2, సెప్టెంబర్ 2014, మంగళవారం

500 వీడియోల MileStoneకి చేరుకోవడం జరిగింది.

.milestone
తెలుగు వారందరికీ సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో పూర్తిగా తెలుగులో "కంప్యూటర్ ఎరా" పత్రిక అందిస్తున్న టెక్నికల్ వీడియోలు ఈరోజుతో 500లకు చేరుకోవడం జరిగింది.

ప్రొఫెషనల్‌గా వీడియోలు ఉండడం కోసం వీటిలో ఒక్కో వీడియో తయారీకి 3-4 గంటల సమయం వెచ్చించడం జరిగింది. వీటి తయారీ వెనుక పడిన శ్రమ మాకే తెలుసు. ఇప్పటికీ వీటిని చాలామంది సద్వినియోగం చేసుకోవలసి ఉంది.

ఓ లక్ష్యం కోసం చాలా పట్టుదలతో తయారు చేస్తున్న ఈ వీడియోలను మీ మిత్రులకూ షేర్ చేస్తుండడం ద్వారా టెక్నాలజీని తెలుగు ప్రజలందరికీ చేర్చాలన్న ఈ ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించగలరు.

ఈ ఛానెల్‌కి మీరు ఇప్పటికి Subscribe చేసుకోపోయి ఉంటే http://youtube.com/nallamothu అనే లింకుకి వెళ్లి Subscribe కొట్టండి.

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్

కామెంట్‌లు లేవు: