వేగంగా లోడ్ చేయబడేలా సెట్ చేయాలంటే High అనే ఆప్షన్ని ఎంచుకోండి. మిగిలిన ప్రోగ్రాముల కన్నా బాగా స్లోగా రన్ చేయబడాలంటే Low అనే సెట్టింగును ఎంచుకోవడం ఉత్తమం…
24, అక్టోబర్ 2007, బుధవారం
వేర్వేరు బ్రౌజర్లలో మీ వెబ్ పేజీ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
మీరు ఎంతో కష్టపడి రూపొందించుకునే వెబ్ పేజీలు విండోస్, Mac, Linux వంటి వేర్వేరు ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే Internet Explorer 5, 5.5, 6, 7, Firefox 1.5, 2.0, Opera, Safari వంటి పలు రకాల వెబ్ బ్రౌజర్లలో ఎలా కనిపిస్తాయో ప్రివ్యూ చూసుకోగలిగితే బాగుంటుంది కదా! ఒకవేళ ఏవైనా ముఖ్యమైన బ్రౌజర్లలో స్ర్కీన్ రిజల్యూషన్లు మార్చినప్పుడు, కలర్ డెప్త్ పెంచినప్పుడు నాణ్యతలో ఏదైనా తేడా వస్తే సరిచేసుకోవచ్చు. అయితే మీ వెబ్ సైట్ ని ఇలా వేర్వేరు బ్రౌజర్లతో తనిఖీ చేసుకోవాలంటే ప్రత్యేకంగా ఆయా బ్రౌజర్లు అన్నింటినీ మీ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవలసిన పనిలేదు. సింపుల్ గా http://browsershots.org/ అనే వెబ్ సైట్ కి వెళ్లి Enter your web address here అనే ప్రదేశం వద్ద మీ వెబ్ సైట్ అడ్రస్ ని టైప్ చేసి అది ఏయే బ్రౌజర్లలో తనిఖీ చేయబడాలో క్రింద ఎంచుకుని Submit బటన్ క్లిక్ చేయండి. వెంటనే వేరొక వెబ్ పేజీ వస్తుంది. అడ్రస్ బార్ నుండి ఆ అడ్రస్ ని కాపీ చేసుకుని కొద్దిసేపటి తర్వాత (30 నిముషాల లోపలే రావాలి సుమా) ఆ అడ్రస్ ని ఓపెన్ చేసి చూస్తే వేర్వేరు బ్రౌజర్ల లో మీ వెబ్ సైట్ ఎలా కనిపిస్తుందో స్ర్కీన్ షాట్లు చూపించబడతాయి.
ఆన్ లైన్లో బస్ టికెట్ బుక్ చేసుకోండి!
ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ వారు తమ కార్యకలాపాలను ఇంటర్నెట్ కీ విస్తరిస్తున్నారు. రైల్వే రిజర్వేషన్ సైట్ IRCTCని స్ఫ్హూర్తిగా తీసుకుని దాదాపు అదే తరహా లాంచనాలతో (PAN Card/Driving Licence/Voter ID) వంటి గుర్తింపు కార్డు ఏదైనా మీ వద్ద ఉన్నట్లయితే http://www.kesinenitravels.com/index.html అనే వెబ్ సైట్ ద్వారా ఆ ట్రావెల్స్ సంస్థ నడిపే రూట్లకు బస్ టికెట్లను మన కంప్యూటర్ నుండే రిజర్వేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం HDFC కార్డ్ ఉన్నవారు మాత్రమే ఆన్ లైన్ ద్వారా టికెట్ చెల్లింపులు జరుపగలుగుతారు. చెల్లింపు జరిపిన తర్వాత టికెట్ ని ప్రింట్ తీసుకుని మన వద్ద ఉన్న ఫొటో ID కార్డ్ తో సహా నేరుగా బస్ ఎక్కేయవచ్చు. మనం ఎక్కడ బస్ ఎక్కదలుచుకున్నదీ ఎంచుకోవచ్చు. ఇదే తరహాలో కాళేశ్వరీ ట్రావెల్స్ (http://www.srikaleswari.com/) సైట్ ని ప్రారంభించింది కానీ సర్వీసుల వివరాలు పొందుపరిచింది తప్ప టికెట్ బుకింగ్ సదుపాయం ప్రారంభించలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ ఇంత ముందంజలో ఉన్నా అతి పెద్ద రవాణా వ్యవస్థ APSRTC మాత్రం ఆన్ లైన్ రిజర్వేషన్ సదుపాయం (ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా) ప్రారంభించకపోవడం విచారకరం!
RPC (రిమోట్ ప్రొసీజర్ కాల్) దాడులు
RPC అనేది ఒక ప్రొటోకాల్. విండోస్ ఆపరేటింగ్ సిస్టం అప్లికేషన్లు ఇతర కంప్యూటర్లతో కమ్యూనికేట్ చేయడానికి, నెట్ వర్క్ల్ లో పనిచేస్తున్న ఏ కంప్యూటర్ పై అయినా అడ్మినిస్ర్టేర్లు ఇతర ప్రదేశాల నుండి రిమోట్ గా ప్రోగ్రామింగ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ప్రొటోకాల్ ఉపయోగించబడుతుంది. అయితే మంచి పనులకు ఉద్దేశించబడిన ఈ ప్రొటోకాల్ ని హ్యాకర్లు తమ స్వలాభానికి ఇంటర్నెట్ ద్వారా ఇతర కంప్యూటర్లపై నియంత్రణ సాధించడానికి వాడుకుంటారు. రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన Blaster Word ఈ RPC ప్రొటోకాల్ అధారంగానే కంప్యూటర్లో ప్రవేశిస్తుంది. అకస్మాత్తుగా ఈ క్రింది చిత్రంలో విధంగా స్ర్ద్కీన్ పై మెసేజ్ చూపించబడి 60 సెకండ్లలో కంప్యూటర్ రీస్టార్ట్ కావడం దీని స్వభావం. Windows XP SP2లో దీనికి ప్యాచ్ ని పొందుపరిచారు. అయితే ఇలాంటి RPC exploits ఎన్నో ఇంకా ఉన్నాయి.
23, అక్టోబర్ 2007, మంగళవారం
ఫొటోషాప్ లో ఒకే బ్యాక్ గ్రౌండ్లో పలు ఇమేజ్ లు మెర్జ్ చేయడం (వీడియో)
అడోబ్ ఫొటోషాప్ లో పలు ఒకే బ్యాక్ గ్రౌండ్ లో అనేక ఇమేజ్ లను ఇలా మెర్జ్ చేస్తారో ప్రాధమిక స్థాయిలో ఈ వీడియోలో వివరించాను. వీడియో పరిమాణం పెరిగిపోతుండడం వల్ల మరింత వివరంగా అందించలేకపోతున్నాను.
22, అక్టోబర్ 2007, సోమవారం
తెలుగు వికీపీడియాలో సమాచారాన్ని పొందడం
తెలుగు వికీపీడియాలో మనకు కావలసిన సమాచారం పొందడం ఎలాగో క్రింది వీడియోలో వివరించడం జరిగింది. తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది.
వికీపీడియాలో మీ ఊరి యొక్క వివరాలను పొందుపరచండి!
ప్రతీ గ్రామానికీ ఒక చరిత్ర ఉంటుంది, సంస్క్దృతి, ఆచారాలు, పండగలు ఉంటాయి. మీరు పుట్టిపెరిగిన గ్రామం గురించి ప్రపంచానికి తెలియజెప్పే గురుతర బాధ్యతని మీరే ఎందుకు తీసుకోకూడదు? మీకు ఆసక్తి ఉంటే తెలుగు వికీపీడియాలో మీ గ్రామం యొక్క వివరాలను పొందుపరచడం ఎలాగో ఈ క్రింది వీడియోలో (తెలుగు ఆడియో వివరణ సైతం ఉంటుంది) చూసి ఆ ప్రకారం మీ ఊరి వివరాలు పొందుపరచండి.
మీడియా ప్లేయర్ 10 లో ప్రైవసీ సెట్టింగులు
మీ సిస్టమ్‌లో Windows Media Player 10 వెర్షన్ ఉన్నట్లయితే అందులోని కొన్ని ఆప్షన్లని సెట్ చేయడం ద్వారా మీరు ఏయే ఫైళ్ళని ప్లే చేసారు... వంటి వివరాలు ఇతరుల కంట బడకుండా జాగ్రత్త వహించవచ్చు. Tools>Options అనే ఆప్షన్ ఎంచుకుని వెంటనే ప్రత్యక్షమయ్యే బాక్స్‌లో Privacy విభాగంలో Save file and URL history in the player అనే ఆప్షన్‌ని డిసేబుల్ చేస్తే మీరు ఓపెన్ చేసిన ఫైళ్ళ వివరాలు ఇతరులు గుర్తించలేరు. మనం Media Playerని ఎలా ఉపయోగిస్తున్నామన్న సమాచారం ఎప్పటికప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థకు చేరవేయబడేలా ప్లేయర్‌లో డీఫాల్ట్‌గా సెట్ చేయబడి ఉంటుంది. దీనిని డిసేబుల్ చేయడానికి Tools>Options>Privacy అనే విభాగంలో Customer Experience Improvement Program అనే ఆప్షన్ వద్ద టిక్ తీసేయండి. మనం ప్లే చేసిన సిడిలు, డివిడిల సమాచారం కనిపించకుండా ఉండాలంటే... Tools>Options>Privacy>History అనే విభాగంలో Clear Caches అనే ఆప్షన్ని టిక్ చేయండి. దీనితో అప్పటివరకూ, సిస్టమ్‌లో స్టోర్ అయిన మీరు ప్లే చేసిన సిడి/డివిడి ఫైళ్ళ వివరాలు చెరిపి వేయబడతాయి. ఈ చిట్కాలతో మీ ప్రైవసీ కాపాడుకోండి.
Firefox తక్కువ మెమరీ వాడుకునేలా..
Mozilla Firefox బ్రౌజర్ వినియోగం క్రమేపీ పెరుగుతుంది. స్వతహాగా ఉచిత సాఫ్ట్‌వేర్ అవడం,అనేక ఎక్స్‌టెన్షన్లు లభిస్తుండడం వల్ల పలువురు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. మీరూ Firefox వాడుతున్నట్లయితే ఆ ప్రోగ్రామ్ మినిమైజ్ చేయబడి ఉన్నప్పుడు RAM తక్కువగా ఉపయోగించబడేలా కాన్ఫిగర్ చేయవచ్చు. అడ్రస్‌బార్‌లో about:config అని టైప్ చేసి వెంటనే వచ్చే పేజీలో మౌస్‌తో రైట్‌క్లిక్ చేసి New>Boolean అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఇప్పుడు ఆ ఎంట్రీకి config.trim_on_minimize అనే పేరుని ఇచ్చి Trueగా సెట్ చేయండి. ఇప్పుడు Firefox రీస్టార్ట్ చేస్తే ఆ టెక్నిక్ పనిచేయనారంభిస్తుంది. ఇకపోతే Firefox అడ్రస్ బార్‌లో about అని టైప్ చేస్తే వెర్షన్ నెంబర్, కాపీరైట్ వంటి వివరాలు,about:config అని టైప్ చేయడం ద్వారా Configuration Console అనే పేజీ, about"cache అని టైప్ చేసి మన ఫైర్‌ఫాక్స్ ప్రోగ్రామ్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న వివిధ ప్లగ్ఇన్‌ల వివరాలు, about:credits అని టైప్ చేసి Firefox రూపకల్పనలో పాలు పంచుకున్న పలువురు ప్రోగ్రామర్ల పేర్లూ తెలుసుకోవచ్చు.
