My Computerలో ఏదైనా డ్రైవ్ పై మౌస్ తో డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆ డ్రైవ్ లోపల ఫోల్డర్లు, ఫైళ్లు చూపించబడడానికి బదులు Search ఆప్షన్ వస్తోందా? అయితే క్రింది వీడియోలో ఈ సమస్యని పరిష్కరించడం ఎలాగో చిన్న టెక్నిక్ ని ఆడియోతో సహా తెలుగులో వివరించడం జరిగింది. మీరే చూడండి:
31, డిసెంబర్ 2007, సోమవారం
XP ఇన్ స్టలేషన్ సమయంలో మనం లేకుండానే?
Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ ని కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసే సమయంలో రీజినల్ సెట్టింగ్స్, టైమ్ జోన్, అడ్మినిస్ర్టేటర్ పాస్ వర్డ్ వంటి కొన్ని ఆప్షన్లని ఎంచుకోవడానికి మనం కంప్యూటర్ దగ్గరే ఉండవలసి వస్తుంది. అలా కాకుండా Setup ప్రారంభమైనది మొదలుకుని పూర్తయ్యేటంత వరకూ XP తనంతట తాను కొనసాగేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి గాను XP సెటప్ సిడిలో \Support\Tools\Deploy.cab ఫైల్ లో ఉండే Setup Managerని రన్ చేయండి. ఇది Setupmgr.exe పేరుతో ఉంటుంది. దీన్ని రన్ చేయండి. ఇప్పుడు XP Setup సమయంలో వేర్వేరు దశల్లో మనం ఇవ్వాల్సిన సమాచారాన్ని సేకరించడానికి ప్రశ్నలు అడగబడతాయి. వాటికి మనం ఇచ్చే సమాధానాలు ఫైళ్లుగా సేవ్ అవుతాయి. ఇప్పుడు NEWXP పేరిట డెస్క్ టాప్ పై గానీ, వేరే ఎక్కడైనా ఓ ఫోల్డర్ ని క్రియేట్ చేసి ఒరిజినల్ XP సిడిలో ఉన్న ఫైళ్లు, ఫోల్డర్లని యధాతధంగా ఆ ఫోల్డర్ లోకి కాపీ చేయండి. అదే విధంగా ఇంతకుముందు మనం ఇచ్చిన సమాధానాల ఆధారంగా Setup Manager క్రియేట్ చేసిన ఆన్సర్ ఫైళ్లని కూడా అదే ఫోల్డర్ లోకి కాపీ చేయండి. ఇప్పుడు ఆ కొత్త ఫోల్డర్ లోని Setup ప్రోగ్రామ్ రన్ చేయబడేలా autorun.inf ఫైల్ ని మోడిఫై చేసి సిడిని Nero వంటి సిడి రికార్డింగ్ సాఫ్ట్ వేర్ తో రైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపై ఆ కొత్త సిడితో Windows XP సెటప్ చేస్తుంటే ఎలాంటి మనం ప్రత్యేకంగా ఆప్షన్లు ఎంచుకోవలసిన పనిలేకుండానే దానికదే ఆప్షన్లు ఎంచుకోబడతాయి, సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది... చివరకు Windows XP సెటప్ పూర్తవుతుంది.
ఫొటోషాప్ క్రాష్ అవుతోందా?
Adobe Photoshop 7, CS2 వంటి వెర్షన్లని ఉపయోగిస్తున్నప్పుడు ఒక్కోసారి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి. ముఖ్యంగా ఫైల్ ని సేవ్ చేసేటప్పుడు ఒక్కసారిగా స్ర్కీన్ పై Kernel32 ఎర్రర్ మెసేజ్ చూపించబడి సిస్టమ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నట్లయితే సాధ్యమైనంత వరకూ తక్కువ అప్లికేషన్లు రన్ అవుతుండగా మాత్రమే ఫొటోషాప్ ని ఉపయోగించండి. RAM తక్కువగా ఉండి ఫొటోషాప్ తో పాటు PageMaker, InDesign, Acrobat వంటి ఇతర అడోబ్ ప్రోడక్టులు, MS-Office సాఫ్ట్ వేర్లు సైతం ఓపెన్ చేయబడి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ముఖ్యమైన అప్లికేషన్ ప్రోగ్రాములను మాత్రమే ఉంచుకుని మిగిలిన వాటిని క్లోజ్ చేసి ఫొటోషాప్ పై పనిచేయండి. అలాగే వేర్వేరు వెర్షన్ల ఫొటోషాప్ లను ఒకే సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసి వాడడం (ఉదా.కు.. ఓ వైపు ఫొటోషాప్ 7 ఉండగా, ఫొటోషాప్ CS2 వంటివి వాడడం), మీరు ఇన్ స్టాల్ చేసుకున్న ఫొటోషాప్ సాఫ్ట్ వేర్ లో ముఖ్యమైన ఫైళ్లు కరప్ట్ అవడం వల్ల, అడోబ్ షేర్డ్ ఫైళ్లు కరప్ట్ అవడం వల్ల, వేర్వేరు అడోబ్ ఉత్పత్తులు కామన్ ఫైళ్లని ఉపయోగించుకోవడంలో ఇబ్బందుల వల్ల కూడా ఇలా ఫొటోషాప్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. కారణం విశ్లేషించి తెలుసుకుని తగిన చర్యలు తీసుకోండి.
29, డిసెంబర్ 2007, శనివారం
మీటింగ్ విశేషాలు, చిన్న వీడియో
కంప్యూటర్ ఎరా పాఠకుల సమావేశం
డిసెంబర్ 24, మధ్యాహ్నం 3 గంటలు
హాజరైన పాఠకులు
1. సలీం భాషా
2. జి. చైతన్య
3. సి.హెచ్. సత్యనారాయణ
4. జి. శ్రీనివాస్
5. టి. నవీన్ రెడ్డి
6. ఎ. అభిరామ్
7. ఎం. మురళీధర్
8. పి. మౌర్య
9. ఎ. ఉమాశంకర్
10. జి.పి. జాకబ్
11. ఎం. నరేందర్ కుమార్
12. నల్లమోతు శ్రీధర్
13. మురళీధర్ గారి మిత్రులు పనిమీద ముందే వెళ్లిపోయారు, ఆయన పేరు జీవన్.
మొట్టమొదటిదే అయినా ఈ మీటింగ్ ఎంతో బాగా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు అందరం కృష్ణకాంత్ పార్క్ టికెట్ గేట్ వద్ద జమకూడి లోపలికి ప్రవేశించాం. లోపలికి వెళ్లి కూర్చున్నాక మీటింగ్ యొక్క అజెండా జిరాక్స్ కాపీలను అందరికీ పంచడం జరిగింది. ఈ అజెండాలో చర్చించిన కొన్ని అంశాలు....
ఫోరమ్ కార్యకలాపాల విషయమై:జనవరి 2, 2008 నాటికి మన ఫోరంని ప్రారంభించి ఏడాది పూర్తవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫోరం ని మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశమై శ్రీనివాస్, మౌర్య, మురళీధర్, జాకబ్ గార్లు మంచి సలహాలు అందించారు. ఈ సందర్భంగానే కేవలం Thanks వంటి పోస్టుల సంఖ్యతో పోలిస్తే నిజంగా కంటెంట్ ఉన్న పోస్టుల సంఖ్య పెరగాలని దానిపై సభ్యుల సూచనలు కోరడం జరిగింది. సీరియస్ గా ఫోరంలో రోజుకు ఒకటి రెండు పోస్టులైనా కంటెంట్ తో కూడినవి చేస్తే ఫోరం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీటింగ్ కి హాజరు అవని సభ్యులు కూడా దయచేసి.. కనీసం రోజుకి ఒక్క పావుగంట, అరగంటపాటైనా వెచ్చించి మన ఫోరంలో మరిన్ని మంచి పోస్టులు ప్రచురించడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.
ఇకపోతే ఫోరంలో కొత్త సభ్యులు తెలియక రాంగ్ సెక్షన్లలో చేసే పోస్టులను ఎలా మోడరేట్ చేయాలి, కొత్త సభ్యులకు ఫోరంలో ఫలానా విధంగానే పోస్ట్ చేయాలని గైడ్ లైన్స్ ఎలా ఇవ్వాలి అన్న చర్చ జరిగింది. అందరికీ కన్పించే చోట రూల్స్ వంటివి పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాం. కానీ మనది ఉచిత ఫోరం అవడం వల్ల అన్ని పేజీల్లో కన్పించేలా వాటిని అమర్చడం వీలుపడదు. అందుకే ఇలాంటి గైడ్ లైన్స్ ని Sticky పోస్టులుగా ప్రచురిస్తున్నాం అని నేను వివరించడం జరిగింది. ఇకపోతే రాంగ్ సెక్షన్లలో చేసే పోస్టులను (ఉదా.కు.. సందేహాలను పాఠకుల సహకారం విభాగంలో పోస్ట్ చేయవలసింది పోయి పిసి టిప్స్ అనే విభాగంలో కొందరు పోస్ట్ చేస్తుంటారు) తిరిగి సరైన విభాగాల్లో మూవ్ చేయడానికి ఎవరో ఒక మోడరేటర్ పూర్తి బాధ్యతని తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడడం జరిగింది. దయచేసి ప్రస్తుతం మోడరేటర్ హోదా కలిగిన వ్యక్తులలో ఈ బాధ్యతని (రాంగ్ పోస్టులను మూవ్ చేయడం, కొత్త సభ్యులను సరైన మార్గంలో నడిపించడం) ఎవరో ఒకరు స్వీకరిస్తే బాగుంటుంది. ఈ బాధ్యతని చేపట్టగల మోడరేటర్ ఈ పోస్ట్ క్రిందనే రిప్లై ఇవ్వగలరు.
అలాగే మనం ఇంత కష్టపడి ఓ టీమ్ స్పిరిట్ తో నడిపిస్తున్న ఫోరంని మరింత మంది దృష్టికి తీసుకువెళ్లే మార్గమేదైనా ఉందా అన్న చర్చ జరిగింది. ఫోరం ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్లని కేవలం పోస్టులను చదివి వెళ్లే ఫాలోయర్స్ గా కాకుండా తమకు తెలిసిన నాలెడ్జ్ ని సైతం పోస్ట్ చేసే లీడర్స్ గా వీలైనంత ఎక్కువమందిని మోటివేట్ చేయడం ఎలాగన్నది కొద్దిగా చర్చించాం. మీ సూచనలు కూడా ఇక్కడ తెలియజేయగలరు. ఇకపోతే ఫోరం లో మనం పోస్ట్ చేసే కంటెంట్ మరింత ఆకర్షణీయంగా కన్పించేలా స్ర్కీన్ షాట్లు, బోల్డ్, ఇటాలిక్ వంటి ఫాంట్ స్లైళ్లు, వివిధ కలర్స్ ని ఉపయోగించి రూపొందిస్తే బాగుంటుందని అనుకున్నాం. కొద్దిగా ఓపిక చేసుకుని మనం పోస్టులను ఇలా పబ్లిష్ చేస్తే ఫోరం అందరినీ ఆకట్టుకుంటుంది.
సాంకేతిక సహాయం కి సంబంధించి:
Team Viewer ద్వారా మనం ఇతరులకు అందించదలుకున్న టెక్నికల్ సపోర్ట్ విషయమై కొన్ని అంశాలు చర్చించడం జరిగింది. ఎవరు ఎప్పుడు ఆన్ లైన్ లో ఉంటున్నారు, ఎవరికి సహాయం అవసరం అవుతుంది అన్న కమ్యూనికేషన్ పెద్ద ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను. ఇదే విషయమై ఓ లేఖిని, కూడలి సృష్టికర్త వీవెన్ ప్రత్యేకమైన ఛాట్ రూమ్ ని మన కోసం తయారు చేయడానికి మన మీటింగ్ ముందు రోజే సుముఖత వ్యక్తపరిచారు. అదే విషయం నేను ప్రస్తావించాను. వీవెన్ చెప్పిన ప్రకారమే.. సరిగ్గా మీటింగ్ జరిగిన మరుసటి ఉదయమే... కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం పేరిట http://computerera.koodali.org/ అనే అడ్రస్ లో ఛాట్ రూం ప్రారంభమైంది. ఇందులో ఇప్పుడు చాలామంది ఇతరులకు సాయపడుతున్నారు, తమ నాలెడ్జ్ ని అప్ డేట్ చేసుకుంటున్నారు, అవసరమైతే టీమ్ వ్యూయర్ ద్వారా అవతలి వారి కంప్యూటర్లోకి ప్రవేశించి మరీ సమస్యని పరిష్కరించడం జరుగుతోంది. అలాగే టీమ్ వ్యూయర్ ద్వారా ఫలానా టైమ్ లో మేము సేవ చేయగలం అని మాట ఇచ్చిన వారు సాధ్యమైనంత వరకూ ఆయా సమయాల్లో (ఎప్పుడైనా కుదరకపోతే ఫర్వాలేదనుకోండి) ఎవరున్నా లేకపోయినా ఛాట్ రూంలో గడిపితే బాగుంటుంది.
మేగజైన్ కి సంబంధించి:మన అన్ని పనులకూ పునాది లాంటి కంప్యూటర్ ఎరా మేగజైన్ రీడబులిటీని మరింత పెంచడం ఎలా అన్నది చర్చించాం. మౌత్ పబ్లిసిటీ ఒక్కటే మార్గమని నిర్ణయానికి వచ్చాం. ఇంకేమైనా సూచనలు ఉంటే తెలుపగలరు. అలాగే అందరికీ ఉపయోగపడుతుంది అనుకున్న కొత్త విషయాలు ఏమైనా (గతంలో ప్రచురించబడకపోతే) మేగజైన్ లో రాయడానికి ఎవరికైనా అవకాశం ఇస్తానని ప్రకటించాను. మీరైనా మంచి కంటెంట్ ఉంటే ప్రతీ పిసి యూజర్ కి ఉపయోగపడుతుందనుకుంటే ఒక్కసారి 9848227008 నెంబర్ లో ఉదయం 10 గం. నుండి సాయంత్రం 4 గం. లోపు నాకు కాల్ చేసి మాట్లాడగలరు.
ఇతరత్రా అంశాలు:
అన్ని ఊళ్లలోనూ అనేకమంది కంప్యూటర్ ఎరా పాఠకులు ఉన్నారు. వారందరూ ప్రతీ మీటింగ్ కి హైదరాబాద్ రావాలన్నా రాలేరు. అదే ఏ ఊళ్లో ఉన్న రీడర్స్ ఆ ఊళ్లో నెలకో, రెండు నెలలకోసారి చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా అన్న అంశం చర్చించాం. అలాగే మనం చేస్తున్న ఇలాంటి ప్రొడక్టివ్ కార్యకలాపాల గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మెయిన్ స్ర్టీమ్ మీడియా కవర్ చేసేలా తద్వారా పదిమందికీ నాలెడ్జ్ ని పంచాలన్న మన ఉద్యమం మరింత బలోపేతం అయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదీ చర్చించడం జరిగింది.
అప్పటికే చీకటి పడడం, ఊళ్లకు వెళ్లవలసిన సభ్యులు ఉండడం కారణంగా అజెండాలో మరికొన్ని అంశాలు ఉన్నప్పటికీ సమావేశాన్ని ముగించాం.
ఈ మీటింగ్ కి విశేషత ఏమంటే.. అభిరామ్ అనే సభ్యుడు గుంటూరు నుండి ప్రత్యేకంగా ఆరోజు ఉదయం బయల్దేరి సరిగ్గా మీటింగ్ టైమ్ కి వచ్చి, మీటింగ్ అయిపోయిన వెంటనే అసలు రిఫ్రెష్ అవడానికి సమయం లేకపోయినా వెంటనే తిరుగు ప్రయాణం అవడం చాలా బాధ అనిపించింది. ఇంత కమిట్ మెంట్ ఉన్నవారం అందరం ఒకచోట కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు కదా! అలాగే మనందరికీ చిరపరిచితుడైన మౌర్య ప్రత్యేకంగా నెల్లూరు నుండి బస్ లో సీటు దొరకకపోయినా అలాగే రాత్రంతా ఇబ్బందిపడుతూ హాజరవడం! మీటింగ్ అయిపోయిన వెంటనే అదే రాత్రి తిరిగి ప్రయాణమవడం అతని చిత్తశుద్ధికి నిదర్శనం. నరేందర్ ఓ రెండు రోజులు ముందే సూర్యాపేట నుండి వచ్చి మీటింగ్ ముందురోజు వ్యక్తిగతంగా నన్ను కలిసి మీటింగ్ కి హాజరయ్యారు. సత్యనారాయణ గారు, మురళీధర్ గారు ఆఫీసుకు సెలవు పెట్టి మరీ మీటింగ్ కి వచ్చారు. సలీంభాషా, జీవన్, చైతన్య, జాకబ్, ఉమాశంకర్, శ్రీనివాస్, నవీన్ రెడ్డి తదితరులు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఈ మీటింగ్ ని వీలైనంత బాగా కవర్ చేద్దామని ఫొటోలు, ఆడియో రికార్డ్ చేశాం. ఆడియో ఫైల్ కరప్ట్ అవడం వల్ల 132MB నుండి కంప్రెస్ అవక నాలుగైదు రోజులు విసిగించింది. అభిరామ్ గారు ఇలాగైతే లాభం లేదని పనిగట్టుకుని మరీ దాన్ని ఫ్లాష్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేసే పనిలో ఉన్నారు. అది రెడీ అయ్యాక ఇక్కడే లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఫొటోలు మెమరీ కార్డ్ కరప్ట్ అవడం వల్ల ఒక్క ఫొటో కూడా పొందలేకపోయాం. ఇక మిగిలిన ఏకైక చిన్న సెల్ ఫోన్ వీడియో క్లిప్ ని ఆల్రెడీ పోస్ట్ చేశాం, మీరూ చూసే ఉంటారు. చాలా ఆనందంగా, స్నేహితులం కలిసినట్లు జరిగిన ఈ మీటింగ్ చాలా మోటివేషన్ ని కలిగించింది.
తదుపరి మీటింగులు:
1. జనవరి 27 ఆదివారం సాయంత్రం 3 గంటలకు, కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్
2. ఫిబ్రవరి 24, ఆదివారం సాయంత్రం 3 గంటలకు (అదే ప్రదేశం వద్ద)
ఏ కారణం చేతైనా మొదటి మీటింగ్ కి హాజరు అవలేకపోయిన వారు వాటికైనా వీలుచేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ మీటింగ్ ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు..!
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
- కంప్యూటర్ ఎరా
డిసెంబర్ 24, మధ్యాహ్నం 3 గంటలు
హాజరైన పాఠకులు
1. సలీం భాషా
2. జి. చైతన్య
3. సి.హెచ్. సత్యనారాయణ
4. జి. శ్రీనివాస్
5. టి. నవీన్ రెడ్డి
6. ఎ. అభిరామ్
7. ఎం. మురళీధర్
8. పి. మౌర్య
9. ఎ. ఉమాశంకర్
10. జి.పి. జాకబ్
11. ఎం. నరేందర్ కుమార్
12. నల్లమోతు శ్రీధర్
13. మురళీధర్ గారి మిత్రులు పనిమీద ముందే వెళ్లిపోయారు, ఆయన పేరు జీవన్.
మొట్టమొదటిదే అయినా ఈ మీటింగ్ ఎంతో బాగా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు అందరం కృష్ణకాంత్ పార్క్ టికెట్ గేట్ వద్ద జమకూడి లోపలికి ప్రవేశించాం. లోపలికి వెళ్లి కూర్చున్నాక మీటింగ్ యొక్క అజెండా జిరాక్స్ కాపీలను అందరికీ పంచడం జరిగింది. ఈ అజెండాలో చర్చించిన కొన్ని అంశాలు....
ఫోరమ్ కార్యకలాపాల విషయమై:జనవరి 2, 2008 నాటికి మన ఫోరంని ప్రారంభించి ఏడాది పూర్తవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫోరం ని మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశమై శ్రీనివాస్, మౌర్య, మురళీధర్, జాకబ్ గార్లు మంచి సలహాలు అందించారు. ఈ సందర్భంగానే కేవలం Thanks వంటి పోస్టుల సంఖ్యతో పోలిస్తే నిజంగా కంటెంట్ ఉన్న పోస్టుల సంఖ్య పెరగాలని దానిపై సభ్యుల సూచనలు కోరడం జరిగింది. సీరియస్ గా ఫోరంలో రోజుకు ఒకటి రెండు పోస్టులైనా కంటెంట్ తో కూడినవి చేస్తే ఫోరం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీటింగ్ కి హాజరు అవని సభ్యులు కూడా దయచేసి.. కనీసం రోజుకి ఒక్క పావుగంట, అరగంటపాటైనా వెచ్చించి మన ఫోరంలో మరిన్ని మంచి పోస్టులు ప్రచురించడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.
ఇకపోతే ఫోరంలో కొత్త సభ్యులు తెలియక రాంగ్ సెక్షన్లలో చేసే పోస్టులను ఎలా మోడరేట్ చేయాలి, కొత్త సభ్యులకు ఫోరంలో ఫలానా విధంగానే పోస్ట్ చేయాలని గైడ్ లైన్స్ ఎలా ఇవ్వాలి అన్న చర్చ జరిగింది. అందరికీ కన్పించే చోట రూల్స్ వంటివి పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాం. కానీ మనది ఉచిత ఫోరం అవడం వల్ల అన్ని పేజీల్లో కన్పించేలా వాటిని అమర్చడం వీలుపడదు. అందుకే ఇలాంటి గైడ్ లైన్స్ ని Sticky పోస్టులుగా ప్రచురిస్తున్నాం అని నేను వివరించడం జరిగింది. ఇకపోతే రాంగ్ సెక్షన్లలో చేసే పోస్టులను (ఉదా.కు.. సందేహాలను పాఠకుల సహకారం విభాగంలో పోస్ట్ చేయవలసింది పోయి పిసి టిప్స్ అనే విభాగంలో కొందరు పోస్ట్ చేస్తుంటారు) తిరిగి సరైన విభాగాల్లో మూవ్ చేయడానికి ఎవరో ఒక మోడరేటర్ పూర్తి బాధ్యతని తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడడం జరిగింది. దయచేసి ప్రస్తుతం మోడరేటర్ హోదా కలిగిన వ్యక్తులలో ఈ బాధ్యతని (రాంగ్ పోస్టులను మూవ్ చేయడం, కొత్త సభ్యులను సరైన మార్గంలో నడిపించడం) ఎవరో ఒకరు స్వీకరిస్తే బాగుంటుంది. ఈ బాధ్యతని చేపట్టగల మోడరేటర్ ఈ పోస్ట్ క్రిందనే రిప్లై ఇవ్వగలరు.
అలాగే మనం ఇంత కష్టపడి ఓ టీమ్ స్పిరిట్ తో నడిపిస్తున్న ఫోరంని మరింత మంది దృష్టికి తీసుకువెళ్లే మార్గమేదైనా ఉందా అన్న చర్చ జరిగింది. ఫోరం ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్లని కేవలం పోస్టులను చదివి వెళ్లే ఫాలోయర్స్ గా కాకుండా తమకు తెలిసిన నాలెడ్జ్ ని సైతం పోస్ట్ చేసే లీడర్స్ గా వీలైనంత ఎక్కువమందిని మోటివేట్ చేయడం ఎలాగన్నది కొద్దిగా చర్చించాం. మీ సూచనలు కూడా ఇక్కడ తెలియజేయగలరు. ఇకపోతే ఫోరం లో మనం పోస్ట్ చేసే కంటెంట్ మరింత ఆకర్షణీయంగా కన్పించేలా స్ర్కీన్ షాట్లు, బోల్డ్, ఇటాలిక్ వంటి ఫాంట్ స్లైళ్లు, వివిధ కలర్స్ ని ఉపయోగించి రూపొందిస్తే బాగుంటుందని అనుకున్నాం. కొద్దిగా ఓపిక చేసుకుని మనం పోస్టులను ఇలా పబ్లిష్ చేస్తే ఫోరం అందరినీ ఆకట్టుకుంటుంది.
సాంకేతిక సహాయం కి సంబంధించి:
Team Viewer ద్వారా మనం ఇతరులకు అందించదలుకున్న టెక్నికల్ సపోర్ట్ విషయమై కొన్ని అంశాలు చర్చించడం జరిగింది. ఎవరు ఎప్పుడు ఆన్ లైన్ లో ఉంటున్నారు, ఎవరికి సహాయం అవసరం అవుతుంది అన్న కమ్యూనికేషన్ పెద్ద ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను. ఇదే విషయమై ఓ లేఖిని, కూడలి సృష్టికర్త వీవెన్ ప్రత్యేకమైన ఛాట్ రూమ్ ని మన కోసం తయారు చేయడానికి మన మీటింగ్ ముందు రోజే సుముఖత వ్యక్తపరిచారు. అదే విషయం నేను ప్రస్తావించాను. వీవెన్ చెప్పిన ప్రకారమే.. సరిగ్గా మీటింగ్ జరిగిన మరుసటి ఉదయమే... కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం పేరిట http://computerera.koodali.org/ అనే అడ్రస్ లో ఛాట్ రూం ప్రారంభమైంది. ఇందులో ఇప్పుడు చాలామంది ఇతరులకు సాయపడుతున్నారు, తమ నాలెడ్జ్ ని అప్ డేట్ చేసుకుంటున్నారు, అవసరమైతే టీమ్ వ్యూయర్ ద్వారా అవతలి వారి కంప్యూటర్లోకి ప్రవేశించి మరీ సమస్యని పరిష్కరించడం జరుగుతోంది. అలాగే టీమ్ వ్యూయర్ ద్వారా ఫలానా టైమ్ లో మేము సేవ చేయగలం అని మాట ఇచ్చిన వారు సాధ్యమైనంత వరకూ ఆయా సమయాల్లో (ఎప్పుడైనా కుదరకపోతే ఫర్వాలేదనుకోండి) ఎవరున్నా లేకపోయినా ఛాట్ రూంలో గడిపితే బాగుంటుంది.
మేగజైన్ కి సంబంధించి:మన అన్ని పనులకూ పునాది లాంటి కంప్యూటర్ ఎరా మేగజైన్ రీడబులిటీని మరింత పెంచడం ఎలా అన్నది చర్చించాం. మౌత్ పబ్లిసిటీ ఒక్కటే మార్గమని నిర్ణయానికి వచ్చాం. ఇంకేమైనా సూచనలు ఉంటే తెలుపగలరు. అలాగే అందరికీ ఉపయోగపడుతుంది అనుకున్న కొత్త విషయాలు ఏమైనా (గతంలో ప్రచురించబడకపోతే) మేగజైన్ లో రాయడానికి ఎవరికైనా అవకాశం ఇస్తానని ప్రకటించాను. మీరైనా మంచి కంటెంట్ ఉంటే ప్రతీ పిసి యూజర్ కి ఉపయోగపడుతుందనుకుంటే ఒక్కసారి 9848227008 నెంబర్ లో ఉదయం 10 గం. నుండి సాయంత్రం 4 గం. లోపు నాకు కాల్ చేసి మాట్లాడగలరు.
ఇతరత్రా అంశాలు:
అన్ని ఊళ్లలోనూ అనేకమంది కంప్యూటర్ ఎరా పాఠకులు ఉన్నారు. వారందరూ ప్రతీ మీటింగ్ కి హైదరాబాద్ రావాలన్నా రాలేరు. అదే ఏ ఊళ్లో ఉన్న రీడర్స్ ఆ ఊళ్లో నెలకో, రెండు నెలలకోసారి చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా అన్న అంశం చర్చించాం. అలాగే మనం చేస్తున్న ఇలాంటి ప్రొడక్టివ్ కార్యకలాపాల గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మెయిన్ స్ర్టీమ్ మీడియా కవర్ చేసేలా తద్వారా పదిమందికీ నాలెడ్జ్ ని పంచాలన్న మన ఉద్యమం మరింత బలోపేతం అయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదీ చర్చించడం జరిగింది.
అప్పటికే చీకటి పడడం, ఊళ్లకు వెళ్లవలసిన సభ్యులు ఉండడం కారణంగా అజెండాలో మరికొన్ని అంశాలు ఉన్నప్పటికీ సమావేశాన్ని ముగించాం.
ఈ మీటింగ్ కి విశేషత ఏమంటే.. అభిరామ్ అనే సభ్యుడు గుంటూరు నుండి ప్రత్యేకంగా ఆరోజు ఉదయం బయల్దేరి సరిగ్గా మీటింగ్ టైమ్ కి వచ్చి, మీటింగ్ అయిపోయిన వెంటనే అసలు రిఫ్రెష్ అవడానికి సమయం లేకపోయినా వెంటనే తిరుగు ప్రయాణం అవడం చాలా బాధ అనిపించింది. ఇంత కమిట్ మెంట్ ఉన్నవారం అందరం ఒకచోట కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు కదా! అలాగే మనందరికీ చిరపరిచితుడైన మౌర్య ప్రత్యేకంగా నెల్లూరు నుండి బస్ లో సీటు దొరకకపోయినా అలాగే రాత్రంతా ఇబ్బందిపడుతూ హాజరవడం! మీటింగ్ అయిపోయిన వెంటనే అదే రాత్రి తిరిగి ప్రయాణమవడం అతని చిత్తశుద్ధికి నిదర్శనం. నరేందర్ ఓ రెండు రోజులు ముందే సూర్యాపేట నుండి వచ్చి మీటింగ్ ముందురోజు వ్యక్తిగతంగా నన్ను కలిసి మీటింగ్ కి హాజరయ్యారు. సత్యనారాయణ గారు, మురళీధర్ గారు ఆఫీసుకు సెలవు పెట్టి మరీ మీటింగ్ కి వచ్చారు. సలీంభాషా, జీవన్, చైతన్య, జాకబ్, ఉమాశంకర్, శ్రీనివాస్, నవీన్ రెడ్డి తదితరులు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఈ మీటింగ్ ని వీలైనంత బాగా కవర్ చేద్దామని ఫొటోలు, ఆడియో రికార్డ్ చేశాం. ఆడియో ఫైల్ కరప్ట్ అవడం వల్ల 132MB నుండి కంప్రెస్ అవక నాలుగైదు రోజులు విసిగించింది. అభిరామ్ గారు ఇలాగైతే లాభం లేదని పనిగట్టుకుని మరీ దాన్ని ఫ్లాష్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేసే పనిలో ఉన్నారు. అది రెడీ అయ్యాక ఇక్కడే లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఫొటోలు మెమరీ కార్డ్ కరప్ట్ అవడం వల్ల ఒక్క ఫొటో కూడా పొందలేకపోయాం. ఇక మిగిలిన ఏకైక చిన్న సెల్ ఫోన్ వీడియో క్లిప్ ని ఆల్రెడీ పోస్ట్ చేశాం, మీరూ చూసే ఉంటారు. చాలా ఆనందంగా, స్నేహితులం కలిసినట్లు జరిగిన ఈ మీటింగ్ చాలా మోటివేషన్ ని కలిగించింది.
తదుపరి మీటింగులు:
1. జనవరి 27 ఆదివారం సాయంత్రం 3 గంటలకు, కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్
2. ఫిబ్రవరి 24, ఆదివారం సాయంత్రం 3 గంటలకు (అదే ప్రదేశం వద్ద)
ఏ కారణం చేతైనా మొదటి మీటింగ్ కి హాజరు అవలేకపోయిన వారు వాటికైనా వీలుచేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ మీటింగ్ ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు..!
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
- కంప్యూటర్ ఎరా
28, డిసెంబర్ 2007, శుక్రవారం
ఆడియో క్యాసెట్లలోని పాటలు ఆడియోసిడిగా...
మీవద్ద ఆణిముత్యాల్లాంటి పాత పాటల కలెక్షన్ ఉందనుకుందాం. క్యాసెట్లలో ఉన్న ఆ పాటలన్నింటినీ డిజిటల్ ఫార్మేట్‌లోకి మార్చుకుని సిడిల్లోకి ఎక్కించుకునే మార్గాలనేకం ఉన్నాయి. సింపుల్‌గా క్యాసెట్లను స్టీరియో లేదా టేప్ రికార్డర్‌లో ఉంచి, ఆ స్టీరియోని కంప్యూటర్ యొక్క సౌండ్ కార్డ్ కి కనెక్ట్ చేసి Jet Audio, Total Recorder వంటి సాఫ్ట్ వేర్లలొ టేప్‌రికార్డర్/స్టీరియోలో ప్లే అయ్యే పాటలను WAV లేదా MP3 ఫార్మేట్‌లో రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాసెట్లలోని పాటలన్నీ మీ హార్డ్ డిస్క్ లోకి వచ్చేశాయి. వాటిని Nero, NTI CD Maker, WinonCD, Prassi వంటి ఆడియో సిడి ఆప్షన్‌ని అందించే సిడి రైటింగ్ సాఫ్ట్ వేర్లని ఉపయోగించి ఖాళీ సిడిల్లోకి డిజిటల్ ఫార్మేట్‌లోకి రికార్డ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ సాఫ్ట్ వేర్లు WAV, MP3< WMA, వంటి విభిన్న ఆడియో ఫార్మేట్లకు చెందిన ఆడియో ఫైళ్ళని ఇన్‌పుట్‌గా తీసుకుని మామూలు ఆడియో సిడి ప్లేయర్లు ప్లే చెయ్యగల CD-DA ఫార్మేట్‌లోకి వాటిని రికార్డ్ చెయ్యగలుగుతాయి.
ఫోటో సిడిలను తయారుచెయ్యడం ఇలా...
హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకున్న ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి ప్లే చెయ్యబడే ఒక సినిమా మాదిరిగా (మూవీ క్లిప్‌గా) సిడిపై రికార్డ్ చేసుకోవడానికి Roxio Easy CD Creator, Win on CD వంటి సిడిరైటింగ్ సాఫ్ట్ వేర్లలో PhotoCD అనే ఆప్షన్ పొందుపరచబడింది. ఈ ఆప్షన్‌ని ఉపయోగించి మనం క్రియేట్ చేస్తున్న సిడికి ఒక ఆల్బం పేరుని ఇచ్చి అందులో పొందుపరచవలసిన ఫోటోల లోకేషన్‌ని స్పెసిపై చేస్తే అవన్నీ ఒక వీడియో ఫైల్‌గా కన్వర్ట్ చెయ్యబడి సిడిలోకి రికార్డ్ అవుతాయి. ఒకవేళ మీరు ఫోటో సిడిగా రూపొందించుకోవాలనుకున్న్ ఐమేజ్‌లకు రకరకాల Transition ఎఫెక్టులు ఇచ్చి చూపరుల్ని ఆశ్చర్యచకితుల్ని చెయ్యాలంటే Photo2VCD అనే సాఫ్ట్ వేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఎక్కువ ఫోటోలను ఇన్‌పుట్‌గా ఇస్తే వాటిని VCD ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చెయ్యడానికి ఈ సాఫ్ట్ వేర్ ఎక్కువ సమయం తీసుకుంటూంది.
26, డిసెంబర్ 2007, బుధవారం
పాత వెర్షన్ సాఫ్ట్ వేర్లు దొరికే ప్రదేశం ఇదిగోండి
2000వ సంవత్సరంలో టివి ట్యూనర్ కార్డ్ కొన్నప్పుడు అందరూ పిసిలో టివి వస్తుందంటే చాలా ఆశ్చర్యంగా చూసేవారు. అప్పట్లో టివిలో ప్రసారం అయ్యే ప్రోగ్రాములను ఎలాగైనా రికార్డ్ చేసుకోవాలని మహా కోరికగా ఉండేది. కార్డ్ తోపాటు ఇచ్చిన సాఫ్ట్ వేర్ లో ఆ వెసులుబాటు ఉన్నా భారీ సైజ్ గల AVI ఫైళ్లుగా సేవ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉండడంతో ఎలాగైనా తక్కువ సైజ్ తీసుకునే MPEG ఫార్మేట్ లోకి రికార్డ్ చేసుకునే మార్గం దొరకకపోతుందా అని అన్వేషించడం ప్రారంభించాను. ఆ అన్వేషణలో WinVCR అనే సాఫ్ట్ వేర్ నన్నెంతో ఆకర్షించింది. ఇప్పుడు ఆ సాఫ్ట్ వేర్ తయారీ కంపెనీ దుకాణం మూసేసుకున్నా ఇప్పటికీ ఆ సాఫ్ట్ వేర్ పేరు తలుచుకుంటే ఎంతో హాపీ అనిపిస్తుంది. ఇదంతా ఎందకు చెప్పుకుంటూ వస్తున్నానంటే... సంవత్సరాల తరబడి పిసిలను వాడిన అనుభవం ఉన్నవారు ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సాఫ్ట్ వేర్, ఏదో ఒక వెర్షన్ పై మోజు పెంచుకుంటారు. అలా మీరూ ఏదైనా పాత సాఫ్ట్ వేర్ ని లైక్ చేసినట్లయితే http://www.old-versions.net/ అనే వెబ్ సైట్లోకి వెళ్లి మీరు అప్పట్లో మెచ్చిన సాఫ్ట్ వేర్ ని వెదికి పట్టుకుని తిరిగి తనివితీరా మీ సిస్టంలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. కేవలం పాత వెర్షన్ సాఫ్ట్ వేర్ల కోసం ఉద్దేశించబడిన చక్కని సైట్ ఇది.
25, డిసెంబర్ 2007, మంగళవారం
సాంకేతిక నిపుణులూ, సహాయం కోరేవారికి విజ్ఞప్తి!
పిసి యూజర్లకి కంప్యూటర్ పై పనిచేసేటప్పుడు సహజంగా అనేక సందేహాలు వస్తుంటాయి. వాటిని పరిష్కరించడానికి ఎవరైనా నిపుణులు అందుబాటులో ఉంటే చాలా బాగుంటుంది. మనలో చాలామందిమి సాంకేతికంగా చాలా నేర్చుకుని ఉంటున్నాం. కానీ మన నాలెడ్జ్. ఓపిక మొత్తం మన ఉద్యోగాలు చేసుకునేసరికే హరించుకుపోతోంది. సాంకేతికంగా నాలెడ్జ్ ఉన్న వారందరూ ఒకే చోట కలుస్తూ ఒకరికొకరు వారి నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడంతో పాటు.. ఎవరికైనా సాంకేతిక సహాయం అవసరం అయితే వారికి తక్షణం సహాయపడగలిగేలా ఓ ప్లాట్ ఫారం తయారు చేద్దామన్న నా తపనకు లేఖిని, కూడలి సృష్టికర్త వీవెన్ గారు.. http://computerera.koodali.org/ అనే లింక్ లో ఓ ఛాట్ రూమ్ ని క్రియేట్ చేసి పెట్టడం ద్వారా సపోర్ట్ గా నిలిచారు. దయచేసి వివిధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఈ రూమ్ లో తరచూ కొద్ది సమయం గడుపుతూ... తమ నాలెడ్జ్ ని ఇతరులతో షేర్ చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా సహాయపడగలరు. కంప్యూటర్లో తెలుగు రాకపోవడం, ఫొటోషాప్ లో ఏదో ఒక ఆప్షన్ ఎలా వాడాలో తెలియకపోవడం వంటి ఏ సందేహాలనైనా ఈ ఛాట్ రూమ్ లో అడగవచ్చు. మీరు అడిగిన అంశంపై ఎవరికైనా అవగాహన, తగిన సమయం ఉంటే తప్పక మీకు సహాయపడతారు. మనందరం మన సేవ, అభిమానాల ద్వారా మనకు మధ్య బలమైన అనుబంధాలను పెంచుకుంటూ మంచి సమాజాన్ని నిర్మించడానికి ఇది దోహదపడుతుంది. ఒక్కసారి మనం వివిధ రూపాల్లో ఎంత సమయం వృధా చేస్తున్నామో ఆలోచించండి. కొద్దిపాటి సమయం మన వారి కోసం వెచ్చిస్తే ఎంత సంతృప్తి కలుగుతుంది? అలాగే వీలైనంత వరకూ లేఖిని, బరహ, ఇన్ స్ర్కిప్ట్ వంటి పద్ధతులను అనుసరించడం ద్వారా ఈ ఛాట్ రూము లో తెలుగులోనే మాట్లాడుకుందాం. ఒకవేళ వాటిని ఎలా వాడాలో మీకు తెలియకపోతే ఇక్కడే అడగండి, ఎవరో ఒకరం సహాయపడతాం. అలాగే దయచేసి సహాయం అందించదలుచుకున్న వారూ, సహాయం కోరేవారూ ప్రతీ ఒక్కరూ http://www.teamviewer.com/download/TeamViewer_Setup.exe అనే సైట్ లో లభించే టీమ్ వ్యూయర్ అనే సాఫ్ట్ వేర్ ని మీ కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసుకుంటే.. మరింత సులువుగా మీ అనుమతితో మీ కంప్యూటర్లోకి ప్రవేశించి మీకు సహాయపడడానికి అవకాశం ఉంటుంది. పని పూర్తయ్యాక మీ డెస్క్ టాప్ కి సపోర్ట్ ఇచ్చేవారు తీసుకున్న కనెక్షన్ ని నిలిపివేయవచ్చు. ఓ మంచి నాలెడ్జబుల్ సొసైటీ కోసం ఎలాంటి వెనుకా ముందూ ఆలోచనలు లేకుండా అన్ని రంగాల్లో ఉన్నవారూ ముందుకు రాగలరు. అలాగే గతంలో "సేవకు రెడీనా" అనే పోస్టులో ఇతరులకు సాయపడడానికి ముందుకు వచ్చి తమ వివరాలు, తాము అందుబాటులో ఉండే సమయాలు వెల్లడించిన వారు వీలైనంత వరకూ ఈ ఛాట్ రూములో మీరు ప్రకటించిన సమయాల్లో అందుబాటులో ఉండగలరు.
- నల్లమోతు శ్రీధర్
- నల్లమోతు శ్రీధర్
24, డిసెంబర్ 2007, సోమవారం
నేరుగా MPEG 4 ఫార్మేట్‌లోకి కన్వర్షన్
VCDల్లో ఉన్న DAT, MPEG ఫైళ్ళను, AVI, WMV, ASF, ఫార్మేట్లలో ఉన్న వీడియో ఫైళ్ళను నేరుగా DiVX, AVI/MPEG4, WMV V7/V8 ఫార్మేట్లకు కన్వర్ట్ చెయ్యడానికి ఉపయోగపడే సాఫ్ట్ వేరే MPEG 4 Direct Maker. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా 250 Kbps VHS క్వాలిటీ వీడియో క్లిప్‌లను, 500Kbps డివిడి క్వాలిటీ క్లిప్‌లను ఎన్‌కోడ్ చేసుకోవచ్చు. అలాగే విసిడిలను నేరుగా DivX ఫార్మేట్లలోకి మార్పిడి చేసుకోవచ్చు.
HD CD అంటే ఏమిటి, వేరే రికార్డర్ కావాలా?
HD CD (High Definition Compatible Digital) అనేది సిడిలు, డివిడిల్లోకి డేటాని ఎన్‌కోడ్, డీకోడ్ చేసే టెక్నాలజీ. మామూలు సిడిల్లో కేవలం 16-bit సమాచారం మాత్రమే చానెల్‌కి రికార్డ్ చేయబడితే HD CD టెక్నాలజీలో 20-bit డేటా ఎన్‌కోడ్ చేయబడుతుంది. దీనివల్ల శబ్దాలు చాలా సహజసిద్ధంగా వినిపించబడతాయి. అయితే HDCD చిప్‌తో కూడిన రికార్డర్‌లో మాత్రమే ఇలాంటి సిడి,డివిడిలను రైట్ చేయగలుగుతాం. కాకపోతే HD CD లను మనం వాడే మామూలు సిడి, డివిడి ప్లేయర్లలో సైతం ప్లే చేసుకోవచ్చు. అలాగే HD CD రికార్డర్లు మామూలు సిడి, డివిడిలను సైట్ రీడ్, రికార్డ్ చేయగలవు. వీటివల్ల నాణ్యత మెరుగవుతుంది.
USB మెమరీ కార్డ్‌లు ఎలా పనిచేస్తాయి?
కంప్యూటర్లో అమర్చే 2GB హార్డ్ డిస్క్ లోని సమాచారం చిన్ని పట్టీలాంటి USB మెమరీ స్టిక్‌లో ఎలా పడుతుందో తెలుసా..USB మెమరీ కార్డ్ లలొ ప్రధానంగా ఫ్లాష్ మెమరీని వాడుతుంటారు. దానికి రెండువైపులా రెండు చిప్‌లు దీనికోసం కేటాయించబడి ఉంటాయి. అలాగే కార్డ్ యొక్క ప్రొసెసర్‌గా పిలవబడే ASIC (Application Specific Integrated Circuit) 50 MHz Strong ARM 7 RISC Processor ని కలిగి ఉంటుంది. ఇకపోతే "క్రిస్టల్ ఆస్కిలేటర్" ప్రొసెసర్‌కి కావలసిన క్లాక్ సిగ్నల్‌ని ఉత్పత్తి చేస్తుంది. సర్క్యూట్ బోర్డుపై ఉండే అన్ని విడిభాగాలూ ఈ క్లాక్ స్పీడ్‌కి తగ్గట్టుగా సింక్రనైజ్ అవుతాయి. ఇక మెమరీ కార్డ్ లోని అంతర్గత భాగాలకు రక్షణగా మందమైన కేసింగ్ పైన అమర్చబడుతుంది. మెమరీ కార్డ్ నుండి డేటా రీడ్/రైట్ చేయబడేటప్పుడు LED వెలుగుతుంటుంది.
22, డిసెంబర్ 2007, శనివారం
Samsung Z500 ఫోన్ అన్‌లాక్ చేయడం
మీవద్ద Samsung Z500 ఫోన్ ఉన్నట్లయితే అది లాక్ అయినప్పుడు , ఇప్పుడు చెప్పబోయే చిట్కాని పాటించండి. ఫోన్‌లో సిమ్‌కార్డ్ ఎంటర్ చేయకుండా *7465625*28782 # అనే కోడ్‌ని ప్రెస్ చేయండి. వెంటనే ఫోన్ స్క్రీన్‌పై "Auto Subset Lock:Activated!" అనే మేసేజ్ చూపించబడుతుంది. ఇప్పుడు మళ్ళీ సిమ్‌కార్డ్ లేకుండానే *7465625*28638# కోడ్‌ని ఎంటర్ చేయండి. ఫోన్ స్క్రీన్‌పై ఈసారి Auto Network Lock: Activated!" అనే మెసేజ్ ప్రత్యక్షమవుతుంది. అంతే చివరిగా సిమ్‌కార్డ్ ని ఇన్‌సర్ట్ చేసి ఫోన్ ఆన్ చేస్తే పనిచేస్తుంది.
మౌస్‌ని స్క్రీన్ పెన్ మాదిరిగా మార్చుకోండి
వివిధ అప్లికేషన్ ప్రోగ్రాములను ఓపెన్ చేసి డాక్యుమెంట్లని క్రియేట్ చేయడమే మనం రొటీన్‌గా చేస్తుంటాం. మోనిటర్‌పై మనకు కనిపించే స్క్రీన్‌పై ఓ పెన్‌తో రాసినట్లు మీ పేరు రాయడానికి వీలుపడుతుంది అని చెబితే రొటీన్ పనులకు పిసిని వాడేవారు నమ్మకపోవచ్చు.Microsoft Zoomit అనే ప్రోగ్రాంని ఉపయోగించి స్క్రీన్‌పై రకరకాల కలర్స్ తో మనకు నచ్చిన ఆకారంలో గీతలు గీయవచ్చు. స్క్రీన్‌పై అంశాలని ఇతరులకు explain చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
నేరుగా నాతో మాట్లాడాలంటే http://computerera.koodali.org/ లైవ్ ఛాట్ లో పాల్గొనండి.
నేరుగా నాతో మాట్లాడాలంటే http://computerera.koodali.org/ లైవ్ ఛాట్ లో పాల్గొనండి.
17, డిసెంబర్ 2007, సోమవారం
అందరికీ ధన్యవాదాలు..
జూలై 9, 2007న ప్రారంభించబడిన "నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు" బ్లాగు ఈరోజుకి (5 నెలల 8 రోజులు) సరిగ్గా పదివేల విజిట్స్ ని పొందింది. ఏదో నాకు తెలిసింది పదిమందికీ తెలియజేద్దామని రోజుకి ఒకి రెండు పోస్టుల చొప్పున ఇప్పటివరకూ 267 పోస్టులను (వీడియో, టెక్ట్స్ కలిపి) చేయడం జరిగింది. ఈ బ్లాగు నిరంతరం పోస్టులతో ఇంత పచ్చగా కళకళలాడుతూ ఉందంటే దాని వెనుక జ్యోతి గారి కృషి కూడా ఎంతో ఉంది. ఆవిడకి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఈ బ్లాగును రెగ్యులర్ గా విజిట్ చేస్తున్న పాఠకులకు ధన్యవాదాలు. మీ ఆశీర్వాదంతో ఇదే ఉత్సాహంతో పనిచేస్తాను.
- నల్లమోతు శ్రీధర్
ఈనెల 24నే పాఠకుల సమావేశం!
ప్రియమైన కంప్యూటర్ ఎరా మిత్రులకు.. డిసెంబర్ 25న హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ లో నిర్వహించ తలపెట్టిన పాఠకుల సమావేశాన్ని ఆరోజు క్రిస్టమస్ పర్వదినం ఉండడం కారణంగా 24వ తేదీ సాయంత్రం 3 గంటలకు ముందుకు జరపడం జరిగింది. దయచేసి ఈ మార్పుని అర్థం చేసుకుని సహచర సభ్యులు సహకరించగలరు. మనమందరం 24వ తేదీన సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ యూసఫ్ గూడ బస్తీ వద్ద ఉన్న (అమీర్ పేట సారధి స్టూడియో నుండి హైటెక్ సిటీ వెళ్లే రూట్ లో) కృష్ణకాంత్ పార్క్ లో సమావేశమవుదాం. అలాగే ఏవైనా సందేహాలుంటే 9848227008 నెంబర్ లో సంప్రదించగలరు. నలుగురైదుగురు వచ్చినా సమావేశం జరుగుతుంది. మంచి ఉద్దేశాలు కలిగిన వ్యక్తులు ఒకచోట కలవడమే ప్రధాన ఉద్దేశ్యం తప్ప ఎంతమంది హాజరవుతారు అన్నది కాదు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం 3 గంటలకు కృష్ణకాంత్ పార్క్ టికెట్ తీసుకునే మెయిన్ గేట్ వద్ద గుమికూడి అందరం ఒకేసారి లోపలికి వెళదాం.
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా
16, డిసెంబర్ 2007, ఆదివారం
లాండ్ లైన్ నెంబర్లని తెలుసుకోవాలంటే
మీకు సుబ్బారావు అని ఓ మిత్రుడు ఉన్నాడనుకోండి.. అతడు ఏ జమ్ములపాలెం వంటి గ్రామంలోనో నివశిస్తున్నాడనుకుందాం. అతని ఫోన్ నెంబర్ మాత్రం మీవద్ద లేదు. అలాంటప్పుడు ఓసారి BSNL ఆన్ లైన్ టెలిఫోన్ డైరెక్టరీ ద్వారా వెదికితే అతనికి లాండ్ లైన్ కనెక్షన్ ఉంటే చాలా సులభంగా ఫోన్ నెంబర్ వెదికి పట్టుకోవచ్చు. ఒక వ్యక్తికి సంబంధించి మన వద్ద పేర్లు/అడ్రస్ లేదా టెలిఫోన్ నెంబర్ లలో ఏ సమాచారం ఉన్నా అవతలి వారి ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలుకల్పించే విధంగా BSNL ఆన్ లైన్ టెలిఫోన్ డైరెక్టరీ ని నిర్వహిస్తోంది. టెలిఫోన్ నెంబర్ తెలిస్తే పేరు, అడ్రస్ లను తెలుసుకోవచ్చు, అదే పేరు తెలిస్తే కొద్దిపాటి ప్రయత్నంతో మీకు కావలసిన వ్యక్తి యొక్క టెలిఫోన్ నెంబర్ తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయబడుతున్న ఈ డైరెక్టరీలో అన్ని జిల్లాలకు సంబంధించిన ఆప్షన్లు లభిస్తున్నాయి. http://www.ap.bsnl.co.in/enquiry/enquiryhome.asp అనే లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరూ BSNL ఆన్ లైన్ టెలిఫోన్ డైరెక్టరీని సందర్శించండి.
లింకులు ఓపెన్ అవకుండా ఖాళీ బాక్స్ వస్తోందా?
ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఏదైనా వెబ్ పేజీలోని లింక్ ని క్లిక్ చేసిన వెంటనే "ప్రస్తుతం ఉన్న పేజీ నుండి ఆ లింక్ ఉన్న పేజీ ఎలా లోడ్ చేయబడుతోంది" అని ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా Internet Explorer బ్రౌజర్ లో మనం లింకులను క్లిక్ చేసినప్పుడు ఆ లింకులు ఉన్న వెబ్ సైట్ అడ్రస్ ని టెంపరరీగా మెమరీలో భద్రపరుచుకుని IE విండోలోకి ఆ లింక్ యొక్క పేజీని ఓపెన్ చేయడానికి URLMON.DLL అనే ఫైల్ పనిచేస్తుంటుంది. ఈ ఫైల్ Windows\System ఫోల్డర్ లో స్టోర్ చేయబడి ఉంటుంది. ఒకవేళ ఈ ఫైల్ యొక్క రిఫరెన్స్ గనుక విండోస్ రిజిస్ట్రీలో మిస్ అయినట్లయితే ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరల్ లో మనం ఏ లింక్ ని క్లిక్ చేసినా వెంటనే ఖాళీ విండో మాత్రమే ఓపెన్ చేయబడుతుంది. మీరూ ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్నట్లయితే Start>Run కమాండ్ బాక్స్ లో కానీ, DOS విండోలో కమాండ్ ప్రామ్ట్ వద్దకు గానీ వెళ్లి REGSVR32 URLMON.DLL అనే కమాండ్ ని టైప్ చేసి Enter బటన్ ప్రెస్ చేయండి. దీనితో రిజిస్ట్రీలో మిస్ అయిన ఈ ఫైల్ రిఫరెన్స్ మళ్లీ కొత్తగా సృష్టించబడి లింకులు సక్రమంగా పనిచేయనారంభిస్తాయి.
మునుపటి కన్నా వేగంగా ప్రింట్ అయ్యేలా...
Windows 2000/XP ఆపరేటింగ్ సిస్టం లలో ఒక డాక్యుమెంట్ ని మొదటిసారి ప్రింట్ చేసినప్పుడు తీసుకునే టైమ్ కన్నా అదే డాక్యుమెంట్ ని రెండవ సారి ప్రింట్ చేసినప్పుడు తక్కువ సమయంలో ప్రింట్ అయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. Start మెనూలో Settings>Printers అనే విభాగంలో మీరు ఉపయోగిస్తున్న ప్రింటర్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి Properties ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని Advanced అనే విభాగంలో Keep printed documents అనే ఆప్షన్ ఎనేబుల్ చేయండి. దీంతో మనం ప్రింటింగ్ ఇచ్చిన ప్రతీ డాక్యుమెంట్ స్ఫూలింగ్ నుండి డిలీట్ చేయబడకుండా.. C:\Windows\System32\spool\printers లేదా C:\WINNT\System32\spool\printers\ అనే ఫోల్డర్ లో సేవ్ చేయబడుతుంది. ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ ని మరోమారు ప్రింట్ చేయవలసి వచ్చినట్లయితే ఈ ఫోల్డర్ లోకి వెళ్లి మనం రెండవసారి ప్రింట్ చేయదలుచుకున్న డాక్యుమెంట్ ని వెదికి పట్టుకుని ఆ ఫైల్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి restart అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మునుపటి కన్నా వేగంగా ఆ డాక్యుమెంట్ ప్రింట్ చేయబడుతుంది. అయితే ఈ సెట్టింగ్ వల్ల కొద్దిగా హార్డ్ డిస్క్ స్పేస్ వృధా అవుతుంది. ఈ తతంగం అంతా ఎందుకు, కొద్ది సమయం అధికమైనా మామూలుగానే ప్రింటింగ్ జరుపుకుంటామంటే అది మీ ఇష్టం, ఓ చిట్కా మాత్రమే ఇది.
15, డిసెంబర్ 2007, శనివారం
Opera 9.1 కి దన్నుగా ఫ్రాడ్ ప్రొటెక్షన్
Mozilla Firefox వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాని దానికి పూర్వం IE తర్వాత Opera బ్రౌజరే బాగా వాడుకలో ఉండేది. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌పై ఫిషింగ్ స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో IEతో పాటు అన్ని బ్రౌజర్లలోనూ యాంటీ ఫిషింగ్ ఫిల్టర్లు అమర్చబడుతున్నాయి. ఆయా బ్రౌజర్ల ద్వారా మనం ఏదైనా వెబ్‌సైట్‌లోని లింకుని క్లిక్ చేసిన వెంటనే ఆ లింక్ సరైన వెబ్‌సైట్‌దో కాదో సెక్యూరిటీ సర్టిఫికెట్లని పరిశీలించడం ద్వారా నిర్ధారించి బ్రౌజర్లు మనల్ని అలర్ట్ చేస్తాయి. దీనివల్ల ఆన్‌లైన్ బ్యాంకింగ్, షాపింగ్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు వంటివి జరిపేటప్పుడు దొంగల పాలిట పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇదే కోవలో ప్రస్తుతం Opera 9.1 వెర్షన్ వాడుతున్న యూజర్లకి సైతం 'ఫ్రాడ్ ప్రొటెక్షన్ ' అనే సరికొత్త సదుపాయం అందించబడుతోంది. అయితే డీఫాల్ట్‌గా ఈ ఫీచర్ డిసేబుల్ చేయబడి ఉంటోంది. దీనిని మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్రౌజర్ ద్వారా మనం ఏ వెబ్‌సైట్ లింక్‌ని క్లిక్ చేసినా... బ్రౌజర్ ఆ లింక్‌ని Geotrust, Phishtank సర్వర్లచే క్రోడీకరించబడిన ఫిషింగ్ సైట్ల వివరాలతో సరిపోల్చి సరైన లింక్ అయితేనే ఓపెన్ చేస్తుంది.
బూటబుల్ సిడిలో ఏమీ కనిపించవు ఎందుకు?
98,Me బూటబుల్ ఫ్లాపీల ఆధారంగా బూటబుల్ సిడిలని క్రియేట్ చేసుకున్నప్పుడు ఫ్లాపీలో కనిపించే FDISK, FORMAT వంటి ప్రోగ్రాములు కూడ CDలో కనిపించవు. కానీ అవి పనిచేస్తుంటాయి. దీని వెనుక ఉన్న రహస్యం... బూటబుల్ ఫ్లాపీ ఆధారంగా సిడి క్రియేట్ చేయబడేటప్పుడు ఫ్లాపీలోని అన్ని ఫైళ్ళూ BOOTIMG.BIN అనే ఫైల్‌లో ప్యాక్ చేయబడతాయి. దీనితోపాటు BOOTCAT>BIN అనే మరో కేటలాగ్ ఫైల్ బూటబుల్ సిడిలో సృష్టించబడుతుంది. సో... బూటింగ్‌కి సంబంధించిన సకల సమాచారం ఈ రెండు ఫైళ్ళలోనే అంతర్గతంగా ఉండడం వల్ల Windows Explorer ద్వారా చూసినప్పుడు Format, Fdisk వంటి ఫైళ్ళు విడిగా కనిపించవు.
12, డిసెంబర్ 2007, బుధవారం
కంప్యూటర్ ఎరా స్పెషల్ బుక్స్
విద్యార్థులు, హోమ్ పిసి యూజర్లు,గృహిణులు, సాఫ్ట్‌వేర్/ హార్డ్‌వేర్ ఇంజనీర్లు వంటి ప్రతీ పిసి యూజర్‌కి ఉపకరించేలా కంప్యూటర్ ఎరా విభిన్నమైన టాపిక్స్ మీద స్పెషల్ బుక్స్‌ని విడుదల చేసింది. ప్రతీ పిసి యూజర్ వద్ద ఉండవలసిన పుస్తకాలు ఇవి.
1. కంప్యూటర్ హార్డ్‌వేర్....Rs.69
2. పిసి ట్రబుల్ షూటింగ్ ..Rs.79
3. కంప్యూటర్ టిప్స్ & ట్రిక్స్...Rs.119
4. కంప్యూటర్ సందేహాలు...Rs.69
5. కంప్యూటర్ A-Z - 1 .......Rs.109
6. కంప్యూటర్ A-Z - 2 .......Rs.109
7. విండోస్ రిజిస్ట్రీ,స్మాల్ థింగ్స్...........Rs.99
8. సెల్‌ఫోన్ చిట్కాలు.....Rs.39
9. ఏ సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుంది...Rs.39
కాపీలు అన్ని ప్రధాన బుక్ స్టాల్స్‌లో లభ్యం లేదా పోస్టులో పొందగోరువారు పుస్తకం ఖరీదుతోపాటు రూ.10 అదనంగా క్రింది అడ్రస్‌కు ఎం.ఓ. చేయండి. ఎం.ఓ ఫారంలో ఏ పుస్తకం కావాలో తెలపండి.
Bandla Publications
2-2-1130/24/1/D/1
Behind Indian Bank, Shivam Road
New Nallakunta,
Hyderabad
ph: 27673494
cell:9963293399
కంఫ్యూటర్ ఎరా స్పెషల్ - 1
కంప్యూటర్ హార్డ్ వేర్
కొంతమందికి కంప్యూటర్లంటే తెలియని భయం. ఏదో తప్పనిసరై వాటిని ఉపయోగిస్తారు కానీ క్యాబినెట్‌ని ముట్టుకోవాలన్నా , క్యాబినెట్ స్క్రూలను విప్పదీసి రేకుని తొలగించి లోపలికి చేయి పెట్టాలన్నా ఎక్కడ షాక్ కొడుతుందో... ఏం పాడవుతుందోనని హడలిపోతుంటారు. అయితే ఎంత రఫ్‌గా హ్యాండిల్ చేసినా మొండింగా పనిచేసేది కంప్యూటర్ మాత్రమే. కంప్యూటర్ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవలసిన అవసరం లేదు. కంప్యూటర్‌లోని వివిధ భాగాలపై ఆవగాహన కలిగించడానికే రూపొందించబడినదే ఈ హార్డ్‌వేర్ పుస్తకం. ఇందులో మదర్‌బోర్డ్, ప్రాసెసర్, మేమరీ, IDE, SCSI వంటి ఇంటర్‌ఫేస్‌లు, రిమూవబుల్ స్టోరేజ్, ఫ్లాపీ డిస్క్ వంటి వివిధ కంప్యూటర్ భాగాల గురించి, అది ఎలా ఆవిర్భవించింది, దాని విషయంలో ఇప్పటివరకు వాడుకలో ఉన్న టెక్నాలజీలు , ఇతర సాంకేతికపరమైన వివరాలను సమగ్రంగా అందించడం జరిగింది. పిసి హార్డ్‌వేర్ గురించి ఇంత విస్తృతంగా ఇంతవరకూ తెలుగులోనే కాక ఇతర భారతీయ భాషల్లో వేటిలోనూ చర్చించిన పుస్తకాలు లేవు. హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ రంగాల్లో స్థిరపడదలుచుకున్న వారికీ , హోమ్ పిసి యూజర్లకి ఎంతో ఉపయుక్తంగా ఉండే పుస్తకమిది. విషయం సులభంగా అర్ధం కావడం కోసం అవసరమైన చోట ఫోటోలను, స్క్రీన్‌షాట్లని, టేబుల్స్‌ని, డయాగ్రములను సైతం పొందుపరచబడడం జరిగింది. వాస్తవానికి పిసి హార్డ్‌వేర్ అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. అన్ని హార్డ్‌వేర్ భాగాల గురించి, టెక్నాలజీల గురించి ఒకే పుస్తకంలో ప్రచురించడం తలకు మించిన భారమే. అందుకే ఈ హార్డ్‌వేర్ పుస్తకాన్ని వేర్వేరు భాగాలుగా విఘజించడం జరిగింది. ఈ మొదటి భాగంలో మదర్‌బోర్డ్, రామ్, ప్రాసెసర్, రిమూవబుల్ స్టోరేజ్ వంటి అంశాల గురించి వివరించాం. తరలో విడుదల కాబోయే మరో భాగంలో మిగిలిన అంశాల గురించి సవివరంగా ప్రచురిస్తాం. MCSE వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇందులో చర్చించబడిన సాంకేతిక వివరాలు చాలా దోహదపడతాయి. అలాగే సాధారణ పిసి యూజర్లకి సైతం ఈ హార్డ్‌వేర్ పుస్తకం వివిధ సందర్భాల్లో మార్గదర్శకంగా ఉంటుంది.
కంప్యూటర్ ఎరా స్పెషల్ - 2
పిసి ట్రబుల్‍షూటింగ్
ఇంట్లో టివి ఎంత అవసరం అయిపోయిందో ఈ మధ్య కాలంలో కంప్యూటర్ కూడా అంతే నిత్యావసరంగా మారింది. చదువుకుంటున్న పిల్లల కోసమైతేనేమి, లేదా విదేశాల్లో ఉన్న ఆత్మీయులతో మాట్లాడుకోవడం కోసమని, స్వతహాగా ఆసక్తి ఉండడం వల్లనైతేనేమి ఇళ్ళలొ కంప్యూటర్లు వడేవారు అధికమయ్యారు. కంప్యూటర్ అనేది ఒకటి ఉంటే దాని మూలంగానూ కొన్ని ఇబ్బందులు చీటికి మాటికీ తలెత్తుతుంటాయి. వైరస్, స్పైవేర్, బ్రౌజర్ హైజాకర్లు, కీలాగర్లు వంటివి మన కంప్యూటర్‌కి ఇన్‌ఫెక్ట్ అవడం మొదలుకుని అప్పటివరకూ సక్రమంగా పనిచేస్తున్న కంప్యూటర్ ఉన్న ఫళాన హ్యాంగ్ అయిపోవడం , అసలు కంప్యూటరే బూట్ అవకపోవడం, బీప్ సౌండ్‌లు రావడం, స్క్రీన్‌పై రకరకాల ఎర్రర మెసేజ్‌లు ప్రదర్శించబడడం, టాస్క్‌బార్,,ఫోల్డర్ ఆప్షన్లు, కమాండ్ ప్రాంప్ట్ వంటి వాటిని యాక్సెస్ చేస్తుంటే ఎర్రర్ మెసేజ్‌లు రావడం, డెక్స్‌టాప్‌పై ఐకాన్లు మారిపోవడం, ఇల్లా చెప్పుకుంటూ పోతుంటే మనం కంప్యూటర్‌ని వాడే విధానాన్ని బట్టి, మన పిసిలో ఇన్‌స్టాల్ చేసుకున్న సాఫ్ట్‌వేర్లు, హార్డ్‌వేర్ పరికరాలను బట్టి వేర్వేరు సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. కంప్యూటర్ అయితే కొంటాం కానీ ఇలా చీటికి మాటికి ఇబ్బంది పెట్టే సమస్యలను ఎలా పరిష్కరించాలన్నది మాత్రం అంతుబట్టదు. దీంతో చాలామంది పిసి యూజర్లు హార్డ్‌వేర్ టెక్నీషియన్లని ఆశ్రయిస్తుంటారు. అయితే కొంతమంది హార్డ్‌వేర్ నిపుణులకు మాత్రమే ట్రబుల్‌షూటింగ్ పై పూర్తిస్థాయి ఆవగాహన ఉంటుంది. వారు మాత్రమే అసలు సమస్య ఎందుకు ఉత్పన్నాం అయిందో గుర్తించి దాన్ని సులభంగా పరిష్కరించగలుగుతారు. అయితే దురదృష్టవశాత్తు అధికశాతం మంది హార్డ్‌వేర్ నిపుణులుగా చలామణి అయ్యేవారికి హార్డ్‌డిస్క్‌ని ఫార్మేట్ చేయడం, ఆపరేటింగ్ సిస్టమ్‌ని రీ్ఇన్‌స్టాల్ చేయడం ఒక్కటే అతను చేయగలిగింది. ఇలా ప్రతీ దానికీ ఫార్మేట్ చేయడం వల్ల ఎంత విలువైన సమచారాన్ని,సమయాన్ని వృధా చేస్తుంటామో ఒక్కసారి ఆలోచించండి? ప్రతీ కంప్యూటర్ సమస్యకీ ఒక పరిష్కారముంటుందీ. ఆయా పరిష్కారాలను తెలుసుకుంటే చిటికెలో పాడైన సిస్టమ్‌ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఇళ్ళలొ కంప్యూటర్లని వాడే ప్రతీ హోమ్ పిసి యూజర్లకి, పిసి ట్రబుల్‌షూటింగ్‌పై పెద్ద ఆవగాహన లేని హార్డ్‌వేర్ టెక్నీషియన్లకి ఉపయోగపడే విధంగా 'ట్రబుల్ షూటింగ్" పేరిట ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాము... ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రోగ్రాములు, సెక్యూరిటీ లోపాలు, వైరస్‌లు, బగ్స్ వంటి అనేక అంశాల కారణంగా తరచుగా తలెత్తే పలు సమస్యలకు పరిష్కారాలను ప్రచురించడం జరిగింది. మీరు పిసిపై పనిచేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అయినా ఒక్కసారి ఈ పుస్తకాన్ని రిఫర్ చేస్తే మీ సమస్యకి చాలావరకూ పరిష్కారం లభిస్తుంది.
కంప్యూటర్ ఎరా స్పెషల్ - 3
కంప్యూటర్ ట్రిప్స్ & ట్రిక్స్
ఏదైనా పనిని సులువుగా చేసే మార్గముంటే అందరం దానిని ఇష్టపడతాం. కంప్యూటర్ల విషయంలోనూ మనకు తెలియకుండా అనేక పనుల్ని సులభంగా చేసే చిట్కాలు ఎన్నో ఉంటాయి.ఆ మెళకువలు తెలియకపోవడం వల్ల ప్రతీ పనికీ ఎంతో కష్టపడుతుంటాము. ఉదా.. మీరొక వీడియో సిడి తెచ్చుకుని మీ సిడిరైటర్‌లో కాపీ చేసుకుందామని ఎన్నిసార్లు ప్రయత్నిస్తుంటే ఎర్రర్ మెసేజ్ వచ్చి ఆగిపోతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే ఫలితం వస్తుంటే చిరాకు రాదూ! అదే సిడిలను కాపీ చేసే టెక్నిక్ ,సమస్యలు ఏదైనా మీకు తెలిసిఉంటే క్షణాల్లో మీ అవసరం నెరవేరిపోతుంది కదా? తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండాలే కానీ కంప్యూటర్లపై పనిచేసేటప్పుడు ఎన్నో చిట్కాలను, నైపుణ్యతలను ప్రదర్శించి అందరికన్నా టెక్నికల్‌గా మనం ముందుండవచ్చు. అయితే చాలామంది ఏదో ఆ MS-WOrd లో రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోగలిగితే చాలు, లేదా tally లోమా కంపెనీ ఎకౌంట్లని ప్రిపేర్ చేసుకోగలిగితే చాలు. ఇలా కొన్నికొన్ని ఉద్దేశ్యాలను, పరిమితులను విధించుకుని ఎప్పుడూ చేసే రొటీన్ పనులనే మళ్ళి మళ్ళీ కంప్యూటర్‌పై చేస్తుంటారు. అలాంటి వారు ఒక్కసారి తమ పరిధిని విస్తరించుకుని కొత్త విషయాలను నేర్చుకోవడానికి పూనుకుంటే ఈ పుస్తకం మీకు కంప్యూటర్ల గురించి తెలియని అద్భుతాలను పరిచయం చేస్తుంది. ఇందులో ప్రస్తావించిన చిట్కాలు ఒక్కో సందర్భంలో చాలా ఉపయోగకారకంగా ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్య చకితుల్ని చేయవచ్చు. నాలుగు మాటల్లో ఈ పుస్తకంలోని సమాచారం గురించి వివరించడం సాధ్యం కాని పని. ఆసక్తిగా చదువుతూ తెలుసుకున్న మెళకువలను మీ కంప్యూటర్స్‌పై ప్రయోగిస్తూ వెళ్ళండి . డివిడి డ్రైవ్‌లలో రీజిన్ లాకింగ్, గెస్ట్ ఎకౌంట్లని పాస్‌వర్డ్ ప్రొటేక్ట్ చేయడం, సర్వర్ సెక్యూరిటి మెరుగ్గా ఉంచుకోవడం. పొరబాటున ఫాంట్స్ ఫోల్డర్ తీసేస్తే, సింపుల్ షేరింగ్‌ని డిసేబుల్ చేయడం, ప్రాసెస్‌ల యొక్క ప్రాధాన్యతని పెంచడం, డౌన్‌లోడ్ మేనేజర్లలో వైరస్ స్కానర్‌ని ఇంటి్‌గ్రేట్ చేయడం, డివిడి రామ్ కొనేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే చేయవలసిన పనులు .. ఇల రాసుకుంటూ పోతే ఎన్నో విభిన్నమైన అంశాల గురించి అందరు కంప్యూటర్ యూజర్లు తెలుసుకోవలసిన చిట్కాలు, మెళకువలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ప్రతీ చిట్కా టెక్నికల్‌గా మీకు ఎంతో నాలెడ్జ్‌ని అందించేదే...ప్రతీ టెక్నిక్ మిమ్మల్ని టెక్నికల్‌గా సమున్నత స్థానంలో నిలిపేదే.. ఇలాంటివి తెలిసి ఉంటేనే ఇతర పిసి యూజర్ల కన్నా మీరు టెక్నికల్‌గా ఎంతో ముందు ఉండగలుగుతారు. అంతే తప్ప ఏదో రొటీనుగా పని చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకు మీ పని పట్ల మీరు ఆసక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఈ పుస్తకంలో చర్చించిన ప్రతీ చిట్కాని మీ ఖాళీ సమయాలలో మనసుకు ఎక్కించుకుని అవసరం అయినపుడు ఆచరణలో పెట్టండి.
కంప్యూటర్ ఎరా స్పెషల్ - 4
కంప్యూటర్ సందేహాలు
తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే అంతవరకు మనకు తెలియని ప్రతీ అంశమూ ఒక సందేహమే ! మన సందేహాలను తీర్చాలంటే వాటిపై ఆవగాహన కలిగిన నిపుణులు ఉండాలి. అయితే అన్ని సందర్భాల్లో వారు అందుబాటులో ఉండరు. అలాగని కనపడిన వారినల్లా అడుగుతూ పోయామంటే మన సందేహాలకు అసంబద్ధమైన సమాధానాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికలో యూనికోడ్‌తో డిజైన్ చేయబడిన వెబ్‌సైట్లు తమ కంప్యూటర్లో ఓపెన్ కావడం లేదని ఒక పాఠకుడు అడిగిన ప్రశ్నకు పాపం ఆ ప్రశ్నలు జవాబులు శీర్షికను నిర్వహిస్తున్న మహానుభావుడు ఆ సైట్‌లో ఏ ఫాంట్‌నైతే వాడారో ఆ ఫాంట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుంది అన్నట్లుగా సలహా ఇచ్చాడు. వాస్తవానికి ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో Encoding అనే విభాగంలో Unicode UTF-8 అని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా వివిధ సమస్యలపై, సందేహాలపై ఏమాత్రం ఆవగాహన లేనివారు ఇచ్చే సలహాలు సరైన పరిష్కారాలు అందించలేవు. ముఖ్యంగా పిసి యూజర్లకి నిపుణుల సలహాలు చాలా అవసరం. రీరైటబుల్ సిడిలు ఎరేజ్ అవడం లేదని కొందరు అడుగుతుంటారు. సిస్టమ్‌లో ఉన్న డూప్లికేట్ ఇమేజ్‌లను, అశ్లీలమైన ఇమేజ్‌లను గుర్తించడం వీలుపడుతుందా అని ఒకరు, మూవీ ప్లే అవుతుండగా స్క్రీన్ షాట్ తీయలేమా అని కొందరు, హార్డ్‌డిస్క్‌లో బేడ్ సెక్టార్లని తొలగించలేమా అని మరికొందరు.. ఇలా ప్రతీ పిసి యూజర్ ఎన్నో సందేహాల చిట్టాని ఎల్లప్పుడూ బుర్రలో మోస్తుంటాడు. అతనికి తగిన పరిష్కారాలు లభిస్తే ఎంతో రిలీఫ్ ఫీల్ అవుతాడు. అందుకే పిసి యూజర్ల సందేహాలకు చక్కని పరిష్కరాలు, సమాధానాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రచురించాం. ఇందులో పిసిపై పెద్దగా ఆవగాహన లేనివారిని వేధించే ప్రాధమిక స్థాయి సందేహాలతో పాటు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా అనిపించే అనేక రకాల సమస్యలనూ, కంప్యూటర్‌పై పూర్తిస్థాయి ఆవగాహాన కలిపించే సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివారంటే మీకు తరచుగా తలెత్తే ఎన్నో సందేహాలకు చిక్కు ముడులు వీడినట్లే ! పాఠకులకు తలెత్తే సందేహాలకు చాలా విశ్లేషాత్మకంగా సమాధానాలు ప్రచురించడం జరిగింది. ఇందులో ప్రస్తావించిన ప్రతీ సందేహమూ.. సమాధానమూ నూటికి నూరుశాతం వాస్తవిక దృక్పధంతో ఉంటుంది కాబట్టి ప్రతీ పిసి యూజర్ దీనిని ప్రామాణికంగా స్వీకరించవచ్చు.
కంప్యూటర్ ఎరా స్పెషల్ - 5
కంప్యూటర్స్ A-Z పార్ట్ - 1
కొన్ని విషయాలపై సమగ్రమైన ఆవగాహన ఉంటే అద్భుతాలు సాధించవచ్చు. అయితే ఆయా అంశాల గురించి సమగ్రమైన సమాచారం మొత్తం ఒకే చోట లభించడం కష్టం. ఉదా..పిడిఎఫ్ ఫైళ్ళని ప్రత్యేకంగా ఫాంట్లు ఏమీ ఇన్‌స్టాల్ చేయనవసరం లేకుండానే ఏ విండోస్, మాక్, లినక్స్ వంటి ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయినా సులభంగా ఓపెన్ చేయవచ్చని తెలుసనుకోండి. అసలు PDF ఫైల్ అంటే ఏమిటి, మీరు కూడా మీ డాక్యుమెంట్లని ఆ ఫార్మేట్‌లోకి మార్చాలంటే ఏం చేయాలి, PDF ఫైళ్ళ క్రియేషన్‌లో ఎంచుకోవలసిన సెట్టింగులు తదితర అంశాలను గురించి తెలుసుకోకపోతే ఆ టెక్నాలజీ ద్వారా మీరు గరిష్ట ప్రయోజనం పొందడం సాధ్యపడదు. ఇది ఉదాహరణ మాత్రమే. కంప్యూటర్లపై పనిచేసేటప్పుడు నిరంతరం మనకు అనేక అంశాలు తారసపడుతుంటాయి. ప్రతీ పిసి వినియోగదారుడికి సహజంగా ఎదురయ్యే అనేక సందర్భాలను వీలైనంత వివరంగ చర్చిస్తూ ప్రచురిస్తున్న పుస్తకమే ఈ "కంప్యూటర్స్ A-Z" ఇందులో పిసి యూజర్లకి సహజంగా ఎదురయ్యే సమస్యలు మొదలుకుని, వైరస్‌లు, స్పైవేర్లు, హ్యాకింగ్, సిస్టమ్ సెక్యూరిటీ, ఇంటర్‌నెట్ వినియోగం, భారతీయ వెబ్‌సైట్ల వివరాలు, వివిధ అప్లికేషన్ల ప్రోగ్రాముల్లో ఉపయోగించదగ్గ కీబోర్డ్ షార్ట్‌కట్‌లు వంటి అనేక అంశాల గురించి సవివరంగా చర్చించడం జరిగింది. ఉదా. మనం చాలా తేలికగా తీసేసే ఫాంట్ల గురించే వేర్వేరు ఫాంట్ స్టైళ్ళు, ఫాంట్ల ఇన్‌స్టలేషన్ ఇబ్బందులు, డీఫాల్ట్‌గా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయి ఉండే ఫాంట్ల వివరాలు, కొత్త హాంట్లని డిజైన్ చేయడానికి ఎలాంటి సాఫ్ట్‌వేర్లు ఉపయోగించాలి వంటి అంశాలను ఈ పుస్తకంలో చర్చించాము. రెండు వాల్యూములుగా ఈ పుస్తకాన్ని విభజించడం జరిగింది. ఈ రెండు భాగాలు ప్రతీ పిసి యూజర్ వద్ద తప్పనిసరిగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. నాకు తెలిసిందే చాలు అంటే ఎప్పటికి నాలెడ్జ్ పెరగదు. కొత్త విషయాలను తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టాలి అన్న ఉత్సాహం ఉన్నవారికి ఎంతో ఆసక్తి రేకెత్తించే అంశాలు ఈ సిరీస్‌లో ప్రచురించడం జరిగింది. వీటిని సమగ్రంగా అర్ధం చేసుకుని మీ రోజువారీ కంప్యూటర్ కార్యకలాపాలను మరింత సులభతరం చేసుకుంటారని ఆశిస్తున్నాం.
కంప్యూటర్ ఎరా స్పెషల్ - 6
కంప్యూటర్స్ A-Z పార్ట్ - 2
మీరు ఏ రంగంలో ఉన్నా మీకున్న నాలెడ్జే మిమ్మల్ని అత్యుత్తమ స్థానంలో నిలబెడుతుంది. కంప్యూటర్ రంగం విష్యంలోనూ ఇది అక్షరాలా సత్యం అయితే దురదృష్టవశాత్తు కంప్యూటర్ రంగంలో చాలామంది మూసపద్ధతిలో తమకు తెలిసిన అంశాలనే సంవత్సరాల తరబడి మళ్ళీ మళ్ళీ చేస్తూ నాలెడ్ పరంగా ఏ మాత్రం ఎదుగూబొదుగూ లేకుండా ఉంటారు. ఒక్కసారి 'కంప్యూటర్ ఎరా' ప్రచురించిన ఈ స్పెషల్ సీరిస్ పుస్తకాలను ఆసాంతం చదివితే ఎన్ని విషయాలు మీకు తెలియకుండా పోయాయో అర్ధమవుతుంది. ప్రత్యేకించి ఈ పుస్తకం విషయానికి వస్తే కంప్యూటర్స్ A-Z పేరిట విడుదల అయిన మొదటి భాగానికి ఈ రెండవ భాగం కొనసాగింపు. మొదటి భాగంలో మాదిరిగానే ఈ పుస్తకంలోనూ కొన్ని నిర్దిష్టమిన కంప్యూటర్సంబంధిత అంశాలను తీసుకుని వాటి గురించి చాలా సమగ్రంగా, విశ్లేషాత్మకంగా సమాచారం ప్రచురించడం జరిగింది. సహజంగా కంప్యూటర్ రంగంలో ఉన్నవారు మేము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను మాత్రమే వాడుతుంటామనో , కొందరు తాము డిటిపి రంగంలో ఉన్నామనో, మరికొందరు తమకు హార్డ్ వేర్ మాత్రమే తెలుసు.. ఆ రంగానికి సంబంధించిన సమాచారం మాత్రమే చాలు అనో గిరిగీసుకు కూర్చుకుంటారు. ఈ పుస్తకం పిసి యూజర్‌కి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే ప్రతీ వినియోగదారుడికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వారు ఏ రంగంలో పనిచేస్తున్నారు అన్న దానితో సంబంధం లేకుండా వివిధ అంశాల గురించి వారికి సమగ్రమైన ఆవగాహన కలిగిస్తుంది. అందుకే తాము పనిచేసే రంగాలు ఏవైనా కంప్యూటర్ యూజర్లు ఇందులో పొందుపరిచిన నాలెడ్జిని అధ్యయనం చేస్తూ పోతే ఎంత కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతారో ఎవరికి వారు అనుభూతి చెందవలసిన అంశం. అన్ని అంశాల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించాం. దాని ద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందడం ఇక మీ చేతుల్లో ఉంది.
కంఫ్యూటర్ ఎరా స్పెషల్ - 8
సెల్ ఫోన్ చిట్కాలు
ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్ళారు.. అక్కడ కంప్యూటర్ అనేదే అందుబాటులో లేదు. మీ వర్డ్ ఫైళ్ళని అర్జెంటుగా చదవవలసి వచ్చింది.. ఏం చేస్తారు? కంప్యూటర్ ఎటూ అందుబాటులో లేదు కదా అని ఊరకుండిపోతారు. కానీ మీ వద్ద ఉన్న అత్యాధునికమైన నోకియా 6600, N72, N75, Sony Erricson P910i వంటి ఫోన్లు మీ అవసరాలను చిటికెలో తీర్చగలుగుతాయి. ఇలాంటి PDA ఫోన్ల ఆవిర్భావంతో. కంప్యూటర్‌కీ సెల్‌ఫోన్‌కీ మధ్య అంతరాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం కొద్దిగా ఖరీదు ఎక్కవగా ఉండే ప్రతీ అత్యాధునిక ఫోనూ ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని కలిగి ఉంటున్నాయి. మనం కంప్యూటర్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎలాగైతే వివిధ సాఫ్ట్‌వేర్లని ఇన్‌స్టాల్ చేసుకుని వేర్వేరు పనుల్ని చక్కదిద్దుకోగలుగుతున్నామో అదే విధంగా సెల్‌ఫోన్లలోనూ వేర్వేరు అవసరాలకు వేర్వేరు సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఎంచక్కా వాటిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని వాటి ద్వారా పూర్తిస్థాయి ప్రయోజనం పొందినప్పుడే మీ శక్తివంతమైన ఫోన్‌కి అర్ధం, పరమార్ధం లభిస్తాయి. అయితే చాలామంది సెల్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్‌లో అసలు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో కూడా ఏమాత్రం ఆవగాహన లేకుండా ఉంటున్నారు. దాంతో శక్తివంతమైన ఫోన్లు కూడా కేవలం ఫోన్ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. అలాగే బ్లూటూత్ ద్వారా వేరే ఫోన్ నుండి మీ ఫోన్‌కి ఏదో వాల్‌పేపర్ ట్రాన్స్‌ఫర్ చేసుకోగానే మీ ఫోన్‌లోకి వైరస్ వచ్చి కూర్చుంటుంది. దాంతో ఏమి చేయాలో తెలియక తలపట్టుకుంటారు. ఫోన్లకి సైతం ఏంటీవైరస్ సాఫ్ట్‌వేర్లు ఉన్నాయని తెలిసినవారు చాలా తక్కువమందే ఉన్నారు . సెల్‌ఫోన్ యూజర్లకి పనికొచ్చే చిట్కాలను అందించడానికి మేము ప్రత్యేకంగా ప్రచురిస్తున్న ఈ పుస్తకంలో వివిధ రకాల సెల్‌ఫోన్ మోడళ్ళు, వాటిలో ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌ల వివరాలు, ఆయా సెల్‌ఫోన్ల వినియోగంలో ఎంతో ఉపయుక్తంగా ఉండే చిట్కాలు, అన్‌లాక్ కోడ్‌లు, ఫోన్ రివ్యూలు, ఆసక్తికరమైన సాఫ్ట్‌వేర్లు, ఫోన్ రేడియేషన్, మీ ఫోన్‌ని ఇతరులు దొంగిలించకుండా ఏం చేయాలి. ఇలా అనేక అంశాల గురించి చాలా విస్తృతంగా చర్చించడం జరిగింది. తెలుగులో ఈ తరహా పుస్తకం ప్రచురించబడడం ఇదే మొదటిసారి. ఈ పుస్తకంలో చర్చించిన పలు చిట్కాలను ప్రాక్టికల్‌గా పాటించి మీ ఫోన్ ద్వారా గరిష్ట ప్రయోజనాన్ని పొందండి.
కంప్యూటర్ ఎరా స్పెషల్ - 7
విండోస్ రిజిస్ట్రీ టిప్స్
స్మాల్ థింగ్స్
స్మాల్ థింగ్స్
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రిజిస్ట్రి అనేది కీలకభూమిక వహిస్తుంది. చాలామందికి రిజిస్ట్రీ అనేది ఒకటి ఉంది అన్న విషయమే తెలియదు. అందులో ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన అనేక కీలకమైన సెట్టింగులు పొందుపరచబడి ఉంటాయని కొద్దిమంది హార్డ్‌వేర్ టెక్నిషియన్లు, ప్రొఫెషనల్స్‌కి మాత్రమే ఆవగాహన ఉంటుంది. విండోస్ రిజిస్ట్రీ పూర్వాపరాలలోకి వెళితే విండోస్ 95 విడుదల అయిన తొలినాళ్ళలో మైక్రోసాఫ్ట్ సంస్థ రిజిస్ట్రీని ఆపరేటింగ్ సిస్టమ్‌లో అంతర్భాగం చేసింది. అప్పట్లో కేవలం వివిధ రకాల ఫైల్ టైప్‌లను ఆపరేటింగ్ సిస్టమ్‌లో నిక్షిప్తం చెయ్యడానికి మాత్రమే రిజిస్ట్రీ ఉద్దేశించబడింది. ఉదా... BMP ఫైల్ టైప్‌ని ఆరేటింగ్ సిస్టమ్‌లో రిజిస్టర్ చేయడంతో పాటు ఆ ఫైల్ టైప్‌కి చెందిన ఫైళ్ళని డీఫాల్ట్‌గా ఏ అప్లికేషన్ ప్రోగ్రామ్‌తో ఓపెన్ చెయ్యాలి అన్న అసోసియేషన్లు కూడా రిజిస్ట్రీలోనే పొందుపరచబడతాయి. ఇలా విండోస్ 95 ఆవిర్భవించిన తొలినాళ్ళలో కేవలం ఫైల్ అసోసియేషన్లు రిజిస్టర్ చెయ్యడానికి మాత్రమే పరిమితమైన విండోస్ రిజిస్ట్రీ తర్వాత కాలంలో మరింత పరిధిని పెంచుకుంది. విండోస్ 98 నుండి ఇటీవలి కాలంలో విడుదల అయిన విస్టా ఆపరేటింగ్ సిస్టమ్ వరకూ విండోస్ రిజిస్ట్రీ అత్యంత కీలకమైన భాగంగా విస్తరించింది. ఇప్పుడు రిజిస్ట్రీలో డెస్క్‌టాప్, టాస్క్‌బార్ ,స్టార్ట్‌మెనూ సెట్టింగులూ, కంట్రోల్ పేనల్, ప్రింటర్స్, మోడెమ్స్ వంటి అంశాల సెట్టింగులు, సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిన ఫాంట్లు, ఆపరేటింగ్ సిస్టమ్ బూటింగ్ సెట్టింగులు ఇలా అనేక అంశాలు రిజిస్ట్రీలో భద్రపరచబడుతున్నాయి. కేవలం ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన అంశాలే కాకుండా మనం కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకునే పేజ్‌మేకర్, ఫోటొషాప్, రియల్ ప్లేయర్, అక్రోబాట్ వంటి పలు థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు సైతం తమ అప్లికేషన్లకి సంబంధించిన అనేక కాన్ఫిగరేషన్ సెట్టింగులను రిజిస్ట్రీలో స్టోర్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రిజిస్ట్రీపై ఆవగాహన కలిగి ఉండి కొద్దిపాటి చిన్న చిన్న మార్పులను చెయ్యడం ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క స్వరూపాన్నీ, అప్లికేషన్ ప్రోగ్రాముల పనితీరునూ మన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని అసలు రిజిస్ట్రీ అంటే ఏమిటి, దానిని ఎలా ఎడిట్ చేయాలి, ఎడిటింగ్‌కి పూనుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రిజిస్ట్రీ ఎడిటింగ్‌లో పొరబాట్లు జరిగితే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి వంటి ప్రాధమికమైన అంశాలను చర్చించడంతోపాటు రిజిస్ట్రీలో చేయదగ్గ పలురకాల మార్పుల గురించి ఈ పుస్తకంలో వివరంగా చర్చించడం జరిగింది. అలాగే ప్రతీ కంప్యూటర్ యూజర్‌కి వివిధ సందర్భాల్లో ఉపకరించే పలు సూచనలను ఇదే పుస్తకంలో "స్మాల్ థింగ్స్" అనే విభాగం క్రింద చర్చించడం జరిగింది. కంప్యూటర్ ఉన్న ప్రతీ వినియోగదారుడికీ ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోండి.
కంప్యూటర్ ఎరా స్పెషల్ - 9
ఏ సాఫ్ట్ వేర్ ఎలా పని చేస్తుంది?
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 3.1, 95 దశలో ఉన్నప్పుడు కేవలం చాలా పరిమితమైన సాఫ్ట్‌వేర్లు మాత్రమే ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌కి లభించేవి . విండోస్ 98 ఆవిర్భావం నుండి విండోస్ ఆధారంగా పనిచేసే ధర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు వెల్లువలా విడుదలవడం ప్రారంభించాయి. ప్రస్తుతం ప్రతీ దైనందిక అవసరానికీ ఒక సాఫ్ట్‌వేర్ లభిస్తోందీ. మీ రోజువారీ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం దగ్గర నుండి మీ కంప్యూటర్‌ని వేగంగా పనిచేసేలా చేయడం వరకూ, ఇంటర్‌నెట్‌లో మీకు నచ్చిన సమాచారాన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసి పెట్టడం మొదలుకుని మీ కంప్యూటర్లో ఎవరు ఏం చేస్తున్నారు అన్నది సీక్రెట్‌గా రికార్డ్ చేసి మీకు రిపోర్ట్ చూపించే సాఫ్ట్‌వేర్లు అయితే ఉన్నాయి కానీ వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది చాలామందికి ఆవగాహన లేక వాటి ద్వారా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ నేపధ్యంలొ ఈ పుస్తకంలో వేర్వేరు సాఫ్ట్‌వేర్లు గురించి, అవి ఏ ప్రయోజనాన్ని అందిస్తాయి అన్న ఆంశం మొదలుకుని వాటిని ఓపెన్ చేసిన తర్వాత ఏయే మెనూలో, ఏయే డైలాగ్ బాక్స్‌లో ఏ విధంగా ఆప్షన్లు ఎంచుకోవాలి, ఎలాంటి ఫలితాలు పొందడానికి ఎలాంటి సెట్టింగులు చేయాలి వంటి అంశాల గురించి చర్చించడం జరిగింది. పిసి యూజర్లకి తరచుగా ఉపయోగపడే వేర్వేరు సాఫ్ట్‌వేర్ల పనితీరు గురించి ఇందులో వివరంగా చర్చించాం. అలాగే ఇదే పుస్తకంలో కంప్యూటర్ రంగంలో అనేక అంశాల గురించి విశ్లేషణాత్మకంగా చర్చించిన అనేక వ్యాసాలను కూడా పొందుపరచడం జరిగింది. ప్రతీ కంప్యూటర్ యూజర్‌కి ఏదో రూపేణా ఇవి ఉపయుక్తంగా ఉండగలవు.
9, డిసెంబర్ 2007, ఆదివారం
ఆడియో Flange ఎఫెక్ట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే..
Sound Forge, Calkwalk Pro వంటి దాదాపు అన్ని రకాల ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్లలో Flange అనే ఒక ఎఫెక్ట్ కన్పిస్తుంటుంది. ప్రస్తుతం మనం వింటున్న techno సౌండ్లలో మ్యూజిక్ చివరి దశలో ఎలా పూర్తవుతుందో మీరు గమనించే ఉంటారు. అప్పటివరకూ ఉధృతంగా విన్పించబడిన మ్యూజిక్ చివరకు వచ్చేసరికి క్రమేపీ తగ్గుతూ కేవలం కొద్ది సెకన్ల వ్యవధిలోనే పూర్తి నిశ్చబ్ధ స్థితికి చేరుకుంటుంది. అనేక తెలుగు పాటల్లోనూ పాటల చివర ఈ ఎఫెక్ట్ ఉపయోగిస్తుంటారు. ఏదైనా ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ లో మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియో ట్రాక్ కీ అలాంటి ఎఫెక్ట్ ఆపాదించుకోవడానికీ Flange ఎఫెక్ట్ ఉపయోగపడుతుంది.
MP3 ఫైళ్లని EXE ఫైళ్లుగా మార్చుకోవచ్చు ఇలా..
MP3 ఫైళ్లని ప్లే చేసుకోవాలంటే VLC Player, Windows Media Player, WinAmp వంటి ఏదో ఒక ఆడియో ప్లేయింగ్ సాఫ్ట్ వేర్ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఆయా ప్లేయర్లు ప్రతీ సిస్టమ్ లోనూ తప్పనిసరిగా లభ్యమవుతున్నాయనుకోండి. ఒకవేళ మీకు బాగా నచ్చిన MP3 సాంగ్ ని ఏదైనా సిడికి... సిడిని ఇన్ సర్ట్ చేసిన వెంటనే దానంతట అదే ప్లే అయ్యే Autorun ఫైల్ గా ఇవ్వదలుచుకున్నారనుకోండి. MP3 ఫైళ్లు నేరుగా ఎటువంటి సాఫ్ట్ వేర్ సపోర్ట్ లేకుండా విన్పించబడవు కదా! అలాంటప్పుడు పనికొచ్చే సాఫ్ట్ వేరే MP3toEXE. మనం సెలెక్ట్ చేసుకున్న ఏ MP3 ఫైల్ నైనా హార్డ్ డిస్క్ లో మనం పేర్కొన్న ప్రదేశానికి ఈ సాఫ్ట్ వేర్ EXE ఫైల్ గా మార్చి సేవ్ చేస్తుంది. అలాగని EXE ఫైల్ గా మారిన తర్వాత ఫైల్ పరిమాణం పెరుగుతుందని భయపడకండి. ఆ ఫైల్ MP3లో ఉన్నప్పుడు ఏ సైజ్ లో అయితే ఉంటుందో EXEగా మార్చబడిన తర్వాత కూడా అదే పరిమాణంలో ఉంటుంది.
8, డిసెంబర్ 2007, శనివారం
శక్తివంతమైన బూటబుల్ సిడి డౌన్‌లోడ్
సహజంగా బూటబుల్ సిడిని క్రియేట్ చేసుకోవలసి వస్తే అధికశాతంమంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని Create Boot Disk వంటి ఆప్షన్‌ని ఉపయోగించి క్రియేట్ చేసుకుంటుంటారు. అదికూడా Win 9x వరకే పరిమితం. XP వంటి వాటిలో సిస్టమ్ ని సిడి నుండి బూట్ చేయడానికి సెటప్ డిస్క్ తప్పనిసరిగా కావలసి వస్తుంది. Win 9xలో ఇలా క్రియేట్ చేసుకున్న బూటబుల్ సిడితో కేవలం కమాండ్ ప్రామ్ట్ వరకు మాత్రమే చేరుకోగలం. కంప్యూటర్‌ని ట్రబుల్ షూట్ చేయడానికి ఏవైనా థర్డ్ పార్టీ టూల్స్ ని రన్ చేయవలసి వస్తే వాటిని మళ్ళీ వేరే సిడి నుండి ఎగ్జిక్యూట్ చేసుకోవలసి వస్తుంది (కొందరు బూట్ సిడిలోనే వాటిని కలిపి రైట్ చేసుకుంటున్నారనుకోండి) అయితే ఈ ఇబ్బందులేమీ లేకుండా Ultimate Boot CD పేరిట ఓ సిడి డౌన్‌లోడ్ చేసుకోవడానికి సిద్ధంగా లభిస్తుంది. దీనిని ఎవరైనా పూర్తి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్, మదర్‌బోర్డ్, హార్డ్ డిస్క్, మెమరీలను ట్రబుల్‌షూట్ చెయ్యడానికి ఉపకరించే అనేక రకాల డయాగ్నస్టిక్ టూల్స్ లబిస్తున్నాయి. ఇందులో CPU burn-in, Mersenne Prime Test, Stress CPU, Memtest86, WIndows Memory Diagnostic, Parallel port detection and test utilities, Intel processor identification utility వంటి అనేక డయాగ్నస్టిక్, ట్రబుల్ షూటింగ్ టూల్స్ సిడిలోనే అంతర్గతంగా పొందుపరచబడి ఉన్నాయి.
6, డిసెంబర్ 2007, గురువారం
రెండు మౌస్‍లు, రెండు పాయింటర్లు
సాధారణంగా మన కంప్యూటర్‌కి ఓ PS/2 మౌస్‌ని కనెక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు USB మౌస్ లూ వాడుకలోకి వచ్చాయి కాబట్టి దాదాపు అందరం వాటినే వాడుతున్నాం. ఎప్పుడైనా PS/2 మౌస్‌తోపాటు ఓ USB మౌస్‌నో, కార్డ్ లెస్ మౌస్‌నో కనెక్ట్ చేసి చూడండి. రెండు మౌస్‌లూ పనిచేస్తాయి. రెండింటిలో ఒకసారికి ఒక మౌస్ మాత్రమే పనిచేస్తుంటుంది. అంటే ఆ రెండు మౌస్‌లూ ఒకే మౌస్ పాయింటర్‌ని కంట్రోల్ చేస్తుంటాయన్నమాట. ఒకే పాయింటర్‌నే అందిస్తున్నప్పుడు రెండు మౌస్‌లు వాడడం దండగ కదా! దీనిని దృష్టిలో ఉంచుకునే మైక్రోసాఫ్ట్ సంస్థ Microsoft Multipoint అనే సాఫ్ట్ వేర్ ని విడుదల చేసింది. ఈ సాఫ్ట్ వేర్ ని మన కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకునప్పుడు మన వద్ద రెండు మౌస్‌లు ఉన్నట్లయితే ఒక్కో మౌస్‌కి ఒక్కో పాయింటర్ చొప్పున లభిస్తుంది. ప్రతీ పాయింటర్‌తోనూ వేర్వేరు పనులను నిర్వర్తించుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్కూళ్లలో కంప్యూటర్ల సంఖ్య తక్కువగా ఉండడం మూలంగా ఒకే కంప్యూటర్‌ని పలువురు విద్యార్థులు పంచుకోవలసి వస్తుంటుంది. అలాంటప్పుడు ప్రతీ విద్యార్థికి ఓ మౌస్ ఏర్పాటు చేయగలిగితే అతను చేయదలుచుకున్న పనులను సులువుగా చేయడానికి వీలుపడుతుంది. దీనికోసమే ఈ సాఫ్ట్ వేర్ ఉద్దేశించబడింది.
ఫైర్‌ఫాక్స్ లో తెలుగు అక్షరాలు కనిపించడం లేదా?
కొన్ని తెలుగు వెబ్ సైట్లని ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ చేసినప్పుడు పై చిత్రంలో విధంగా అక్షరాలు గజిబిజిగా కనిపిస్తుంటాయి.
ఈ పరిస్థితిని అధిగమించి తెలుగు సైట్లలోని సమాచారం ఫైర్ ఫాక్స్ లో సలక్షణంగా కనిపించాలంటే https://addons.mozilla.org/en-US/firefox/addon/873 అనే వెబ్‌పేజీలో కనిపించే Padma అనే add-on ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ add-on ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత తెలుగు, మలయాళం, తమిళం, మరాఠీ,గుజరాతీ, బెంగాలీ,గుర్‌ముఖి వంటి వివిధ భాషల్లోని వెబ్‌పేజీల్లోని సమాచారం సవ్యంగా ఫైర్‌ఫాక్స్ విండోలో ప్రదర్శింపబడుతుంది. మీ సిస్టమ్ లోని ఫైర్ ఫాక్స్ లో తెలుగు సరిగ్గా కనిపించనప్పుడు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
వర్గములు
ఫైర్‌ఫాక్స్ ట్రిక్స్
5, డిసెంబర్ 2007, బుధవారం
మామూలు ఫోన్లని స్మార్ట్ ఫోన్లుగా మార్చుకోండి
మనం వాడే సెల్ ఫోన్లలో మూడు రకాలుంటాయి. కేవలం ఫోన్‌కాల్స్ చేసుకోవడానికి, SMSలు పంపించుకోవడానికి మాత్రమే ఉపయోగపడే బేసిక్‌ఫోన్లు మొదటి రకం కాగా, బ్లూటూత్, జావా సపోర్ట్, WAPబ్రౌజర్ వంటి సదుపాయాలు గల Dumb ఫోన్లు(మోటరోలా MotoRAZARవంటివి) రెండవ రకం ఫోన్లు! మన కంప్యూటర్లో విండోస్ ఎలాగో అలాగే ఫోన్లలోనూ Symbian, Windows Mobile వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లు కలిగిన స్మార్ట్ ఫోన్లు మూడవ రకం. అయితే చాలామంది దాదాపు స్మార్ట్ ఫోన్లని కొనుగోలు చేయగల బడ్జెట్‌కి కేవలం ఫోన్ డిజైన్‌కి బుట్టలో పడో, సరైన ఆవగాహన లేకనో రెండవ రకమైన Dumbఫోన్లని ఎంచుకుంటుంటారు. వీటిలో కేవలం కొన్ని ప్రాధమికమైన సాఫ్ట్ వేర్లని మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వీలుపడుతుంది. మీవద్ద ఇలాంటి ఫోన్లు ఉన్నట్లయితే మీకు అందుబాటులో ఉన్న కొన్ని అదనపు సదుపాయాల గురించి చూద్దాం. మీ ఫోన్లలో నెట్‌ని బ్రౌజ్ చేసుకోవడానికి ఫోన్‌లో ఉండే డీఫాల్ట్ WAP బ్రౌజర్‌కి బదులుగా Opera Mini అనే సాఫ్ట్ వేర్ వాడండి. అలాగే మీకు GPRS కనెక్షన్ ఉంటే Google,Yahoo మెయిల్స్ ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే VNC సాఫ్ట్ వేర్‌ని మీ ఫోన్‌లోనూ, పిసిలోనూ ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా నెట్ ఆధారంగా ఎక్కడినుండైనా మీ పిసిని ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే Mobispine అనే ప్రోగ్రామ్ ద్వారా RSSఫీడ్లనూ ఫోన్‌లో చదువుకోవచ్చు.
XPS ఫార్మేట్ గురించి తెలుసా?
XML Paper Specification అనే ఫార్మేట్ ని క్లుప్తంగా XPS అంటారు. ఇది మైక్రోసాఫ్ట్ అభివృద్ధి పరిచిన XML ఆధారిత డాక్యుమెంట్ ఫార్మేట్. ఇప్పటివరకూ Enhanced Metafile (EMF)గా వాడుకలో ఉన్న ఫార్మేట్ స్థానంలో ఈ కొత్త ఫార్మేట్ ని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రవేశపెట్టింది. మనం ఫొటోషాప్, వర్డ్, ఎక్సెస్ వంటి వివిధ రకాల ప్రోగ్రాములతో అనేక డాక్యుమెంట్లని డిజైన్ చేస్తుంటాం. అయితే ఆయా ఫైళ్లని ఓపెన్ చేయాలన్నా, ప్రింట్ తీయాలన్నా దాని ఒరిజినల్ అప్లికేషన్ కావలసిందే కదా! అయితే XPS ఫార్మేట్ కి చెందిన డాక్యుమెంట్లని ఓపెన్ చేయాలన్నా, ప్రింట్ తీయాలన్నా అవి ఏ అప్లికేషన్ తో క్రియేట్ చేయబడ్డాయో ఆ అప్లికేషన్ ని మన సిస్టంలో ఇన్ స్టాల్ చేయనవసరం లేదు. Microsoft XPS Document Writer సాయంతో క్రియేట్ చేసుకున్న XPS డాక్యుమెంట్లని ఏ థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ అవసరం లేకుండానే నేరుగా ఓపెన్ చేసుకోవచ్చు. Windows, Mac, Solaris, Unix వంటి వేర్వేరు ఆపరేటింగ్ సిస్టం ల మధ్య సమాచారాన్ని బదిలీ చేయడానికి ఈ ఫార్మేట్ ఉపయుక్తంగా ఉంటుంది. భవిష్యత్లో విడుదల చేయబడే అన్ని ప్రింటర్లూ XPS ఫార్మేట్ ని సపోర్ట్ చేసేవిగా రూపొందించబడతాయి. Windows Vista ఆపరేటింగ్ సిస్టంలో XPS Viewer ప్రోగ్రాం ఆల్రెడీ పొందుపరచబడి ఉంటుంది. Windows XP, Server 2003 లకు ఇది కావాలంటే http://download.microsoft.com/download/4/d/a/4da3a5fa-ee6a-42b8-8bfa-ea5c4a458a7d/dotnetfx3setup.exe అనే లింకు ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
4, డిసెంబర్ 2007, మంగళవారం
ట్రోజాన్‍లతో చాలా జాగ్రత్త...
ఒకప్పుడు వైరస్‌ల పేరు వింటే హడలిపోయేవారు. ఇప్పుడు Trojan Horses అందరిని అదరగొడుతున్నాయి. మనకు ఎదో మేలు చేస్తుందన్న భావనను కల్పించి మనకు మనం స్వయంగా డౌన్‌లోడ్ చేసుకునేటట్లు ప్రేరేపించి తీరా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మన కంప్యూటర్‌పై పూర్తి నియంత్రణను దానిని పంపించిన యూజర్‌కి అందించేదే TrojanHorse. మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పరిజ్ఞానం ఉన్న ప్రోగ్రామర్లు మాత్రమే ఇలాంటి వాటిని రూపొందించగలుగుతారన్న తప్పుడు అభిప్రాయం చాలామందిలో ఉంది. ట్రోజాన్లని రూపొందించడానికి ప్రస్తుతం అనేక మార్గాలు అందుబాటులోకి రావడం వల్ల ఎవరుబడితే వారు వాటిని రూపొందించి ఇతరుల సిస్టమ్‌లలోకి పంపించగలుగుతున్నారు.
సహజంగా కొన్ని ప్రత్యేకమైన ట్రోజాన్ తయారీ సాఫ్ట్‌వేర్లని ఉపయోగించి Server.exe పేరిట ఓ ఫైల్‌ని క్రియేట్ చేస్తారు. సహజంగా ఇది 90, 120KBల వంటి చాలా తక్కువ సైజ్‌లో ఉంటుంది. దీనిని ఏదైనా అశ్లీల ఫోటోకి Binder పేరిట లభించే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ సాయంతో జతచేస్తారు. ఇక యాహూ చాట్‌రూమ్‌లు వంటి వాటిలోకి ఆడవారి మెయిల్ ఐడిలతో లాగిన్ అయి తమకు PMలు పంపించే మగవారిని మెల్లగా మాటల్లో పెట్టేసి "నా ఫోటో చూస్తారా" అంటూ ఆరా తీసి అవతలి వ్యక్తి ఆసక్తి చూపించగానే ఇంతకుముందు అశ్లీలచిత్రంలో దాచిపెట్టిన ట్రోజాన్ ప్రోగ్రామ్‌ని అవతలి వ్యక్తికి పంపిస్తారు. అవతలి వ్యక్తి దానిని ఓపెన్ చేయగానే ఫోటో కనిపిస్తుంది కాని బ్యాక్‌గ్రౌండ్‌లో తన సిస్టమ్‌లోకి ట్రోజాన్ ప్రవేశించిందన్న విషయం అతనికి తెలియదు. ఇక అంతే. అప్పటినుండి ఆ వ్యక్తి యొక్క IP అడ్రస్ ట్రోజాన్ పంపించిన వ్యక్తికి చేరవేయబడుతుంటుంది. ఆ అడ్రస్ ఆధారంగా అవతలి వ్యక్తి యొక్క కంప్యూటర్‌ని కంట్రోల్ చేస్తుంటారు.
ఉచిత వెబ్‍సైట్ నిర్వహించుకోదలుచుకుంటే...
ఇటీవలి కాలంలో ప్రతీ ఒక్కరూ తమ వివరాలు, ఫోటోలు, వీడియోలు తదితర సమాచారంతో ఇంటర్నెట్‌పై వెబ్‌సైట్లు సృష్టించుకుంటున్నారు. అనేక వెబ్ హోస్టింగ్ సర్వీసులు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇదే కోవలో ఈ మధ్య 12GB భారీ కెపాసిటీని అందిస్తూ వెబ్‌హోస్టింగ్ సర్వీసును అందించే ww.12gbfree.com అనే వెబ్‌సైట్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. సహజంగా ఉచితంగా వెబ్‌హోస్టింగ్ సేవలను అందించే అనేక ఇతర సర్వీసులు రకరకాల అడ్వర్‌టైజ్‌మెంట్లను (ఒక్కోసారి అశ్లీలమైనవి కూడా) మన వెబ్‌సైట్లలో చూపిస్తుంటాయి. వాటిని భిన్నంగా ఈ వెబ్‌సైట్ బలవంతపు అడ్వర్‌టైజ్‌మెంట్లు వేటినీ చూపించదు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారికి, స్వంత వెబ్‌సైట్లని రూపొందించుకోవాలని కోరిక ఉన్న వ్యక్తులకు ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. ఈ సర్వీస్ 25GB వరకూ నెలసరి డేటా ట్రాన్స్‌ఫర్‌ని కల్పిస్తోంది. కాబట్టి పెద్ద పెద్ద వీడియోలు, సాఫ్ట్‌వేర్లు పొందుపరుచుకుంటే తప్ప కేవలం చిన్నపాటి అవసరాలకు వెబ్‌సైట్‌ని నిర్వహించుకునే వారికి ఇది భేషుగ్గా సరిపోతుంది. FTP సపోర్ట్ లభిస్తోంది. మీ సైట్‌ని ఏరోజు ఎంతమంది విజిట్ చేశారన్న వివరాలు అందించబడతాయి. మీ సైట్‌కి అనుబంధంగా బ్లాగులు, ఫోరమ్‌లు ప్రారంభించుకోనూ వచ్చు!
3, డిసెంబర్ 2007, సోమవారం
ఈ ఫైళ్లు ఎందుకూ పనికిరావు...
తక్కువ ధరలకే భారీ స్టోరేజ్ సామర్థ్యం గల హార్డ్ డిస్కులు లభిస్తున్న ప్రస్తుత తరుణంలో గతంలో హార్డ్ డిస్కు నుండి అనవసరమైన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకునే వారు కూడా "చాలా స్పేస్ ఉంది కదా" అని బద్ధకిస్తున్నారు. డిస్క్ స్టోరేజ్ సామర్ధ్యం ఎంత భారీగా ఉన్నా అందులో సమాచారం ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయి ఉంటే ఖచ్చితంగా కంప్యూటర్ పనితీరు మందగిస్తుంది. కాబట్టి వీలైనప్పుడలా విండోస్ లోని టెంపరరీ ఫోల్డర్, Cookies, History, Temporary Internet Files ఫోల్డర్లలోని ఫైళ్లని డిలీట్ చేసుకోవడం మంచిది. అలాగే Start>Find/Search ఆప్షన్ ద్వారా హార్డ్ డిస్కులో *.tmp, *.~mp, *.gid, *.fts, *.chk, *.00*, *.$$$, *.*$, *.syd, *.old, *.bak వంటి ఎక్స్ టెన్షన్ నేమ్ లను కలిగి ఉన్న ఫైళ్లన్నింటినీ తొలగించుకోండి. వాటన్నింటినీ డిలీట్ చేసిన తర్వాత ఒకసారి డిస్క్ డీఫ్రాగ్ మెంటేషన్ ప్రోగ్రామ్ ని రన్ చేయడం మంచిది. ఒకవేళ ఏవైనా ఫైళ్లని డిలీట్ చేస్తే ప్రాబ్లెమ్ వస్తుందేమోనని సందేహం వచ్చినట్లయితే వాటిని వేరే లొకేషన్ కి మూవ్ చేసి కొన్నాళ్లపాటు అబ్జర్వేషన్ లో పెట్టి వాటిని మూవ్ చేయడం వల్ల ఎలాంటి సమస్య రాకపోయినట్లయితే వాటిని తొలగించవచ్చు. విండోస్ లోని Disk Cleanupని రన్ చేయడం ద్వారా కూడా అధికశాతం వృధా ఫైళ్లని తొలగించుకోవచ్చు.
వీడియో మెమరీ గురించి తెలుసా?
మన సిస్టమ్ లోని డిస్ ప్లే కార్డ్ స్వయంగా లేదా మెయిన్ RAM నుండి షేర్ చేసుకునే మెమరీ పరిమాణాన్ని బట్టి మన పిసిలోని గ్రాఫిక్స్ పనితీరు నాణ్యత, వేగం ఆధారపడి ఉంటాయి. డిస్ ప్లే కార్డులపై పొందుపరచబడి ఉండే మెమరీని 'ఫ్రేమ్ బఫర్' అని కూడా పిలుస్తుంటారు. వీడియో మెమరీ అవసరం ఏమిటో ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం. మనకు మోనిటర్ పై కన్పించే ప్రతీ అంశాన్నీ స్టోర్ చేసుకోగల కెపాసిటీ వీడియో మెమరీకి ఉండాలి. ఒక ఫొటోని మార్చిన వెంటనే లేదా ఒక సాఫ్ట్ వేర్ ని ఓపెన్ చేసిన వెంటనే అప్పటి వరకూ స్క్రీన్ పై ఉన్న దృశ్యం మారిపోతుంది. ఇలా మారిపోయిన దృశ్యాన్ని మన పిసిలోని సిపియు వీడియో కార్డ్ కి చేరవేస్తుంది. వీడియో కార్డ్ పై ఉండే 'వీడియో ప్రాసెసర్' దాన్ని ప్రాసెస్ చేసి టెంపరరీగా ఫ్రేమ్ బఫర్ లో భద్రపరస్తుంది. ఇలా వీడియో ఫ్రేమ్ బఫర్లో నిల్వ చేయబడి ఉండే ఇమేజ్ లను భారీ బిట్ మ్యాప్ ఇమేజ్ లుగా ఊహించుకోవచ్చు. ఇలా నిరంతరం మనకు మోనిటర్ పై ప్రదర్శించబడవలసిన స్క్రీన్ ఇమేజ్ రిఫ్రెష్ చేయబడుతూ సరికొత్త ఫ్రేమ్ లు ఫ్రేమ్ బఫర్ లోకి వచ్చి చేరుతుంటాయి. ఈ నేపధ్యంలో వీడియో రామ్ గా పిలవబడే ఫ్రేమ్ బఫర్ తక్కువగా ఉంటే అది ఎక్కువ ఇమేజ్ లను స్టోర్ చేసుకోలేక స్క్రీన్ పై అంశాలన్నీ స్లో మోషన్ లో కదులుతూ మనకు అసౌకర్యాన్ని కలుగజేస్తుంటాయి. ఇప్పుడు వస్తున్న మదర్ బోర్డ్ లలో ఆన్ బోర్డ్ డిస్ ప్లే చిప్ లు సైతం మెయిన్ మెమరీ నుండి ఎక్కువ మొత్తంలో స్థలాన్ని వినియోగించుకుంటుండడం వల్ల ఈ తరహా ఇబ్బందులు పెద్దగా తలెత్తడం లేదు.