15, ఏప్రిల్ 2008, మంగళవారం
స్వంత గూటికి ప్రస్థానం
13, ఏప్రిల్ 2008, ఆదివారం
సంగీతం సృష్టించడానికో సాఫ్ట్ వేర్

చవులూరించే సంగీతాన్నీ సృష్టించాలనుకుంటే Ableton Live అనే సాఫ్ట్ వేర్ మీకు బాగా ఉపయోగపడుతుంది. వేర్వేరు పరికరాల ఆధారంగా మ్యూజిక్ ని కంపోజ్ చేయడానికి, రికార్డ్, రీమిక్స్ చేయడానికి ఈ సాఫ్ట్ వేర్ వీలు కలిపిస్తుంది.32-bit/192kHz వరకు మల్టీ ట్రాక్ రికార్డింగ్ ని సపోర్ట్ చేయడం తో పాటు టైం స్త్రేచ్చింగ్, రాప్పింగ్ చేయవచ్చు. అనేక స్పెషల్ ఫిల్టర్లను అవసరాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు.
MP 3 పాటలన్నింటి జాబితాను పొందడానికి

మీ హార్డ్ డిస్క్ లో వేర్వేరు సినిమాలకు సంబంధించి వందలకొద్దీ MP3 పాటలు ఉన్నాయనుకోండి. వాటన్నింటి పేర్లతో ఒ జాబితా కావాలంటే ప్రతీ సాంగ్ టైటిల్ ని కష్టపడి మళ్ళీ టైప్ చేసుకునే అవసరం లేకుండా MP3 ListMaker అనే సాఫ్ట్ వేర్ ని ఉపయోగించండి. ఇది మనం ఎంచుకున్న డ్రైవ్ ని తనిఖీ చేసి వెదికి పట్టుకున్న MP3 ఫైళ్ళని టెక్స్ట్ ఫైలుగా, లేదంటే వెబ్ పేజీగా రూపొందిస్తుంది. ఒకవేళ ఆ వెబ్ పేజీలో రిజినల్ ఫైలు లొకేషన్ కి లింకులు సైతం పొందుపరచ బడాలన్నా వీలవుతుంది. లేదా వెదికి పట్టుకున్న ఫైళ్ళతో Play List నీ క్రియేట్ చేసుకోవచ్చు.