పిల్లల కోసం ప్రత్యేకంగా సెర్చ్ ఇంజిన్
కావలసిన సమాచారం కోసం వెదకడానికి Google వంటి సెర్చ్ ఇంజిన్‌ని వాడుతుంటాము. అయితే కంటెంట్ ఫిల్టరింగ్ సదుపాయాలు ఉన్నప్పటికీ పిల్లలు అడల్ట్ సమాచారాన్ని వెదకకుండా నిరోధించడంలో ఈ సెర్చ్ ఇంజిన్‌లు విఫలం అవుతున్నాయి.ఈ నేపధ్యంలో ప్రత్యేకంగా పిల్లల కోసమే ఉద్ధేశించబడిన www.zoo.com అనే సెర్చ్ ఇంజిన్‌ని మీ హోమ్ పేజి్‌గా సెట్ చేసుకోండి. పిల్లలను ఆకట్టుకునే జంతువుల బొమ్మలతో కూడిన ఈ సెర్చ్ ఇంజిన్‌లో మీ పిల్లలు సెర్చ్ చేసే సమాచారం పూర్తిగా విజ్ఞానానికి , వినోదానికి సంబంధించినదై ఉంటుంది. ఉదా. కు ఎవరైన పిల్లలు breast cancer అని కీవర్డ్ టైప్ చేస్తే దాని గురించి సమస్త సమాచారం లింక్‌ల రూపంలో లభిస్తుంది. అదే breast అని టైప్ చేస్తే ఎలాంటి రిజల్టూ చూపించబడదు.
21, అక్టోబర్ 2007, ఆదివారం
స్ట్ర్రీమింగ్ సైట్ల నుండి పాటలను ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు (వీడియో)
ఆంధ్రావిలాస్.కాం, తెలుగుఎఫ్ ఎం.కాం వంటి సైట్లలో ప్లే అయ్యే పాటలను క్రింది వీడియోలో సూచించిన పద్ధతిలో మీ హార్డ్ డిస్క్ లోకి నిక్షేపంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వీడియోలో తెలుగు ఆడియో వివరణ కూడా ఉంటుంది.
ఇంటర్నెట్ బ్రౌజింగ్ టిప్స్
వెబ్‌సైట్లలో Home పేజ్‌లోని లింక్‌లను క్లిక్ చెయ్యడం ద్వారా వేరే పేజికి చేరుకున్నపుడు తిరిగి ముందు పేజీకి రావాలంటే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లోని Back, Forward బటన్లని మౌస్‌తో క్లిక్ చేస్తుంటాం కదా! మౌస్‌తో పనిలేకుండానే కీబోర్డ్ ద్వారా కూడా ముందు, తర్వాతి పేజీలకి చేరుకోవచ్చు. ఇంతకుముందు బ్రౌజ్ చేసిన పేజీకి వెళ్ళడానికి Alt+Left Arrow కీల సముదాయాన్ని, తర్వాతి పేజీకి వెళ్ళడానికి Alt+Right Arrow కీలను ప్రెస్ చేయాలి. అలాగే ఒక వెబ్ పేజీలో ఒక నిర్ధిష్టమైన పదం ఎక్కడ ఉందో వెదకడానికి పెజీ మొత్తాన్నీ ప్రైకీ, క్రిందకీ స్క్రోల్ చేస్తూ సమయం వృధా పరచనవసరం లేదు. Ctrl+F కీ కాంబినేషన్‌ని ప్రెస్ చేసినట్లయితే స్క్రీంపై Find డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. దీనిలో మీరు ఏ పదాన్నయినా టైప్ చేసి ఆ వెబ్ పేజీలో ఆ పదం ఏ ప్రదేశంలో తటస్థపడిందో వెదకమని చెప్పవచ్చు. Find డైలాగ్ బాక్స్‌లో Up బటన్‌ని టిక్ చేసినట్లయితే ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుండి పైవైపు మనం కోరిన పదం వెదకబడుతుంది.
వాయిస్ మెయిలింగ్ సాఫ్ట్‌వేర్
ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయి ఉండగా మైక్రోఫోన్‌లో వాయిస్ మెయిల్స్ పంపించుకోవడానికీ, సాధారణ టెక్స్ట్ మెయిల్స్ పంపించడానికి ఉపకరించే సాఫ్ట్‌వేర్ Talk Sender. వాస్తవానికి ఇది ప్రత్యేకమైన ఇ-మెయిల్ క్లయింట్‌లా పనిచేసేదైనప్పటికీ ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న ఇ-మెయిల్ క్లయింట్‌తో సైతం పనిచెయ్యగలుగుతుంది. దీన్ని ఉపయోగించి మెయిల్స్‌ని ఏ మెయిల్ సర్వర్‌కైనా పంపించవచ్చు. రిసీవ్ చేసుకోవచ్చు. రిసీవ్ చేసుకున్న మెయిల్ మెసేజ్‌లను మీకోసం చదివి వినిపిస్తుంది.
డీటెయిల్డ్ మెమరీ రిపోర్ట్ మేనేజ్‌మెంట్
మీ సిస్టమ్లో ఇన్‌స్టాల్ చెయ్యబడి ఉన్న ఫిజికల్ RAM మొదలుకుని, విండోస్ వర్చువల్ మెమరీ, వీడియో మెమరీల వినియోగం ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు విశ్లేషించి చూపే అద్భుతమైన సాఫ్ట్‌వేర్ టూల్ MemoryKit. ప్రస్తుతం మీరు రన్ చేస్తున్న అప్లికేషన్ ప్రోగ్రాముల్లో ఏది ఎంతెంత ఫిజికల్, వర్చువల్ మెమరీని వినియోగించుకుంటోంది, మొత్తం వీడియో మెమరీలో ఎంతభాగం వినియోగంలో ఉన్నదీ తెలియజేయడంతోపాటు మెమరీ లీకేజీపై ఒక కన్నేసి ఉంచి టైం గడిచేకొద్దీ మెమరీ లీక్ కారణంగా సిస్టమ్ స్లో అవకుండా లీకేజ్‌ని నిరోధిస్తుంది ఈ సాఫ్ట్‌వేర్. మెమరీపై ఓవర్‌లోడ్ పడినప్పుడు కూడా దారిలో పెడుతుంది ఇది.
19, అక్టోబర్ 2007, శుక్రవారం
నవంబర్ 2007 "కంప్యూటర్ ఎరా" కవర్ పేజీ ఇది..
ప్రతీ లైనూ ఎంతో ఉపయుక్తమైన సమాచారంతో 'ది బెస్ట్' పాఠకులకు అందించాలన్న తపనతో 'కంప్యూటర్ ఎరా' నవంబర్ 2007 సంచికను అత్యుత్తమంగా రూపొందించడం జరిగింది. ఈ సంచికని చదివి మీరే చెప్పండి. మీ అంచనాలకు మించిన స్థాయిలో తయారైన సంచిక ఇది. అక్టోబర్ 27 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలో ఈ సంచిక లభ్యమవుతుంది. దాని ముఖచిత్రమిది.
వీడియోకి టెక్స్‌ట్ , ఆడియో
AVI, MPEG వంటి వీడియో ఫైళ్ళకి మనకు నచ్చిన ఆడియో సాంగ్స్‌ని జతచేసుకునే సదుపాయాన్ని Muvee Auto Producer అనే మృదులాంత్రము(Software) కల్పిస్తుంది ఆకర్షణీయంగా, చాలా సులభంగా ఆపరేట్ చేసే ఇంటర్‌ఫేస్‌ని కలిగియున్న ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో సినిమాలపై అన్ని ఫ్రేముల్లోనూ చూపించబడే విధంగా కేప్షన్లని పొందుపరచవచ్చు. WAV, MP3 ఆడియో ఫార్మేట్లని ఇది సపోర్ట్ చేస్తుంది. 6.96 MB పరిమాణం గలదు దీనికి.
పవర్‌ఫుల్ ఫాంట్ మెనేజ్‌మెంట్ ప్రోగ్రామ్
మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చెయ్యబడి ఉన్న TTF (True Type Fonts),PS Fonts లను ప్రివ్యూ చూసుకోవడానికీ, ఆల్రెడీ ఇన్‌స్టాల్ చెయ్యబడిన ఫాంట్లని తొలగించడానికీ, క్రొత్త TTF ఫాంట్లని ఇన్‌స్టాల్ చేసుకోవడానికీ, ఒక్కో ఫాంట్ డిజైనింగ్‌లో అనుసరించబడిన క్యారెక్టర్ మ్యాప్‌ని తెలుసుకోవడానికీ, Weight, Maximum Character Width, Overhang, Pitch వంటి టెక్నికల్ వివరాలు తెలుసుకోవడానికీ, తొలగించబడిన ఫాంట్లని మళ్ళీ ఇన్‌స్టాల్ చెయ్యకుండానే ప్రివ్యూ చూడడానికి ఉపకరించే శక్తివంతమైన ఫాంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ 'Fontastic' ..
18, అక్టోబర్ 2007, గురువారం
https:// ఎంతవరకు సురక్షితం
మనందరికి వెబ్‍సైట్లని ఓపెన్ చేసేటప్పుడు http అనే ప్రోటోకాల్ గురించి మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఆన్‍లైన్ ద్వారా బ్యాంక్ లావాదేవీలు, కొనుగోళ్ళు, అమ్మకాలు, బిల్ చెల్లింపులు ఎక్కువైన నేపధ్యంలో మనం పంపించే క్రెడిట్ కార్డ్ సమాచారం క్రాకర్ల బారిన పడకుండా నేరుగా చేరవలసిన వారి వద్దకు మాత్రమే చేరడానికి కొత్తగా https ( Hyper Text Transfer Protocol Secure) అనే మరో ప్రోటోకాల్ ఉపయోగించబడుతుంది. https ప్రోటోకాల్‍ని ఉపయోగించే వెబ్‍సైట్‍ని బ్రౌజ్ చేసేటప్పుడు ఆ సైట్‍కి మన కంప్యూటర్‍కీ మధ్య సెక్యూర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఉదా.కు.. AndhraBank ఇటీవల Infi-Net పేరిట నెట్ బ్యాంకింగ్ సేవలను మొదలుపెట్టింది. ఆంధ్రాబ్యాంక్ వెబ్‍సైట్‍లోని Infi-Net లింక్‍ని మనం క్లిక్ చేసిన వెంటనే http://andhrabank.net.in పేరిట సెక్యూర్డ్ కనెక్షన్ క్రియేట్ అవుతుంది. ఇక ఇక్కడి నుండి మనం ఆ వెబ్‍సైట్‍తో పంచుకునే User ID, Pin, Transaction PIN వంటి వివరాలన్నీ ఇతరుల దృష్టికి వెళ్ళే అవకాశాలే లేవు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే.. సమాచారం పంపించే Sender కి , అ సమాచారాన్ని అందుకునే Receiver కి మధ్య https ప్రోటోకాల్ బలమైన సెక్యూరిటీ గోడను నిర్మించి కేవలం రిసీవర్ మాత్రమే ఆ సమాచారాన్ని పొందగలిగేలా, డీకోడ్ చేసుకునేలా జాగ్రత్త వహిస్తుంది.
ఇలా https ప్రోటోకాల్ ద్వారా పంపించబడే సమాచారాన్ని దొంగిలించడం ఎంత డబ్బు, టైమ్, కంప్యూటర్ నాలెడ్జ్ ని వెచ్చించినా వీలుపడదు. అయితే సమాచారాన్ని రిసీవి చేసుకున్న వ్యక్తులు దానిని దుర్వినియోగం చేస్తే మాత్రమ్ ఎవరూ ఏమీ చేయలేరు. అయితే కొందరు హ్యాకర్లు అచ్చం సెక్యూర్డ్ వెబ్‍సైట్ ఎలా ఉంటుందో అదే రూపంలో ఒక URL లింక్‍ని మీ మెయిల్‍కి పంఫించి మీరు ఆ లింక్‍ని ఓపెన్ చేసి విలువైన సమాచారం అందించినప్పుడు అది హ్యాకర్ల బారిన పడుతుంది. ఈ నేపధ్యంలో మీరు బ్రౌజ్ చేస్తున్నది సెక్యూర్డ్ కనెక్షన్ అవునో కాదో నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కీలకమైన సమాచారాన్ని ఇవ్వండి. https సైట్ ఓపెన్ అయినప్పుడు IE, Firefox
వంటి వెబ్ బ్రౌజర్ విండోలో క్రింది కుడిచేతి వైపు Padlock సింబల్ ప్రత్యక్షమవ్వాలి. అప్పుడు మాత్రమే అది సెక్యూర్డ్ కనెక్షన్. అలాగే అనేక సెక్యూర్డ్ వెబ్‍సైట్లు VeriSign వంటి సెక్యూరిటీ గ్రూపుల ద్వారా సెక్యూరిటీ సర్టిఫికెట్లని పొంది ఉంటాయి. అలాంటప్పుడు ఆ సైట్‍లో VeriSign లోగో సైతం ఉంటుంది. ఆ లోగోపై మనం క్లిక్ చేస్తే ఆ సైట్ యొక్క సెక్యూరిటీ credentials, అవి ఎక్స్ పైర్ అయ్యే తేదీ తదితర వివరాలు చూపించబడతాయి. మనల్ని తప్పుదోవ పట్టించే Fake URL లలో సైతం VeriSign లోగో కన్పించవచ్చు. అయితే దానిని క్లిక్ చేస్తే ఏమీ రాదు. సెక్యూర్డ్ వెబ్‍సైట్‍కి , Fake వెబ్‍సైట్‍కి మధ్య ఇదే తేడా!
అలాగే సెక్యూర్డ్ వెబ్‍సైట్లని ఓపెన్ చేసినప్పుడు ఆ సైట్లు చూపించే security/privacy స్టేట్‍మెంట్‍లోని సమాచారాన్ని క్షుణ్ణంగా చదవడంవల్ల ఆ వెబ్‍సైట్ ద్వారా మనం పంపించే సమాచారం ఎంతవరకు సురక్షితంగా ఉంటుందన్న విషయం అర్ధమవుతుంది. HTTPS ప్రోటోకాల్ SSL ( Secure Sockets Layer) ఆధారంగా మనం బ్రౌజ్ చేస్తున్న వెబ్‍సైట్లు నిజమైనదా కదా అని తనిఖీ చేస్తుంది. అలాగే మన Internet Explorer బ్రౌజర్ ఆ సైట్ యొక్క సెక్యీరిటీ సర్టిఫికెట్‍ని సైతం తనిఖీ చేస్తుంది. ఆ తర్వాత మీ బ్రౌజర్ మరియు ఆ వెబ్‍సైట్ మాత్రమే అర్ధం చేసుకోగలిగే డేటా ఎన్‍క్రిప్షన్ టెక్నిక్ ఎంచుకోబడుతుంది. ఇలా జరిగిన వెంటనే మనం పంపించే ప్రతీ సమాచారం ఆ ఎన్‍క్రిప్షన్ టెక్నిక్‍లోకి మార్చబడి వెబ్‍సైట్‍కి ప్రయాణం చేస్తుంది. డేటా వెబ్‍సైట్‍కి చేరుకున్న తర్వాత ఆ వెబ్‍సైట్ ఆ సమాచారాన్ని డీక్రిప్ట్ చేసుకుంటుంది.
ఒకవేళ మీరు చెల్లింపులతో కూడుకున్న వెబ్‍సైట్‍ని ఏదైనా మెయింటేన్ చేస్తున్నట్లయితే మీరు https ప్రోటోకాల్‍ని ఉపయోగించవచ్చు. దీనికిగాను… ముందు మీ వెబ్‍సైట్‍కి పర్మినెంటుగా ఓ IP అడ్రస్ ఉండాలి. సాధారణ http ప్రోటోకాల్ ఆధారంగా పనిచేసే అన్ని వెబ్‍సైట్లు సహజంగా ఎప్పుడూ మారుతుండే డైనమిక్ IP అడ్రస్‍ని మాత్రమే కలిగి ఉంటాయి. Static IP Address కోసం భారీ మొత్తం వెచ్చించవలసి ఉంటుంది. అలాగే మీ సర్వర్ HTTPS ప్రొటోకాల్‍ని సపోర్ట్ చేసే విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ సర్వర్ యూజర్ల యొక్క సిస్టమ్‍ల నుండి వచ్చే SSL కమ్యూనికేషన్లని అనుమతించాలి…
17, అక్టోబర్ 2007, బుధవారం
ఒక హార్డ్ డిస్క్ లోని డేటా మరో దానికి...
హార్డ్ డిస్కుల ధరలు బాగా తక్కువ ఉన్న నేపధ్యంలో కంప్యూటర్ యూజర్లు తమ వద్ద ఉన్న తక్కువ కెపాసిటీ హార్డ్ డిస్కులకు బదులు ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన భారీ హార్డ్ డిస్కులను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొత్త హార్డ్ డిస్కును కొనడం బానే ఉంటుంది. కాని మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం, పాత హార్డ్ డిస్కులో ఉన్న అన్ని ఫైళ్ళని, ఫోల్డర్లని కొత్తదానిలోకి కాపీ చేయడం పెద్ద తలనొప్పి వ్యవహారం. ఈ నేపధ్యంలో Acronis Migrate Easy వంటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్లని ఉపయోగించడం వల్ల చాలా శ్రమ తగ్గుతుంది పాత హార్డ్ డిస్కులోని అన్ని ఫైళ్ళనీ, సెట్టింగులనూ కొత్త డిస్కులోనికి యధాతథంగా క్లోన్ చేయగలుగుతుంది. పాత హార్డ్ డిస్కులోని సమాచారాన్ని డంప్ చేసిన తర్వాత కొత్త హార్డ్ డిస్క్ యొక్క పరిమాణానికి తగ్గట్టుగా కొత్త పార్టీషన్లని క్రియేట్ చేసుకోవచ్చు. రీసైజ్ చేసుకోవచ్చు.
16, అక్టోబర్ 2007, మంగళవారం
Yahoo ... భిన్న రూపాలు.
ప్రతీ పిసి యూజర్ నోటిపై నిరంతరం మెదిలే Yahoo పోర్టల్ వయసు 17 ఏళ్ళు. 1994 సంవత్సరంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటికీ చెందిన ఇద్దరు విద్యార్థులు Filo మరియు Yang తమకు నచ్చిన వేలకొద్ది వెబ్ సైట్ల సమాచారాన్ని సేకరించి, ఒక డేటాబేస్‌ని సృష్టించి దానికి Yet Another Hierarchical Officious Oracle అనే అర్ధం ధ్వనించేలా Yahoo అని నిక్‌నేం పెట్టేశారు. ప్రపంచంలోని కంప్యూటర్ యూజర్లందరికీ యహూ గురించి ఏదో ఒక రూపేణా తప్పకుండా తెలిసే ఉంటుంది.
మీకు తెలుసా:
యాహూ హోంపేజీలోని Yahoo ! అనే పదంలోని వింత. మీ బ్రౌజర్లో యాహూ హోం పేజ్ తెరవండి. అందులో యాహూ పక్కన ఉన్న ! అనే గుర్తు మీద క్లిక్ చేయండి. వినండి అది ఏమంటుందో??
15, అక్టోబర్ 2007, సోమవారం
వినూత్నమైన క్లాక్, డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్
Premium Clock అనే మృదులాంత్రాన్ని(Software) ని ఉపయోగించి మీ డెస్క్‌టాప్‌కి Analog, Digital క్లాక్‌లను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోగలిగే ట్రే క్లాక్‌ని, వాల్‌పేపర్లని, అలారమ్ షెడ్యూలర్, కాలెండర్ వంటి అనేక సదుపాయాలను జతచేసుకోవచ్చు. పలు skins నుండి నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. అవసరం లేదనుకుంటే windows classic స్క్రీన్‌ని అట్టిపెట్టుకోవచ్చు. Windows 95 to XP వరకూ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే ఈ సాఫ్ట్‌వేర్‌ని www.premiumclock.com అనే వెబ్సైట్ నుండి పొందవచ్చు.
బాడీల నుండి ఫేస్‌లను మార్చే ప్రోగ్రామ్..
ఎమ్మెస్ నారాయణ శరీరానికి రాజశేఖర్‌రెడ్డి మొహాన్ని తగిలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఊహకు అందడం లేదా.. అయితే వారిద్దరి ఫోటోలను సేకరించి FaceOnBody అనే మృదులాంత్రాన్ని(Software)డౌన్‌లోడ్ చేసుకుని ఐశ్వర్యారాయ్ శరీరానికి కల్పనారాయ్ ఫేస్‌ని తగిలించి సరదాగా నవ్వుకోవచ్చు. మీ బాడీకి చిరంజీవి ఫేస్‌ని తగిలించి ముచ్చట తీర్చుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ ట్రయల్ వర్షన్‌ని www.faceonbody.com అనే వెబ్సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
14, అక్టోబర్ 2007, ఆదివారం
ఫైల్‍లో మరో ఫైల్ గోప్యంగా పంపించాలా?
మీవద్ద అత్యంత ముఖ్యమైన సమాచారం ఉన్నప్పుడు ఆ ఫైల్‍ని ఇతరులకు నేరుగా మెయిల్ అటాచ్‍మెంట్ ద్వారా గాని , సిడి, ఫ్లాపీల్లోకి గాని కాపీ చేసి ఇవ్వడం వల్ల ఇతరులు ఎవరైనా దానిని ఓపెన్ చేసి దుర్వినియోగం చేసే అవకాశమూ ఉంటుంది. దీనిని నిరోధించడానికి Steganography 1.8 అనే సాఫ్ట్ వేర్ వాడవచ్చు. దీని సాయంతో పిక్చర్లు, సౌండ్ ఫైళ్ళు, వీడియో ఫైళ్ళలో మన వద్ద ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని ఎన్‍క్రిప్ట్ చేసి పంపించవచ్చు. చూడడానికి అది సాధారణ పిక్చర్ ఫైల్‍గా కనిపించినా ఇదే సాఫ్ట్ వేర్‍తో Unhide చేసినపుడు ఫైల్ లోపల మనం దాచిపెట్టిన సమాచారం ప్రత్యక్షమవుతుంది. కీలకమైన సమాచారానికి ఇది పనికొస్తుంది.
పవర్‍ఫుల్ ట్రాన్స్ లేషన్, డిక్షనరీ సాఫ్ట్ వేర్
మనం ఎంపిక చేసుకున్న సమాచారాన్ని ఒక అంతర్జాతీయ భాష నుండి మరొక భాషకు తర్జుమా చెయ్యడానికి ఉపకరించే శక్తివంతమైన మృదులాంత్రము(Software) Babylon 6. ఇది అటు డిక్షనరీగానూ ఉపయోగపడుతుంది. Word, Pagemaker వంటి ఏ డెస్క్ టాప్ అప్లికేషన్‍లో అయినా కొంత సమాచారాన్ని సెలెక్ట్ చేసుకుని ముందే కాన్ఫిగర్ చేసి పెట్టుకున్న కీబోర్డ్ షార్ట్ కట్‍ని ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్‍గా ఆ సమాచారం ట్రాన్స్ లేట్ చెయ్యడానికి, లేదా డిక్షనరీలో అర్ధం చూడడానికి అవసరం అయిన గైడ్‍లైన్స్ వస్తాయి. English, Japanese, German, Greek, French, Russian వంటి ప్రముఖ అంతర్జాతీయ భాషలను ఈ మృదులాంత్రము(Software) సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్‍పై ఈ మృదులాంత్రము ట్రయల్ వెర్షన్ www.babylon.com సైట్‍లో పొందవచ్చును.
11, అక్టోబర్ 2007, గురువారం
ఆటోమేటిక్‍గా డీఫ్రాగ్‍మెంట్ చేయడానికి
హార్ద్ డిస్క్ పై చెల్లాచెదురుగా పడి ఉన్న ఫైళ్ళని ఒక క్రమపద్ధతిలో
అమర్చుకోవడానికి ’డిస్క్ డీఫ్రాగ్మెంటర్’ అనే ప్రోగ్రాముని ఉపయోగిస్తాం
కదా, అయితే దానిని ఎప్పటికప్పుడు మనం మాన్యువల్ ప్రారంభించుకోవాలి.
దీనిని దృష్టిలోనే బ్యాక్ గ్రౌండ్‍లో రన్ అవుతూ వాటన్నింటినీ ఒక క్రమపద్ధతిలో
అమర్చే Magic Defrag అనే ప్రోగ్రామ్ రూపొందించింది. యూజర్ సిస్టమ్ ఖాళీగా ఉంచినపుడు మాత్రమే ఇది రంగంలోకి దిగుతుంది. దీనివల్ల యూజర్ తన పనులు చేసుకోవడానికి ప్రాసెసింగ్ పవర్ నష్టపోవలసిన పరిస్థితి తలెత్తదు.
నాణ్యమైన PDF ఫైళ్ళని సృష్టించడానికి..
హై రిజల్యూషన్ గల Vector based PDF ఫైళ్ళని సృష్టించుకోవడానికి
ActMask All2PDF అనే సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది.ఈ సాఫ్ట్ వేర్‍ని
ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత ఏ విండోస్ అప్లికేషన్‍లో అయినా సింపుల్
File>Print కమాండ్ ద్వారా నేరుగా అప్పటివరకు మీరు డిజైన్ చేసిన
డాక్యుమెంట్లని PDF ఫైల్లుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా సృష్టించబడిన
ఫైళ్ళలో కావలసిన సమాచారం కోసం వెదకవచ్చు. ఈ ప్రోగ్రామ్‍తో క్రియేట్
చేసిన డాక్యుమెంట్లని ఎవరూ ఎడిట్/మోడిఫై చెయ్యలేరు. 128-bit
ఎన్‍క్రిప్షన్ ప్రక్రియ ఆధారంగా ఫైళ్ళకు పూర్తి సెక్యూరిటీ లభిస్తుంది
9, అక్టోబర్ 2007, మంగళవారం
మైక్రోసాఫ్ట్ నుండి ’సోప్ బాక్స్’
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ యూజర్లు తమ వద్ద ఉన్న వీడియో ఫైళ్ళని ఇతరులతో పంచుకోవడానికి వీలు కల్పిస్తూ YouTube, Google Video వంటి సర్వీసులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ స్వయంగా MSN Soapbox పేరిట ఓ వీడియో అప్‍లోడ్ సర్వీస్ నడుపుతోంది. దీనిని http://video.msn.com/ అనే వెబ్సైట్ నుండి యాక్సెస్ చేయవచ్చు. YouTube మాదిరిగానే Soapboxలో కూడా ఏ వీడియో ఫార్మేట్‍లో ఉన్న వీడియోలనైనా సర్వర్‍కి అప్‍లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అప్‍లోడ్ చేసిన వీడియోలకు టాగ్‍లను తగిలించి , ఆ టాగ్‍ల ఆధారంగా ఇతర నెట్ యూజర్లు సులభంగా మీ వీడియోలు గుర్తించగలిగేలా ఏర్పాటు చేసుకోవచ్చు. వీడియోని అప్‍లోడ్ చేసే సమయంలోనే అదే స్క్రీన్‍పై వేరొకరు పోస్ట్ చేసిన వీడియోలు వెదికిపట్టుకుని అప్‍లోడ్ జరుగుతున్నపుడే మరోవైపు మనకు నచ్చిన వీడియోలు ప్లే చేసుకునే అవకాశం ఒకటి ఇందులో మనకు లభిస్తుంది.
వీడియోనే వాల్‍పేపర్‍గా సెట్ చేయండి
Windows Vista ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉన్నవారికి ఓ శుభవార్త. Dreamscene Preview పేరిట మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా ఓ సాఫ్ట్ వేర్‍ని Windows Vista Ultimate ఎడిషన్ కలిగియున్న యూజర్లకి అందిస్తోంది. మనం కంప్యూటర్ డెస్క్ టాప్‍పై వాల్‍పేపర్లని ఎలా అమర్చుకుంటామో అదే మాదిరిగా ఫోటోలకు బదులుగా మన వద్ద ఉన్న వీడియో ఫైళ్ళని బ్యాక్ గ్రౌండ్‍గా సెట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్ వేర్ వీలు కల్పిస్తుంది. అయితే ఈ సాఫ్ట్ వేర్ సక్రమంగా పనిచెయ్యాలంటే Vista Aero ఇంటర్‍ఫేస్‍ని సపోర్ట్ చేసే గ్రాఫిక్ కార్డ్ మీ కంప్యూటర్లో అమర్చబడి ఉండాలి. అయితే ఈ సాఫ్ట్ వేర్ కేవలం Windows Vista Ultimate ఎడిషన్ కలిగి ఉన్నయూజర్లకి మాత్రమే అందించబడుతోంది. Home Basic వంటి తక్కువస్థాయి ఎడిషన్లని కలిగి ఉన్నవారికి ఇది లభించదు. విండోస్ అప్ డేట్ ని రన్ చేయడం ద్వారా మైక్రోసాప్ట్ సైట్ నుండి దీనిని పొందవచ్చు. అన్నట్టు Vista ఆపరేటింగ్ సిస్టమ్‍లో అనే వెర్షన్లు ఉన్నాయని తెలిసిందే కదా! వాటన్నింటికి వేర్వేరు డిస్క్ లు ఉంటాయని చాలా మంది అపోహ పడుతుంటారు. అయితే Vista DVD ఒకటే ఉంటుంది. ఇన్‍స్టలేషన్ సమయంలో మనం ఎంచుకునే వెర్షన్ బట్టి, మనం ఎంటర్ చేసే ప్రోడక్ట్ కీని ఆధారంగా చేసుకుని మనకు కావలసిన వెర్షన్ ఇన్‍స్టాల్ అవుతుంది.
8, అక్టోబర్ 2007, సోమవారం
డిలీట్ అయిన ఫోటోలను రికవర్ చేయడం
ప్రస్తుతం డిజిటల్ కెమెరాల వినియోగం బాగా పెరిగింది. కాంపాక్ట్ ఫ్లాష్
కార్డ్ లపై ఈ కెమెరాల ద్వారా రికార్డ్ చేసుకున్న ఫోటోలు, వీడియోలు
సేవ్ చేయబడతాయి. ఈ నేపధ్యంలో మెమరీ కార్డ్ లోని స్పేస్ నిండి
పోయిన తరవాత అందులోని డేటాని పిసిలోకి ట్రాన్స్ ఫర్ చేసుకుని
ఖాళీ చేస్తుంటారు.అయితే ఒక్కోసారి పిసిలో ఉన్న ఫైళ్ళని పొరబాటున
డిలీట్ చేశామనుకోండి,అటు మెమరీ కార్డ్ ఖాళీగా ఉంటుంది,పిసిలోనూ
డేటా లభించదు. అలాంటప్పుడు డిజిటల్ కెమెరాల మెమరీ కార్డ్ ల
నుండి వీలైనంత వరకూ డిలీట్ చేసిన సమాచారాన్ని తిరిగి రప్పించడానికి
ఉపకరించే ప్రోగ్రామే Easy Photo Recovery. ఈ ప్రోగ్రామ్
CompactFlash, IBM Microdrives, Smart Media,
MMC, Secure Digital(SD) వంటి అన్ని రకాల మెమరీ
కార్డుల నుండి డేటాని రికవర్ చేయడానికి పనికొస్తుంది.
