5, డిసెంబర్ 2007, బుధవారం

మామూలు ఫోన్లని స్మార్ట్ ఫోన్లుగా మార్చుకోండి


మనం వాడే సెల్ ఫోన్లలో మూడు రకాలుంటాయి. కేవలం ఫోన్‌కాల్స్ చేసుకోవడానికి, SMSలు పంపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడే బేసిక్‌ఫోన్లు మొదటి రకం కాగా, బ్లూటూత్, జావా సపోర్ట్, WAPబ్రౌజర్ వంటి సదుపాయాలు గల Dumb ఫోన్లు(మోటరోలా MotoRAZARవంటివి) రెండవ రకం ఫోన్లు! మన కంప్యూటర్లో విండోస్ ఎలాగో అలాగే ఫోన్లలోనూ Symbian, Windows Mobile వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లు కలిగిన స్మార్ట్ ఫోన్లు మూడవ రకం. అయితే చాలామంది దాదాపు స్మార్ట్ ఫోన్లని కొనుగోలు చేయగల బడ్జెట్‌కి కేవలం ఫోన్ డిజైన్‌కి బుట్టలో పడో, సరైన ఆవగాహన లేకనో రెండవ రకమైన Dumbఫోన్లని ఎంచుకుంటుంటారు. వీటిలో కేవలం కొన్ని ప్రాధమికమైన సాఫ్ట్ వేర్లని మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వీలుపడుతుంది. మీవద్ద ఇలాంటి ఫోన్లు ఉన్నట్లయితే మీకు అందుబాటులో ఉన్న కొన్ని అదనపు సదుపాయాల గురించి చూద్దాం. మీ ఫోన్లలో నెట్‌ని బ్రౌజ్ చేసుకోవడానికి ఫోన్‌లో ఉండే డీఫాల్ట్ WAP బ్రౌజర్‌కి బదులుగా Opera Mini అనే సాఫ్ట్ వేర్ వాడండి. అలాగే మీకు GPRS కనెక్షన్ ఉంటే Google,Yahoo మెయిల్స్ ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే VNC సాఫ్ట్ వేర్‌ని మీ ఫోన్‌లోనూ, పిసిలోనూ ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా నెట్ ఆధారంగా ఎక్కడినుండైనా మీ పిసిని ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే Mobispine అనే ప్రోగ్రామ్ ద్వారా RSSఫీడ్లనూ ఫోన్‌లో చదువుకోవచ్చు.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Why do you think RAZR is dumb?

Unknown చెప్పారు...

రాజా గారూ..

మంచి సందేహం వెలిబుచ్చారు. Razr సింబియాన్, విండోస్ మొబైల్ తరహాలో అప్లికేషన్ డెవలప్ మెంట్ కి ఎక్కువ ఆస్కారం గల యూనివర్శల్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కలిగిలేకపోవడం దానికున్న పెద్ద లోపం. సింబియాన్ S40, S60, S90, UIQ, విండోస్ మొబైల్ ఆధారిత ఫోన్లకు మాదిరిగా Razrకి అంత విస్తృత స్థాయిలో అప్లికేషన్లు దొరుకుతాయేమో ప్రయత్నిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. ఇకపోతే స్మార్ట్ ఫోన్లు అంటే రకరకాల అప్లికేషన్లని ఇన్ స్టాల్ చేసుకుని విభిన్న పనులను చేసుకోవడానికి వీలుకల్పించే ఫోన్లు అని చెప్పుకుంటాం కదా. కేవలం జావా అప్లికేషన్ల సపోర్ట్ తప్ప రేజర్ కి వేరే ప్రత్యామ్నాయం లేనందువల్ల అలా రాయవలసి వచ్చింది. ఒకవేళ నేను ఏ విషయంలో అయినా పొరబడి ఉంటే క్షమించండి.

- నల్లమోతు శ్రీధర్

అజ్ఞాత చెప్పారు...

Yeah I agree, I work for Moto and couldn't immediately digest that kind of dark remark on Razr.

Yes, Razr's OS P2K is kind of old-fashioned and Moto seriously ignored the need of a better OS to develop their phones until last year.

Lets see how the market receives the LJ phones Moto rolled out this year.