6, డిసెంబర్ 2007, గురువారం

రెండు మౌస్‍లు, రెండు పాయింటర్లు



సాధారణంగా మన కంప్యూటర్‌కి ఓ PS/2 మౌస్‌ని కనెక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు USB మౌస్ లూ వాడుకలోకి వచ్చాయి కాబట్టి దాదాపు అందరం వాటినే వాడుతున్నాం. ఎప్పుడైనా PS/2 మౌస్‌తోపాటు ఓ USB మౌస్‌నో, కార్డ్ లెస్ మౌస్‌నో కనెక్ట్ చేసి చూడండి. రెండు మౌస్‌లూ పనిచేస్తాయి. రెండింటిలో ఒకసారికి ఒక మౌస్ మాత్రమే పనిచేస్తుంటుంది. అంటే ఆ రెండు మౌస్‌లూ ఒకే మౌస్ పాయింటర్‌ని కంట్రోల్ చేస్తుంటాయన్నమాట. ఒకే పాయింటర్‌నే అందిస్తున్నప్పుడు రెండు మౌస్‌లు వాడడం దండగ కదా! దీనిని దృష్టిలో ఉంచుకునే మైక్రోసాఫ్ట్ సంస్థ Microsoft Multipoint అనే సాఫ్ట్ వేర్ ని విడుదల చేసింది. ఈ సాఫ్ట్ వేర్ ని మన కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకునప్పుడు మన వద్ద రెండు మౌస్‌లు ఉన్నట్లయితే ఒక్కో మౌస్‌కి ఒక్కో పాయింటర్ చొప్పున లభిస్తుంది. ప్రతీ పాయింటర్‌తోనూ వేర్వేరు పనులను నిర్వర్తించుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్కూళ్లలో కంప్యూటర్ల సంఖ్య తక్కువగా ఉండడం మూలంగా ఒకే కంప్యూటర్‌ని పలువురు విద్యార్థులు పంచుకోవలసి వస్తుంటుంది. అలాంటప్పుడు ప్రతీ విద్యార్థికి ఓ మౌస్ ఏర్పాటు చేయగలిగితే అతను చేయదలుచుకున్న పనులను సులువుగా చేయడానికి వీలుపడుతుంది. దీనికోసమే ఈ సాఫ్ట్ ‌వేర్ ఉద్దేశించబడింది.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Respected Sir,
The forum is being asked by regading (telugu fonts issue) this problem. Even I am also posted two posts for this issue. Thanks for the solvation

అజ్ఞాత చెప్పారు...

sir me blog bagundi... nakoka chinna help kavali... ee telugupadam.org anedi evari bloglo ina pettukovachha... ala ite html ela dorukutundi.... pl. help me.
keshav.rb@gmail.com, www.kesland.blogspot.com