ఈ చిట్కా కేవలం అడ్వాన్స్డ్ యూజర్లకు మాత్రమే ఉద్దేశించినది. వాస్తవానికి ఇది ఇక్కడ రాయకూడదు, కానీ చాలామంది మా కంప్యూటర్ లో వేరే సాఫ్ట్ వేర్ పని లేకుండా మేమే స్వయంగా స్టార్ట్ బటన్ పేరు మార్చుకోవడం ఎలా అని అడుగుతున్నారు కాబట్టి రాయడం జరుగుతోంది. స్టార్ట్ బటన్ పేరు మార్చాలంటే explorer.exe ఫైల్ ని Hex Editor వంటి ప్రోగ్రామ్ తో ఎడిట్ చేయాలి. ఒకవేళ మీరు ఏమాత్రం తప్పు ఎడిట్ చేసినా అసలు విండోసే లోడ్ అవదు, దానికి బదులు WinBoost వంటి థర్డ్ పార్టీ ప్రోగ్రాముల సాయంతో స్టార్ట్ బటన్ పేరుని మార్చుకోండి. స్టెప్1: http://delphi.icm.edu.pl/ftp/tools/ResHack.zip సైట్ నుండి రిసోర్స్ హ్యాకర్ డౌన్ లోడ్ చేసుకోండి.. స్టెప్ 2: ఆ తర్వాత C:Windows అనే లొకేషన్ లో ఉండే explorer అనే ఫైల్ ని బ్యాకప్ తీసుకోండి. స్టెప్ 3: ఆ తర్వాత C:Windows లొకేషన్ లో ఉండే ఒరిజినల్ explorer ఫైల్ ని రిసోర్స్ హ్యాకర్ తో ఓపెన్ చేయండి. స్టెప్ 4: ఇప్పుడు స్ర్టింగ్ టేబుల్ లో 37 అనే విభాగంలో 1033 అనే ఎంట్రీ వద్దకు వెళ్లండి. ఇప్పుడు అక్కడ కుడిచేతి వైపు 578 అనే స్ర్టింగ్ గా Start అనే పేరు ఉంటుంది. ఆ స్ర్టింగ్ ని మీకు నచ్చిన విధంగా మార్చుకోండి. ఒకవేళ మీరు XPలో Classic Layoutలో ఉన్నట్లయితే స్ర్టింగ్ టేబుల్ లో 38 అనే విభాగంలోని 1033 అనే ఎంట్రీ వద్దకు వెళ్లి, కుడిచేతి వైపు కన్పించే 595 అనే విలువను మీకు నచ్చిన పేరుతో మార్చాలి. కేవలం "Start" అని కన్పించే పేరులో కొటేషన్ మార్కులను అలాగే ఉంచి మధ్యలోని Start అనే పేరుకి బదులుగా మీ పేరుని ఇవ్వాలి. ఇలా పేరుని మార్చిన తర్వాత Compile Script అనే బటన్ ని ప్రెస్ చేయండి. స్టెప్ 5:ఆ తర్వాత అలా మోడిఫై చేసుకున్న ఫైల్ ని C:Windows ఫోల్డర్ లోనే cera.exe పేరిట సేవ్ చేయండి. స్టెప్ 6:ఆ తర్వాత విండోస్ రిజిస్ర్టీలో HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Microsoft\ Windows NT\ CurrentVersion Winlogon అనే విభాగంలోకి వెళ్లి Shell అనే స్ర్టింగ్ వేల్యూని డబుల్ క్లిక్ చేసి.. దానికి cera.exe అనే పేరుని (మీరు ఏ పేరుతో సేవ్ చేసి ఉంటే ఆ పేరుని) ఇవ్వండి, ఇలా చేయడం వల్ల తర్వాత లాగిన్ అయ్యే సమయంలో ఆ కొత్త ఫైల్ ని రిజిస్ర్టీ గుర్తించే విధంగా ఏర్పాటు చేసినట్లు అవుతుంది. ఇక సిస్టమ్ ని రీస్టార్ట్ చేస్తే మీ పేరు వస్తుంది.. అయితే ఒక్క విషయం... మీరు ఏమాత్రం పొరబాటు చేసినా... మీ సిస్టమ్ ఖరాబు అయితే నాది ఎలాంటి బాధ్యత లేదని గ్రహించండి.. ఇలాంటి వాటికన్నా సులువైన మార్గాలు అనుసరించండి, రిస్క్ వద్దనుకుంటే!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి