28, ఫిబ్రవరి 2015, శనివారం

లాస్ట్ మూమెంట్‌లో కూడా cab, auto బుక్ చేసుకోవడం ఎలా? - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=74E3WsnqBc8

హైద్రాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఇప్పటివరకూ మనకు అందుబాటులో ఉన్న cab సర్వీసులు అన్నీ ఓ గంటా, రెండు గంటలూ, లేదా ఓ రోజు ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది.

అర్జెంటుగా ఫ్యామిలీ మొత్తం ఓ సినిమాకో, పెళ్లికో, హాస్పిటల్‌కో, ఇంకో పనిమీదో వెళ్లాలనుకుంటే మీరు రెడీ అయ్యే లోపు మీ ఇంటి దగ్గరకు ఆటోనో, క్యాబ్‌నో, ఎక్కువ సీటింగ్ గల పెద్ద వెహికిలో రావాలంటే Ola క్యాబ్ సర్వీస్ అద్భుతంగా ఉంటుంది.
సింపుల్ గా మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే ఓ చిన్న మొబైల్ అప్లికేషన్ ద్వారా ఎంత ఈజీగా మనకు దగ్గర్లో ఎన్ని వెహికిల్స్ ఉన్నాయో చూడడంతో పాటు ఎంతసేపట్లో మనం కోరుకున్న వెహికిల్ మన దగ్గరకు వస్తుందో ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు, వెంటనే బుక్ చేసుకోనూవచ్చు. రెడీ అయ్యే లోపల వెహికిల్ మీ గుమ్మం దగ్గర ఉంటుంది. ఈ మొబైల్ app వాడడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. అంతేకాదు ఈ అప్లికేషన్ ద్వారా చేసే మొదటి బుకింగ్‌కి APP200 అనే కోడ్ అప్లై చేస్తే మొదటి ప్రయాణం ఉచితంగా లభిస్తుంది కూడా!

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=74E3WsnqBc8

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

మీరు Voice Search ద్వారా గతంలో వెదికినవి మళ్లీ ఇలా వినొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yD3LiQ3Jo5E

సె‌ల్‌ఫోన్‌లో ఉండే Google Voice Search ద్వారా మీరు ఏం మాట్లాడినా, ఏమైనా వెదికినా వాటన్నింటినీ Google జాగ్రత్తగా భద్రపరుస్తుంటుంది. గతంలో మీరు మాట్లాడిన వాటిని తర్వాత ఎప్పుడైనా వినాలన్నా, వాటిలో అవసరం లేనివి డిలీట్ చెయ్యాలన్నా ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే సరిపోతుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=yD3LiQ3Jo5E

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

26, ఫిబ్రవరి 2015, గురువారం

"ఈనాడు" అఫీషియల్ అప్లికేషన్‌ రివ్యూ.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=78aTYLL1rj0

తెలుగు వారికి "ఈనాడు" పేపర్‌తో దశాబ్దాల నుండి అనుబంధం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుండే "ఈనాడు" తాజాగా పలు ఆప్షన్లతో కూడిన అధికారిక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ని విడుదల చేసింది. కొత్త వార్తలు చోటుచేసుకున్న వెంటనే మన మొబైల్ స్క్రీన్ మీద ఆటోమేటిక్‌గా చూపించే ఈ అప్లికేషన్‌లో దాగున్న పలు ఆప్షన్లు ఈ వీడియోలో చూడొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=78aTYLL1rj0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu