మీ ఆఫీసులో ఒకే ఎక్సెల్ వర్క్ షీట్ ని వేర్వేరు విభాగాల్లోని వేర్వేరు ఉద్యోగులు ఎడిట్ చేయగలిగేలా అవకాశం కల్పించాలనుకోండి. Excelలోని Tools మెనూలో ఉండే Share Workbook అనే ఆప్షన్ ని ఎంచుకోండి. వెంటనే స్ర్కీన్ పై ప్రత్యక్షమయ్యే డైలాగ్ బాక్స్ లో Editing టాబ్ ని క్లిక్ చేసి "Allow changes by more than one user at the same time" అనే ఆప్షన్ ని టిక్ చేసి OK బటన్ ని క్లిక్ చేయండి. వెంటనే ఆ ఫైల్ ని ఎక్కడ సేవ్ చేయమంటారు అని అడుగుతుంది. పాత్ ని పేర్కొనండి. సేవ్ చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. మీరు ఏయే యూజర్లకైతే ఆ వర్క్ బుక్ ని షేర్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్లకి అందుబాటులో ఉండే నెట్ వర్క్ లొకేషన్లలో మాత్రమే వర్క్ బుక్ ని సేవ్ చేయాలి. Shared Network ఫోల్డర్ ని ఉపయోగించుకోండి. అలాగే Excel ఫైళ్లకు కూడా Comments జత చేసుకోవచ్చు. ఒక Cellలో కామెంట్ జతచేయదలుచుకుంటే ఆ సెల్ పై రైట్ క్లిక్ చేసి Insert Comment అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
1 కామెంట్:
బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటి అవసరం వచ్చి జుట్టు పీక్కోవాల్సి వచ్చేది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి