6, జనవరి 2008, ఆదివారం
హార్డ్ డిస్క్ స్పేస్ ఎంతో కీలకమైనది….
హార్డ్ డిస్క్ ఎంత వేగంగా పనిచేస్తే కంప్యూటర్ పెర్‍ఫార్మెన్స్ అంత మెరుగ్గా ఉంటుంది. హార్డ్ డిస్క్ స్పీడ్ పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది హార్డ్ డిస్క్ లోఉండే Platters యొక్క రోటేషనల్ స్పీడ్. ఈ వేగం ఎంత ఎక్కువగా ఉంటే హార్డ్ డిస్క్ నుండి సమాచారం అంత స్పీడుగా రీడ్/రైట్ చెయ్యబడుతుంది. నిముషానికి 7,200చుట్లు (దీన్నే rpm గా చెబుతుంటారు.) తిరిగే హర్డ్ డిస్క్ మెరుగైన పెర్‍ఫార్మెన్స్ అందిస్తుంది. అలాగే హర్డ్ డిస్క్ పనితీరుపై Seek Time కూడా విశేష ప్రభావం చూపిస్తుంది. మనం ఒక ఫైల్ ఏ లొకేషన్‍లో ఉందో వెదకడానికి పట్టే సమయాన్ని SeekTime అంటారు. అదే విధంగా హర్డ్ డిస్క్ లోని ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి సమాచారం తరలించబడడానికి పట్టే సమయం లేదా డిస్క్ నుండి ఫ్లాపీ, సిడి, జిప్ డ్రైవ్‍ల వంటి రిమూవబుల్ మీడియాలకు సమాచారాన్ని ట్రాన్స్ ఫర్ చెయ్యడానికి పట్టే సమయం Disk Transfer Rateగా వ్యవహరించబడుతుంది. ఈ ట్రాన్స్ ఫర్ రేట్ కూడా హర్డ్ డ్జిస్క్ పెర్‍ఫార్మెన్స్ పైనా, అదే సమయంలో పిసి పనితీరుపైనా విశేషమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న అంశాలన్ని గరిష్ట స్థాయిలో ఉంటేనే సిస్టమ్ వేగంగా పనిచేస్తుంది. లేదంటే p4 సిస్టమ్ అయినా ఆశించినంత వేగంగా ఉండదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి