12, డిసెంబర్ 2007, బుధవారం

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 2


పిసి ట్రబుల్‍షూటింగ్

ఇంట్లో టివి ఎంత అవసరం అయిపోయిందో ఈ మధ్య కాలంలో కంప్యూటర్ కూడా అంతే నిత్యావసరంగా మారింది. చదువుకుంటున్న పిల్లల కోసమైతేనేమి, లేదా విదేశాల్లో ఉన్న ఆత్మీయులతో మాట్లాడుకోవడం కోసమని, స్వతహాగా ఆసక్తి ఉండడం వల్లనైతేనేమి ఇళ్ళలొ కంప్యూటర్లు వడేవారు అధికమయ్యారు. కంప్యూటర్ అనేది ఒకటి ఉంటే దాని మూలంగానూ కొన్ని ఇబ్బందులు చీటికి మాటికీ తలెత్తుతుంటాయి. వైరస్, స్పైవేర్, బ్రౌజర్ హైజాకర్లు, కీలాగర్లు వంటివి మన కంప్యూటర్‌కి ఇన్‌ఫెక్ట్ అవడం మొదలుకుని అప్పటివరకూ సక్రమంగా పనిచేస్తున్న కంప్యూటర్ ఉన్న ఫళాన హ్యాంగ్ అయిపోవడం , అసలు కంప్యూటరే బూట్ అవకపోవడం, బీప్ సౌండ్‌లు రావడం, స్క్రీన్‌పై రకరకాల ఎర్రర మెసేజ్‌లు ప్రదర్శించబడడం, టాస్క్‌బార్,,ఫోల్డర్ ఆప్షన్లు, కమాండ్ ప్రాంప్ట్ వంటి వాటిని యాక్సెస్ చేస్తుంటే ఎర్రర్ మెసేజ్‌లు రావడం, డెక్స్‌టాప్‌పై ఐకాన్లు మారిపోవడం, ఇల్లా చెప్పుకుంటూ పోతుంటే మనం కంప్యూటర్‌ని వాడే విధానాన్ని బట్టి, మన పిసిలో ఇన్‌స్టాల్ చేసుకున్న సాఫ్ట్‌వేర్లు, హార్డ్‌వేర్ పరికరాలను బట్టి వేర్వేరు సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. కంప్యూటర్ అయితే కొంటాం కానీ ఇలా చీటికి మాటికి ఇబ్బంది పెట్టే సమస్యలను ఎలా పరిష్కరించాలన్నది మాత్రం అంతుబట్టదు. దీంతో చాలామంది పిసి యూజర్లు హార్డ్‌వేర్ టెక్నీషియన్లని ఆశ్రయిస్తుంటారు. అయితే కొంతమంది హార్డ్‌వేర్ నిపుణులకు మాత్రమే ట్రబుల్‌షూటింగ్ పై పూర్తిస్థాయి ఆవగాహన ఉంటుంది. వారు మాత్రమే అసలు సమస్య ఎందుకు ఉత్పన్నాం అయిందో గుర్తించి దాన్ని సులభంగా పరిష్కరించగలుగుతారు. అయితే దురదృష్టవశాత్తు అధికశాతం మంది హార్డ్‌వేర్ నిపుణులుగా చలామణి అయ్యేవారికి హార్డ్‌డిస్క్‌ని ఫార్మేట్ చేయడం, ఆపరేటింగ్ సిస్టమ్‌ని రీ్ఇన్‌స్టాల్ చేయడం ఒక్కటే అతను చేయగలిగింది. ఇలా ప్రతీ దానికీ ఫార్మేట్ చేయడం వల్ల ఎంత విలువైన సమచారాన్ని,సమయాన్ని వృధా చేస్తుంటామో ఒక్కసారి ఆలోచించండి? ప్రతీ కంప్యూటర్ సమస్యకీ ఒక పరిష్కారముంటుందీ. ఆయా పరిష్కారాలను తెలుసుకుంటే చిటికెలో పాడైన సిస్టమ్‌ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఇళ్ళలొ కంప్యూటర్లని వాడే ప్రతీ హోమ్ పిసి యూజర్లకి, పిసి ట్రబుల్‌షూటింగ్‌పై పెద్ద ఆవగాహన లేని హార్డ్‌వేర్ టెక్నీషియన్లకి ఉపయోగపడే విధంగా 'ట్రబుల్ షూటింగ్" పేరిట ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాము... ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రోగ్రాములు, సెక్యూరిటీ లోపాలు, వైరస్‌లు, బగ్స్ వంటి అనేక అంశాల కారణంగా తరచుగా తలెత్తే పలు సమస్యలకు పరిష్కారాలను ప్రచురించడం జరిగింది. మీరు పిసిపై పనిచేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అయినా ఒక్కసారి ఈ పుస్తకాన్ని రిఫర్ చేస్తే మీ సమస్యకి చాలావరకూ పరిష్కారం లభిస్తుంది.

కామెంట్‌లు లేవు: