జూలై 9, 2007న ప్రారంభించబడిన "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" బ్లాగు ఈరోజుకి (5 నెలల 8 రోజులు) సరిగ్గా పదివేల విజిట్స్ ని పొందింది. ఏదో నాకు తెలిసింది పదిమందికీ తెలియజేద్దామని రోజుకి ఒకి రెండు పోస్టుల చొప్పున ఇప్పటివరకూ 267 పోస్టులను (వీడియో, టెక్ట్స్ కలిపి) చేయడం జరిగింది. ఈ బ్లాగు నిరంతరం పోస్టులతో ఇంత పచ్చగా కళకళలాడుతూ ఉందంటే దాని వెనుక జ్యోతి గారి కృషి కూడా ఎంతో ఉంది. ఆవిడకి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఈ బ్లాగును రెగ్యులర్ గా విజిట్ చేస్తున్న పాఠకులకు ధన్యవాదాలు. మీ ఆశీర్వాదంతో ఇదే ఉత్సాహంతో పనిచేస్తాను.
- నల్లమోతు శ్రీధర్
6 కామెంట్లు:
Best of Luck Sridhar,,
may u always be successful with ur magazine, forum, and blog...
శ్రీధర్ గారు,
తెలుగువారిలో సాంకేతికంగా మంచి పరిజ్ఞానం వున్నవారు చాలామంది వున్నారు. కానీ, సాటి తెలుగువారికి సాంకేతిక విషయాలని తెలుగులో, అదీ సరళమైన రీతిలో, ఈ స్థాయిలో అందిస్తున్నది మీరు మాత్రమే. తెలుగు వారికీ, తెలుగు భాషకూ ఇది ఒక సేవ.
ఇలాంటి శుభపరిణామాలు, విజయాలు మీకు ఎన్నో అందుతాయని ఆశిస్తూ,
నమస్కారములతో,
'తెలుగుదనం' మురళీ కృష్ణ
శ్రీధర్ గారూ,నాకు చర్మం మందం,సిగ్గు తక్కువ కానీ నేను తరచూ మీబ్లాగు మీరు అందిస్తున్న సేవలు,సలహాలు చూసి ఈమధ్య కాలంలో చాలా సార్లు ఇతనిలా నేనూ ఏమన్నా చేయగలనా అని తీవ్రంగా అలోచించి చెయలేను అనే నిర్ణయానికొచ్చాను. మీరు ఇలగే కొనసాగాలని ఆశిస్తూ,
అభివాదాలతో
మిత్రుడు
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
మీ టపాలు చదివి లాభపడ్డ వాళ్ల లో నేను కూడా ఉన్నాను.రాస్తున్న మీకు, అందిస్తున్న జ్యొతక్కకు అభినందనలు.
సాంకేతిక విజ్ఞానం అందించే ఒక బ్లాగు కేవలం 5 నెలల 8 రోజుల్లో ఎటువంటి జిమ్మిక్కులూ, మసాలాలూ లేకుండా 10,000 పై చిలుకు హిట్లు, రోజుకి 66 సగటు, 5.58 పేజీల పఠనీయతని సాధించిదంటే అది సామాన్యమైన విషయం కాదు. శ్రీధర్ గారూ మీ శ్రమ ఎంతో అభినందనీయం. అంతకంటే ఫలాత్మకం. ఇక్కడ అందరూ వ్యాఖ్యలు రాయలేకపోయినా ఉపయోగించుకున్న వారు ఎక్కువేనని ఈ గణాంకాల ద్వారా తెలియకనే తెలుస్తూ వున్నది. కొనసాగించగలరు. మీతో పాటు జ్యోతిగారికి కూడా కృతజ్ఞతలు. యావదాంధ్ర ప్రజలు మీకు ఋణపడివుంటారని ఆశిస్తూ. .
నా ఆనందానికి స్పందిచిన ప్రతీ ఒక్కరికీ ఎంతో ఋణపడి ఉంటాను..
జ్యోతి గారూ.. విజయోస్తు అన్న మీ ఆశీర్వాదానికి ధన్యవాదాలు!
మురళీకృష్ణ వలివేటి గారూ.. నాకు కొద్దిపాటి ఖాళీ సమయం లభిస్తోంది కాబట్టి ఏదో నాకు తోచినది చేస్తున్నాను.
రాజేంద్రకుమార్ దేవరపల్లి గారూ.. మీకు తెలుసా, మీ బ్లాగు విషయంలోనూ నేను సేమ్ టు సేమ్ మీలాగే ఫీల్ అయ్యాను.. రాజేంద్ర గారిలా విభిన్నంగా ఏమీ చేయలేమా అని.. కానీ నా టాపిక్ సాంకేతికాలు అయిపోయింది భిన్నత్వం చూపించే అవకాశం లేకుండా! మీ శైలి, ప్రజంటేషన్ చాలా బాగున్నాయి.
సిబిరావు గారూ.. మీరు మొదటి నుండి వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.
వింజమూరి విజయకుమార్ గారూ.. చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి గురించి, కాపురం గురించి రాసే పోస్టులకు వచ్చేమాదిరి హిట్లు సాంకేతికాలుకు రాకపోవడం చూసి అప్పుడప్పుడు నిరుత్సాహపడినా.. నాతో సహా సగటు కామన్ మెన్ తనకు ఉపయోగపడే వాటికన్నాఇతరుల గురించి తెలుసుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తాడని తెలుసు కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో రాస్తున్నాను. మీ ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు.
- నల్లమోతు శ్రీధర్
కామెంట్‌ను పోస్ట్ చేయండి