2, జనవరి 2008, బుధవారం

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్‌కి మీ పేరు


ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ టైటిల్ బార్‌లో Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కన మీ పేరు కూడా చూపించబడేలా WinXpలో ఏర్పాటు చేసుకోవడానికి ఒక మార్గముంది.దీనికిగాను,మొదట Start>Run కమాండ్ బాక్స్ లొ gpedit.msc అనే కమాండ్‌ని టైప్ చేసి O.K కొట్టండి. వెంటనే Group Policy Editor Options అనే పలు ఆప్షన్లతో కూడిన యుటిలిటీ ఓపెన్ అవుతుంది. అందులో User Configuration>Windows Settings అనే విభాగంలోకి వెళ్ళండి. దాని క్రింద Internet Explorer Maintainance అనే ఆప్షన్ వద్ద కుడిచేతి వైపు 'Browser Title' అనే ఆప్షన్ దర్శనమిస్తుంటుంది. దాన్ని మౌస్‌తొ డబుల్ క్లిక్ చెయ్యండి. దాంతో Browser Titleపేరిట ఒక విండో ప్రత్యక్షమవుతుంది. ఆ విండోలో Customize Title Bars అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి... Title boxలో మీరు ఇవ్వాలనుకున్న పేరుని టైప్ చెయ్యండి. ఇకపై మీరు ఎప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసినా Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కనే మీ పేరూ టైటిల్ బార్‌పై చూపించబడుతుంటుంది.

బరహతో వర్డ్ లో తెలుగు రావట్లేదా?

తెలుగుని టైప్ చేయడానికి మనం ఉపయోగించే బరహ సాఫ్ట్ వేర్ తో MS-Wordలో తెలుగు టైప్ చేస్తుంటే సమాచారం బాక్సులుగా వస్తోందని చాలామంది చెబుతుంటారు. ఈ సమస్యని పరిష్కరించడం ఎలాగో ఈ క్రింది ఆడియో వివరణతో కూడిన వీడియో ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది. ఇక్కడ నేను వివరించిన పద్ధతి కన్నా మెరుగైన విధానం ఏదైనా ఉంటే తెలుపగలరు. అయితే ఈ పద్ధతి ద్వారా ప్రతీసారీ ఫాంట్ ని మార్చుకోవలసి ఉంటుంది. ఈ సమస్యపై వీవెన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత మరో పరిష్కారం లభించింది. Wordలోని Format మెనూలో Styles and Formatting అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే కుడిచేతి వైపు ప్రత్యక్షమయ్యే విభాగంలో New Style అనే బటన్ ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యక్షమయ్యే బాక్సులో Formatting అనే బాక్స్ వద్ద Gautami అనే ఫాంట్ ని సెట్ చేసుకోవాలి. చివరిగా ఆ New Style డైలాగ్ బాక్స్ లోనే Add to Template అనే ఆప్షన్ టిక్ చేసి పెడితే ఇకపై Styles మెనూలో Style1 పేరిట ఆ కొత్త స్టైల్ వస్తుంది. ఇక ఎప్పుడు తెలుగులో టైప్ చేయాలన్నా ఆ కొత్త స్టైల్ ని ఎంచుకుంటే సరిపోతుంది. తెలుగు నేరుగా వచ్చేస్తుంది. వీడియోలో చూపించిన ప్రకారం ప్రతీసారీ మార్చుకోనవసరం లేదు.

1, జనవరి 2008, మంగళవారం

ఓవర్ క్లాకింగ్ అంటే ఏమిటంటే..

మీరు ఓవర్ క్లాకింగ్ అనే పదాన్ని వినే ఉంటారు.. ఓవర్ క్లాకింగ్ అంటే ఏమిటో క్లుప్తంగా వివరిస్తాను! ప్రాసెసర్ నే ఉదాహరణగా తీసుకుని చెబుతాను.. ఇంటెల్ Core2Duo 1.82GHz ప్రాసెసర్ ఉందనుకుందాం మీ దగ్గర. వాస్తవానికి ఇంటెల్ సంస్థ ఆ ప్రాసెసర్ ని 2GHz సామర్థ్యంతో పనిచేసేలా రూపొందించి ఉంటుంది.. కానీ బాక్స్ పై మాత్రం 1.82GHz అనే ముద్రిస్తుంది.. కారణం ప్రాసెసర్ పూర్తి కెపాసిటీలో పనిచేయించినప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంటుంది. లాగే BIOSలోనూ 1.82GHz క్లాక్ స్పీడ్ లో మాత్రమే పనిచేసేలా సెట్ చేయబడి ఉంటుంది.. ఓవర్ క్లాకింగ్ అంటే మన స్వంత రిస్క్ మీద 2GHzలో పనిచేసేలా ఏర్పాటు చేసుకోవడం.. దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. ప్రాసెసర్లు, గ్రాఫిక్ కార్డులు వంటి స్వంత ప్రాసెసింగ్ ఏర్పాట్లు కలిగిన అనేక హార్డ్ వేర్ పరికరాలు ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు.. క్లాక్ స్పీడ్ ని గరిష్ట స్థాయికి పెంచుకోవడమే ఓవర్ క్లాకింగ్, ఇది క్షేమం కాదు.