Windows XP వినియోగదారులు Service Pack 3ని ఈ క్రింది లింకు నుండి డౌన్ లోడ్ చేసుకోండి. 336 MB పరిమాణం గల ఈ సర్వీస్ ప్యాక్ ని http://download.microsoft.com/download/a/e/4/ae43e777-d69b-4b96-b554-d1a2a0f40fac/windowsxp-kb936929-sp3-x86-enu.exe అనే సైట్ లింకు నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అనేక సెక్యూరిటీ లోపాలు ఈ సర్వీస్ ప్యాక్ ద్వారా పరిష్కరించబడ్డాయి. ఇంటర్నెట్లో ఇంతకాలం అనధికారిక SP3ల పేరిట చలామణి అయిన ప్రోగ్రాముల్లో అనేక ప్రమాదకరమైన స్క్రిప్ట్ లు పొందుపరచబడి ఉండి అనేక ఇబ్బందులకు కారణమవుతున్నాయి. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా నేరుగా మైక్రోసాఫ్ట్ సైట్ నుండి పై లింకు ద్వారా సర్వీస్ ప్యాక్ 3ని డౌన్ లోడ్ చేసుకోండి. అలాగే ఈ SP3కి సంబంధించిన అదనపు వివరాల కోసం PDF డాక్యుమెంటేషన్ (కొత్తగా ఇందులో ఏమేమి పొందుపరిచారు అన్న సమాచారం ఉన్నది) కోసం http://www.microsoft.com/downloads/details.aspx?FamilyID=68c48dad-bc34-40be-8d85-6bb4f56f5110&displaylang=en అనే సైట్ ని సందర్శించండి.
4 కామెంట్‌లు:
కృతజ్ఞతలు
Its only Pre release version.
అనానిమస్ గారు ధన్యవాదాలు. అది ఫైనల్ వెర్షన్ కాదేమో అన్న సందేహం నాకు చాలా ఉంది. అది RC (release candidate) మాత్రమేనా, లేక ఫైనల్ వెర్షనా అని తెలుసుకోవడానికి పోస్టు రాసిన తర్వాత ఓ నాలుగైదు గంటలు ప్రయత్నించాను. అదీగాక నా సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసిన తర్వాత System Propertiesలో RC or Prereleaseగా ఎలాంటి ప్రస్తావనా లేకపోయేసరికి కన్ ఫ్యూజన్ ఏర్పడింది. ఏదేమైనా మీ నుండి ఇలాంటి మంచి క్లారిఫికేషన్ లభించినందుకు ధన్యవాదాలు. పోస్టు చేసిన తర్వాత అలా డౌట్ వచ్చే పోస్ట్ హెడ్డింగ్ ని, లోపల మేటర్ ని మార్చడం కూడా జరిగింది. మరోసారి ధన్యవాదాలు.
- నల్లమోతు శ్రీధర్
శ్రీధర్ గారు:
అనానిమస్సు చెప్పింది కరెక్టు అనుకుంట. ఇది ఇంకా రిలీజు చెయ్యబడలేదు.
కొన్ని సిస్టంలలో ఫెయిలవుతుంది కూడా ఈ అప్డేటు. ఇప్పటికి అప్డేటు చెయ్యకపోవడమే మంచిది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి