12, డిసెంబర్ 2007, బుధవారం

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 5


కంప్యూటర్స్ A-Z పార్ట్ - 1

కొన్ని విషయాలపై సమగ్రమైన ఆవగాహన ఉంటే అద్భుతాలు సాధించవచ్చు. అయితే ఆయా అంశాల గురించి సమగ్రమైన సమాచారం మొత్తం ఒకే చోట లభించడం కష్టం. ఉదా..పిడిఎఫ్ ఫైళ్ళని ప్రత్యేకంగా ఫాంట్లు ఏమీ ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే ఏ విండోస్, మాక్, లినక్స్ వంటి ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా సులభంగా ఓపెన్ చేయవచ్చని తెలుసనుకోండి. అసలు PDF ఫైల్ అంటే ఏమిటి, మీరు కూడా మీ డాక్యుమెంట్లని ఆ ఫార్మేట్‌లోకి మార్చాలంటే ఏం చేయాలి, PDF ఫైళ్ళ క్రియేషన్‌లో ఎంచుకోవలసిన సెట్టింగులు తదితర అంశాలను గురించి తెలుసుకోకపోతే ఆ టెక్నాలజీ ద్వారా మీరు గరిష్ట ప్రయోజనం పొందడం సాధ్యపడదు. ఇది ఉదాహరణ మాత్రమే. కంప్యూటర్లపై పనిచేసేటప్పుడు నిరంతరం మనకు అనేక అంశాలు తారసపడుతుంటాయి. ప్రతీ పిసి వినియోగదారుడికి సహజంగా ఎదురయ్యే అనేక సందర్భాలను వీలైనంత వివరంగ చర్చిస్తూ ప్రచురిస్తున్న పుస్తకమే ఈ "కంప్యూటర్స్ A-Z" ఇందులో పిసి యూజర్లకి సహజంగా ఎదురయ్యే సమస్యలు మొదలుకుని, వైరస్‌లు, స్పైవేర్లు, హ్యాకింగ్, సిస్టమ్ సెక్యూరిటీ, ఇంటర్‌నెట్ వినియోగం, భారతీయ వెబ్‌సైట్ల వివరాలు, వివిధ అప్లికేషన్ల ప్రోగ్రాముల్లో ఉపయోగించదగ్గ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు వంటి అనేక అంశాల గురించి సవివరంగా చర్చించడం జరిగింది. ఉదా. మనం చాలా తేలికగా తీసేసే ఫాంట్ల గురించే వేర్వేరు ఫాంట్ స్టైళ్ళు, ఫాంట్ల ఇన్‌స్టలేషన్ ఇబ్బందులు, డీఫాల్ట్‌గా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయి ఉండే ఫాంట్ల వివరాలు, కొత్త హాంట్లని డిజైన్ చేయడానికి ఎలాంటి సాఫ్ట్‌వేర్లు ఉపయోగించాలి వంటి అంశాలను ఈ పుస్తకంలో చర్చించాము. రెండు వాల్యూములుగా ఈ పుస్తకాన్ని విభజించడం జరిగింది. ఈ రెండు భాగాలు ప్రతీ పిసి యూజర్ వద్ద తప్పనిసరిగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. నాకు తెలిసిందే చాలు అంటే ఎప్పటికి నాలెడ్జ్ పెరగదు. కొత్త విషయాలను తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టాలి అన్న ఉత్సాహం ఉన్నవారికి ఎంతో ఆసక్తి రేకెత్తించే అంశాలు ఈ సిరీస్‌లో ప్రచురించడం జరిగింది. వీటిని సమగ్రంగా అర్ధం చేసుకుని మీ రోజువారీ కంప్యూటర్ కార్యకలాపాలను మరింత సులభతరం చేసుకుంటారని ఆశిస్తున్నాం.

కామెంట్‌లు లేవు: