
వృత్తి స్వభావాన్ని బట్టి ఒక్కొక్కరు నెలకు, సంవత్సరానికి, రోజుకి, గంటకు ఇంత అని సంపాదిస్తుంటారు. పేరున్న కన్సల్టెంట్లు, అడ్వకేట్లు, ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు వంటి వారు ఓ ప్రాజెక్ట్ పై తాము ఎంత కాలం సేవలను వెచ్చించామన్న అంశం ఆధారంగా ఫీజులను వసూలు చేస్తుంటారు. ఒక్కోసారి తాము పనిచేసిన గంటలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి వస్తుంటుంది. దీనికోసం ఎక్కువగా క్యాలెండర్లు, PIM లపై ఆధారపడుతుంటారు. దానికి బదులు TaskBlaze అనే ప్రోగ్రామ్‍ని ఓ సారి ఉపయోగించి చూడండి. ఈ ఉచిత మృదులాంత్రము(software) ఏ task మీదైనా మనం వెచ్చించే సమయాన్ని ఖచ్చితంగా లెక్కిస్తూ ఉంటుంది. Taskని ప్రారంభించగానే ఈ ప్రోగ్రామ్‍ని ఓపెన్ చేసి Timer ని క్లిక్ చేయండి. పని పూర్తవగానే టైమర్‍ని ఆపేయండి. ఇప్పుడు ఆ Task పై మీరు వెచ్చించిన మొత్తం సమయం Outlook Schedule గా Export చేయబడుతుంది. ఈ సమాచారం ఆధారంగా మీ కస్టమర్ల నుండి ఫీజు వసూలు చేయవచ్చు. నిరంతరం బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ కి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి