27, సెప్టెంబర్ 2007, గురువారం
SATA - ఇంటర్‌ఫేస్ ఎందుకు?
SATA - అధునాతన మదర్‌బోర్డ్ లన్నింటిలో పొందుపరచబడుతున్న కనెక్టివిటీ ఇంటర్‌ఫేస్! Serial ATA అనే పదాన్ని సంక్షిప్తంగా SATA అని పిలుస్తుంటారు. ఇంతకుముందు ఉపయోగించబడిన Parallel ATA అనే ఇంటర్‌ఫేస్ స్థానంలో ప్రవేశించిందీ కొత్త టెక్నాలజీ. మదర్‌బోర్డ్ లపై SATA సపోర్ట్ ని అందిస్తుండడంతో ప్రస్తుతం ఈ హార్డ్ డిస్కులు, సిడి/డివిడి రైటర్లు కూడా SATA వి లభిస్తున్నాయి. SATA డిస్కులను మామూలు PATA డిస్క్ ల మాదిరిగా Master, Slave అని జంపర్ సెట్టింగులని కాన్ఫిగర్ చేయవలసిన అవసరం లేదు. SATA డిస్క్ లు తమకి తాము ప్రత్యేకమైన చానెల్‌ని వినియోగించుకుంటాయి. కాబట్టి మామూలు డ్రైవ్‌లలో మాదిరిగా జంపర్ సెట్టింగుల పనిలేదు.
SATA ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ అంత అవసరమా?
భారీ స్టోరేజ్ కెపాసిటీ గల హార్డ్ డిస్క్ లు విడుదల అవుతుండడం, మరోవైపు క్రమేపీ పవర్‌ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, అప్లికేషన్ ప్రొగ్రాములు, గేమ్‌లు మార్కెట్లో ప్రవేశిస్తుండడంతో SATA ఇంటర్‌ఫేస్ రూపం సంతరించుకుంది. SATA 1 ఇంటర్‌ఫేస్ ద్వారా సెకనుకి 150MB డేటానీ, SATA 2 ఇంటర్‌ఫేస్ ద్వారా 300MB ట్రాన్స్ ఫర్ రేట్‌ని సాధించవచ్చు. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. SATA ఇంటర్‌ఫేస్‌కి సంబంధించిన సామర్ధ్యం మాత్రమే ఇది. SATA హార్డ్‌డిస్క్ ని మీ కంప్యూటర్‌లో పెట్టుకుని .. 'సార్, మీరు చెప్పినంత స్పీడ్ రావట్లేదు ' అనకండి. కేవలం ఇంటర్‌ఫేస్ బాగా స్పీడై ఉన్నంత మాత్రాన సరిపోదు. హార్డ్‌డిస్క్ ల యొక్క RPM(నిమిషానికి తిరిగే చుట్ల సంఖ్య), బఫర్ సైజ్ పరిమితంగా ఉన్నంత కాలం మీరు SATA ఇంటర్‌ఫేస్ ఉన్న సిస్టమ్‌ని వాడుతున్నా ఉపయోగంలేదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హార్డ్‌డిస్క్ లు గరిష్టంగా 10000 RPM తో తిరిగేవి లభిస్తున్నాయి. వీటిని SATA ఇంటర్‌ఫేస్‌కి కనెక్ట్ చెయ్యడం వల్ల సెకనుకు 80MB మేరకు సమాచారాన్ని మాత్రమే ట్రాన్స్ ఫర్ చేసుకోవడం వీలవుతుంది.
ఏయే కేబుళ్ళు అవసరం అవుతాయి…
మీ మదర్‌బోర్డ్ పై SATA సపోర్ట్ ఉంటే మదర్‌బోర్డ్ తో పాటు 7-pin డేటా కేబుల్ అందించబడుతుంది. దానిని ఒక వైపు మదర్‌బోర్డ్ పై కనెక్ట్ చేసి రెండవ చివర్న SATA హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేయాలి. డిస్క్కి పవర్‌సప్లై ఇవ్వడానికి 15-pin పవర్ కేబుల్‌ని ఉపయోగించాలి. అధికశాతం SATA డ్రైవ్‌లు తమకు కావలసిన విద్యుత్ కోసం 15-pin పవర్ కేబుళ్ళపైన గానీ , లేదా మన సిస్టమ్‌లలో సాధారణంగా కనిపించే 4-pin పవర్ కేబుళ్ళపై గానీ ఆధారపడతాయి. రెండింటిలో ఏదో ఒక దాని ద్వారా మాత్రమే పవర్ సప్లై అందించాలి. 25-pin కేబుల్ లేకపోతే 43-pin to 15-pin పవర్ అడాప్టర్‌ని వాడవచ్చు.
డ్రైవ్ గుర్తించబడలేదా?
మీ మదర్‌బోర్డ్ కి డీఫాల్ట్ గా SATA సపోర్ట్ ఉంటే సమస్యే లేదు. ఒకవేళ మీరు కొత్తగా కొన్ని SATA హార్డ్ డిస్క్ని వాడడం కోసం, మీ మదర్‌బో్ర్డ్ పై SATA సపోర్ట్ లేకపోయినా థర్డ్ పార్టీ SATA కంట్రోల్లర్‌ని అమర్చుకున్నట్లయితే ఆ కంట్రోలర్‌కి సంబంధించిన డివైజ్ డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేయకపోతే ఆ కంట్రోలర్‌కి మీరు కనెక్ట్ చెసిన SATA హార్డ్ డిస్క్ గుర్తించబడదు. ఇకపోతే మదర్‌బోర్డ్ పైనే SATA సపోర్ట్ ఉన్నట్లయితే మీ మదర్‌బోర్డ్ సిడిలోనే SATA కంట్రోలర్‌కి సంబంధించిన డ్రైవర్లు పొందుపరచబడి ఉంటాయి. కొన్ని మదర్‌బోర్డ్ ల విషయంలో ఫ్లాపీ్‌డిస్క్ ల్లో డ్రైవర్లు అందించబడుతుంటాయి. వాటిని తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకుంటేనే సపోర్ట్ లభిస్తుంది.
డ్రైవర్లు ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
మదర్‌బోర్డ్ తో పాటు ఫ్లాపీలో SATA కంట్రోలర్ డ్రైవర్లు అందించబడితే ఓ.కే. మదర్‌బోర్డ్ సిడిలో డ్రైవర్లు ఇవ్వబడినట్లయితే ముందు వేరే కంప్యూటర్‌లో ఆ సిడిని పెట్టి అందులోని Drivers అనే ఫోల్డర్‌లో ఉండే MakeDisk.exe అనే ప్రోగ్రామ్‌ని రన్ చేయడం ద్వారా ఒక ఖాళీ ఫ్లాపీలోకి SATA డ్రైవర్లని కాపీ చేసుకోండి. ఇప్పుడు Windows XP Setup సిడితో సిస్టమ్‌ని బూట్ చేసి కొద్ది క్షణాల తర్వాత స్క్రీన్‌పై Press F6 if you need to install a third party SCSI drivers అనే మెసేజ్ కనిపించినపుడు F6 కీని ప్రెస్ చేయండి. ఇప్పుడు S కీని ప్రెస్ చేసి SATA కంట్రోలర్ డ్రైవర్లు ఉన్న ఫ్లాపీ డిస్క్ ని డ్రైవ్‌లో ఇన్‌సర్ట్ చేసి డివైజ్‌ని పేర్కొంటే డ్రైవర్లు ఇన్‌స్టాల్ అవుతాయి.
1 కామెంట్:
nice information keep going in the same way by giving good articles to people who are not aware of computer kwoledge , but You should remember that the knowledge should be freely disseminate to the people
narendra.B, Narendrabalaga@gmail.com
కామెంట్‌ను పోస్ట్ చేయండి