VLC ప్లేయర్ నచ్చిందా..MAC కి లభిస్తోంది…
VideoLan అనే సంస్థ అభివృద్ధి చెసిన VLC ప్లేయర్ అనే సాఫ్ట్ వేర్‍ని
ఒక్కసారి వాడి చూశారంటే మనం రెగ్యూలర్‍గా ఉపయోగించే Windows
Media Player, WinAmp, PowerDVD వంటి వీడియో
ప్లేయర్ సాఫ్ట్ వేర్లు ఎంత స్లోగా పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది.
దాదాపు వాడుకలో ఉన్న అన్ని రకాల వీడియో ఫైళ్ళని ఈ ప్లేయర్ ప్లే
చేయగలుగుతుంది. http://www.videolan.org/vlc
అనే వెబ్ సైట్‍లో లభిస్తున్న ఈ సాఫ్ట్ వేర్ అటు విండోస్ ఆపరేటింగ్
సిస్టమ్‍తోపాటు MAC ఆపరేటింగ్ సిస్టమ్‍కి ప్రత్యేకించి రూపొందించబడిన
వెర్షన్ సైతం లభిస్తుంది. ఈ ప్లేయర్‍ని ఉపయోగించి డీఫాల్ట్ గా MACలో
సరైన ప్లేయర్ లేకపోవడం ద్వారా ప్లే అవని అన్ని రకాల ఆడియో,
వీడియో ఫైళ్ళని సులభంగా ప్లే చేసుకోవడం వీలుపడుతుంది.
1, అక్టోబర్ 2007, సోమవారం
ఫైళ్లు డిలీట్ అవడం లేదా?
ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ నుండి అనేక వైరస్ లు, స్ఫైవేర్లు, డయలర్ ప్రోగ్రాములు, బ్రౌజర్ హైజాకర్లు మన సిస్టంలోకి ప్రవేశించి మనకు తెలియకుండానే కొన్ని ఫైళ్లని Windows\System32 వంటి కీలకమైన ఫోల్డర్లలో దాచిపెడుతున్నాయి. సహజంగా ఆయా సిస్టం ఫోల్డర్లలో ఆపరేటింగ్ సిస్టంకి అతి ముఖ్యమైన ఫైళ్లు భధ్రపరచబడి ఉండడం వల్ల ఎవరూ ఆ ఫోల్డర్లలోని ఫైళ్లని డిలీట్ చేయడానికి సాహసించరు అని వైరస్ రూపకర్తల అభిప్రాయం. అయితే కొండొకచో ఎవరైనా ఫలానా ఫోల్డర్లో ఉన్న ఫలానా ఫైల్ వైరస్ కి సంబంధించినది అని తెలుసుకోగలిగినా తీరా ఆ ఫైల్ ని డిలీట్ చేయడానికి ప్రయత్నించినా Cannot delete file: It is being used by another person or program అని మెసేజ్ చూపించబడి డిలీట్ అవకుండా మొరాయిస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో http://ccollomb.free.fr/unlocker/unlocker1.8.5.exe అనే వెబ్ పేజీలో లభించే Unlocker అనే ప్రోగ్రాం ఏ ఫైల్ అయితే డిలీట్ అవకుండా వేధిస్తోందో దానికి రక్షణగా నిలుస్తున్న ప్రాసెస్ లను గుర్తించి ఆ ఫైల్ ని డిలీట్ చేయగలిగేలా మార్గం సుగమం చేస్తుంది.
సిస్టం ఎందుకు షట్ డౌన్ అవడం లేదు?
విండోస్ ఆపరేటింగ్ సిస్టంని ఉపయోగించే పలువురు యూజర్లు తమ కంప్యూటర్ ని షట్ డౌన్ చేసేటప్పుడు అన్ని ప్రోగ్రాముల్నీ క్లోజ్ చేసినా సిస్టం షట్ డౌన్ అవడం లేదని Ctrl+Alt+Del కీలతో బలవంతంగా రీస్టార్ట్ చేయవలసి వస్తోందని వాపోతుంటారు. దీనికి కారణాలు విశ్లేషిద్దాం. మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టంని బూట్ చేసినప్పుడు విండోస్ కి సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు, డివైజ్ డ్రైవర్లు, ఇతరత్రా ప్రోగ్రాముల స్టార్టప్ ఫైళ్లు మెమరీలోకి లోడ్ చేయబడతాయి. ఎప్పుడైతే మనం విండోస్ ని షట్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తామో అప్పటివరకూ మెమరీలో ఉన్న ఫైళ్లు అన్నీ మెమరీ నుండి అన్ లోడ్ చేయబడి హార్డ్ డిస్క్ పై తిరిగి సేవ్ చేయబడతాయి. ఈ నేపధ్యంలో మనం సిస్టంని షట్ డౌన్ చేసేటప్పుడు ఏ ఒక్క ఫైల్ అయినా మెమరీ నుండి బయటకు రాకుండా అలాగే మొండిగా కూర్చున్నట్లయితే విండోస్ పలుమార్లు దానిని బలవంతంగా క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పటికీ అది క్లోజ్ చేయబడకపోయినట్లయితే సిస్టం షట్ డౌన్ అవకుండా ఆగిపోతుంది. ఇక గత్యంతరం లేక మనం పవర్ బటన్ ని ఉపయోగించి కంప్యూటర్ ని ఆఫ్ చేయవలసి వస్తుంది.