4, డిసెంబర్ 2007, మంగళవారం
ఉచిత వెబ్‍సైట్ నిర్వహించుకోదలుచుకుంటే...
ఇటీవలి కాలంలో ప్రతీ ఒక్కరూ తమ వివరాలు, ఫోటోలు, వీడియోలు తదితర సమాచారంతో ఇంటర్నెట్‌పై వెబ్‌సైట్లు సృష్టించుకుంటున్నారు. అనేక వెబ్ హోస్టింగ్ సర్వీసులు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇదే కోవలో ఈ మధ్య 12GB భారీ కెపాసిటీని అందిస్తూ వెబ్‌హోస్టింగ్ సర్వీసును అందించే ww.12gbfree.com అనే వెబ్‌సైట్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. సహజంగా ఉచితంగా వెబ్‌హోస్టింగ్ సేవలను అందించే అనేక ఇతర సర్వీసులు రకరకాల అడ్వర్‌టైజ్‌మెంట్లను (ఒక్కోసారి అశ్లీలమైనవి కూడా) మన వెబ్‌సైట్లలో చూపిస్తుంటాయి. వాటిని భిన్నంగా ఈ వెబ్‌సైట్ బలవంతపు అడ్వర్‌టైజ్‌మెంట్లు వేటినీ చూపించదు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారికి, స్వంత వెబ్‌సైట్లని రూపొందించుకోవాలని కోరిక ఉన్న వ్యక్తులకు ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. ఈ సర్వీస్ 25GB వరకూ నెలసరి డేటా ట్రాన్స్‌ఫర్‌ని కల్పిస్తోంది. కాబట్టి పెద్ద పెద్ద వీడియోలు, సాఫ్ట్‌వేర్లు పొందుపరుచుకుంటే తప్ప కేవలం చిన్నపాటి అవసరాలకు వెబ్‌సైట్‌ని నిర్వహించుకునే వారికి ఇది భేషుగ్గా సరిపోతుంది. FTP సపోర్ట్ లభిస్తోంది. మీ సైట్‌ని ఏరోజు ఎంతమంది విజిట్ చేశారన్న వివరాలు అందించబడతాయి. మీ సైట్‌కి అనుబంధంగా బ్లాగులు, ఫోరమ్‌లు ప్రారంభించుకోనూ వచ్చు!
1 కామెంట్:
శ్రీధర్ గారు, చాలా మంచి సమాచారం ఇచ్చారు.థాంక్స్,కానీ యాంటీ స్పాం మెజర్స్ లో వాళ్ళు ఇచ్చిన లెటర్సును ఎంతకూ యాక్సెప్ట్ చేయడంలేదు ఎందువల్లంటారూ
కామెంట్‌ను పోస్ట్ చేయండి