12, డిసెంబర్ 2007, బుధవారం

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 9


ఏ సాఫ్ట్ వేర్ ఎలా పని చేస్తుంది?

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 3.1, 95 దశలో ఉన్నప్పుడు కేవలం చాలా పరిమితమైన సాఫ్ట్‌వేర్లు మాత్రమే ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌కి లభించేవి . విండోస్ 98 ఆవిర్భావం నుండి విండోస్ ఆధారంగా పనిచేసే ధర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు వెల్లువలా విడుదలవడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రతీ దైనందిక అవసరానికీ ఒక సాఫ్ట్‌వేర్ లభిస్తోందీ. మీ రోజువారీ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం దగ్గర నుండి మీ కంప్యూటర్‌ని వేగంగా పనిచేసేలా చేయడం వరకూ, ఇంటర్‌నెట్‌లో మీకు నచ్చిన సమాచారాన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసి పెట్టడం మొదలుకుని మీ కంప్యూటర్లో ఎవరు ఏం చేస్తున్నారు అన్నది సీక్రెట్‌గా రికార్డ్ చేసి మీకు రిపోర్ట్ చూపించే సాఫ్ట్‌వేర్లు అయితే ఉన్నాయి కానీ వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది చాలామందికి ఆవగాహన లేక వాటి ద్వారా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ నేపధ్యంలొ ఈ పుస్తకంలో వేర్వేరు సాఫ్ట్‌వేర్లు గురించి, అవి ఏ ప్రయోజనాన్ని అందిస్తాయి అన్న ఆంశం మొదలుకుని వాటిని ఓపెన్ చేసిన తర్వాత ఏయే మెనూలో, ఏయే డైలాగ్ బాక్స్‌లో ఏ విధంగా ఆప్షన్లు ఎంచుకోవాలి, ఎలాంటి ఫలితాలు పొందడానికి ఎలాంటి సెట్టింగులు చేయాలి వంటి అంశాల గురించి చర్చించడం జరిగింది. పిసి యూజర్లకి తరచుగా ఉపయోగపడే వేర్వేరు సాఫ్ట్‌వేర్ల పనితీరు గురించి ఇందులో వివరంగా చర్చించాం. అలాగే ఇదే పుస్తకంలో కంప్యూటర్ రంగంలో అనేక అంశాల గురించి విశ్లేషణాత్మకంగా చర్చించిన అనేక వ్యాసాలను కూడా పొందుపరచడం జరిగింది. ప్రతీ కంప్యూటర్ యూజర్‌కి ఏదో రూపేణా ఇవి ఉపయుక్తంగా ఉండగలవు.

కామెంట్‌లు లేవు: