7, జనవరి 2008, సోమవారం

స్పీడ్‌ని ప్రభావితం చేసే అంశాలు





సిడి డ్రైవ్ ఎంత వేగంగా డేటాని రీడ్ చెయ్యగలుగుతుందన్నది దాని రోటేషనల్ స్పీడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ రోటేషనల్ స్పీడ్ 48x, 52x వంటి ప్రమాణంలో వ్యవహరించబడుతుంది. పిసి పెర్‌ఫార్మెన్స్ స్లోగా ఉన్నా సిడి-డ్రైవ్ నుండి డేటాని యాక్సెస్ చెయ్యడం నెమ్మదిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ సిస్టమ్‌ని టాప్ కండీషన్‌లో ఉంచుకోవడం మంచిది. అలగే సిడి-డ్రైవ్ క్యాచే కూడా సిడి డ్రైవ్ పెర్‌ఫార్మెన్స్ ని ప్రభావితం చేస్తుంది. ControlPanel>System>Performance>CD-ROM అనే విభాగంలో Supplemental Cache Size అనే స్లైడర్ బార్‌ని Large దిశగా డ్రాగ్ చెయ్యడం ద్వారా సిడి డ్రైవ్ యొక్క క్యాచే గరిష్టంగా ఉండేటట్లు సెట్ చేసుకోవచ్చు. అలాగే System>Device Manager>CD-ROM అనే విభాగంలోకి వెళ్ళి Properties>Settings అనే పేజీలో DMA మోడ్‌ని ఎంచుకోవడం వల్ల సిడి-రాం డ్రైవ్ ప్రాసెసర్‌పై ఎక్కువ ఆధారపడకుండా నేరుగా మెమరీని వినియోగించుకునేటట్లు, తద్వారా పెర్‌ఫార్మెన్స్ పెరిగేటట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. సాధ్యమైననత వరకూ, సిడి-రామ్ డ్రైవ్‌ని ప్రత్యేకంగా ఒక IDE కేబుల్‌కి కనెక్ట్ చేస్త్తే డేటా ట్రాన్శ్ ఫర్ రేట్ మెరుగుపడుతుంది. అలగే మదర్ బోర్డ్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ డ్రైవర్లని అప్‌డేట్ చేసుకోవడం వల్ల సిడి-డ్రైవ్‌కి, పిసిలోని ఇతర హార్డ్ వేర్ కాంపొనెంట్లకు మధ్య బాండ్‌విడ్త్ మెరుగుపడుతుంది.

కామెంట్‌లు లేవు: