2, జనవరి 2008, బుధవారం

బరహతో వర్డ్ లో తెలుగు రావట్లేదా?

తెలుగుని టైప్ చేయడానికి మనం ఉపయోగించే బరహ సాఫ్ట్ వేర్ తో MS-Wordలో తెలుగు టైప్ చేస్తుంటే సమాచారం బాక్సులుగా వస్తోందని చాలామంది చెబుతుంటారు. ఈ సమస్యని పరిష్కరించడం ఎలాగో ఈ క్రింది ఆడియో వివరణతో కూడిన వీడియో ట్యుటోరియల్ లో వివరించడం జరిగింది. ఇక్కడ నేను వివరించిన పద్ధతి కన్నా మెరుగైన విధానం ఏదైనా ఉంటే తెలుపగలరు. అయితే ఈ పద్ధతి ద్వారా ప్రతీసారీ ఫాంట్ ని మార్చుకోవలసి ఉంటుంది. ఈ సమస్యపై వీవెన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత మరో పరిష్కారం లభించింది. Wordలోని Format మెనూలో Styles and Formatting అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే కుడిచేతి వైపు ప్రత్యక్షమయ్యే విభాగంలో New Style అనే బటన్ ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యక్షమయ్యే బాక్సులో Formatting అనే బాక్స్ వద్ద Gautami అనే ఫాంట్ ని సెట్ చేసుకోవాలి. చివరిగా ఆ New Style డైలాగ్ బాక్స్ లోనే Add to Template అనే ఆప్షన్ టిక్ చేసి పెడితే ఇకపై Styles మెనూలో Style1 పేరిట ఆ కొత్త స్టైల్ వస్తుంది. ఇక ఎప్పుడు తెలుగులో టైప్ చేయాలన్నా ఆ కొత్త స్టైల్ ని ఎంచుకుంటే సరిపోతుంది. తెలుగు నేరుగా వచ్చేస్తుంది. వీడియోలో చూపించిన ప్రకారం ప్రతీసారీ మార్చుకోనవసరం లేదు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బరహతో యం.యస్ వర్డ్ లో తెలుగు వ్రాయడం చూచాను. బహుశ ఆ సెట్టింగులు వర్డ్ ౨౦౦౩కో ౨౦౦౬కో సరిపోతాయి అనుకుంటాను. వర్డ్ ౨౦౦౭క కూడా సెట్టింగులు తెలిపితే నాలాంటి వానికి కూడా ఉపయోగంగా ఉంటుంది. వివరించమన శ్రీ‍ధర్‍గారిని కోరుతున్నాను.